PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgఅయితే.. గ‌త ఏడాది ఓడిపోయినంత మాత్రాన జేసీ వ‌ర్గాన్ని త‌క్కువ‌గా అంచ‌నావేయ‌లేమ‌న్న విష‌యాన్ని పెద్దారెడ్డి గ్ర‌హించ‌లేక పోతున్నార‌నేది వైసీపీ నేత‌ల మాట‌. ఈ క్ర‌మంలో క్షేత్ర‌స్థాయి నుంచి అందిన నివేదిక‌లు.. ఇంటిలిజెన్స్ నివేదిక ఆధారంగా.. అనం త‌పురంలో జేసీ వ‌ర్గాన్ని క‌నుక త‌మ‌వైపు తిప్పుకొంటే.. ఇక వైసీపీకి తిరుగేలేద‌ని.. పార్టీ కీల‌క నేత‌లు భావిస్తున్నారు. ఈ క్ర‌మం లోనే పెద్దారెడ్డిని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో తాడిప‌త్రి మునిసిపాలిటీలో వైసీపీ, Jagan Ysrcp{#}TDP;Dookudu;Cheque;local language;District;MLA;YCP;Reddy;Partyఆ వైసీపీ ఎమ్మెల్యేకు పొగ పెడుతున్నారా... జ‌గ‌న్ వ్యూహ‌మేంటి...?ఆ వైసీపీ ఎమ్మెల్యేకు పొగ పెడుతున్నారా... జ‌గ‌న్ వ్యూహ‌మేంటి...?Jagan Ysrcp{#}TDP;Dookudu;Cheque;local language;District;MLA;YCP;Reddy;PartySun, 01 Aug 2021 11:55:00 GMTఔను! వైసీపీ కీల‌క నేత‌.. ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా ప్ర‌చారంలో ఉన్న అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గం.. ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సొంత పార్టీ నేత‌లే పొగ‌బెడుతున్నారా?  ఆయ‌న‌ను పార్టీలో ఒంట‌రిని చేయాల‌ని చూస్తున్నారా? అంటే.. ఔన‌నే ఆన్స‌రే వ‌స్తోంది. నిజానికి 35 ఏళ్ల జేసీ ప్ర‌స్తానాన్ని ప‌క్క‌కు పెట్టి.. తొలిసారి తాడిప‌త్రిలో జేసీ ఫ్యామిలీయేత‌ర అభ్య‌ర్థిగా విజ‌యం ద‌క్కించు కుని.. పెద్దారెడ్డి రికార్డు సృష్టించార‌నడంలో సందేహం లేదు. అయితే.. ఆయ‌న దూకుడే ఆయ‌న‌కు క‌ళ్లెం వేస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది. జేసీ వ‌ర్గంపై పెద్దారెడ్డి దూకుడుగా ఉన్నారు. ప్ర‌భాక‌ర్‌తో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో రాజ‌కీయం చేస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే.. గ‌త ఏడాది ఓడిపోయినంత మాత్రాన జేసీ వ‌ర్గాన్ని త‌క్కువ‌గా అంచ‌నావేయ‌లేమ‌న్న విష‌యాన్ని పెద్దారెడ్డి గ్ర‌హించ‌లేక పోతున్నార‌నేది వైసీపీ నేత‌ల మాట‌. ఈ క్ర‌మంలో క్షేత్ర‌స్థాయి నుంచి అందిన నివేదిక‌లు.. ఇంటిలిజెన్స్ నివేదిక ఆధారంగా.. అనం త‌పురంలో జేసీ వ‌ర్గాన్ని క‌నుక త‌మ‌వైపు తిప్పుకొంటే.. ఇక వైసీపీకి తిరుగేలేద‌ని.. పార్టీ కీల‌క నేత‌లు భావిస్తున్నారు. ఈ క్ర‌మం లోనే పెద్దారెడ్డిని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో తాడిప‌త్రి మునిసిపాలిటీలో వైసీపీ, టీడీపీల‌కు బొటాబొటి(అంటే.. కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే.. టీడీపీకి మెజారిటీ వ‌చ్చారు) స్థానాలు ద‌క్కాయి.

దీంతో జేసీ వ‌ర్గానికి చెక్ పెట్టేందుకు టీడీపీ త‌ర‌ఫున కౌన్సిల‌ర్ల‌ను వైసీపీ వైపు తిప్పేసేందుకు.. పెద్దారెడ్డి ప్ర‌య‌త్నించేందుకు చూ శారు. అయితే.. పార్టీ అధిష్టానం నుంచి వ‌ద్ద‌ని సందేశం రావడంతో ఆయ‌న వెన‌క్క త‌గ్గాల్సి వ‌చ్చింది. ఇక‌, తాడిప‌త్రిని ద‌క్కించు కున్న జేసీ.. జ‌గ‌న్‌కు అనుకూలంగా కామెంట్లు చేశారు. అదేస‌మ‌యంలో చైర్మ‌న్‌గా ప్ర‌భాక‌ర్ రెడ్డి ఎన్నిక‌వ‌గా.. వైస్ చైర్మ‌న్ ప‌ద విని అయినా..  వైసీపీ ద‌క్కించుకునే అవ‌కాశం ఉన్నా.. పార్టీ అధిష్టానం ఆదేశాల‌తో పెద్దారెడ్డి త‌న వ్యూహాన్ని వెన‌క్కి తీసుకు న్నారు. దీంతో జేసీ వ‌ర్గం.. ఇక‌, త‌గ్గింది.. అనుకున్న‌ప్ప‌టికీ.. సొంత పార్టీ అనుస‌రిస్తున్న వైఖ‌రితో.. మ‌ళ్లీ జేసీలు పుంజుకుంటున్నారు. దీంతో పెద్దారెడ్డి అంత‌ర్మ‌థ‌నంలో ప‌డ్డారని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌న‌ను మార్చ‌డ‌మే ధ్యేయంగా ప‌నిచేస్తున్నారా ?  అనే సందేహం.. ఆయ‌న త‌న అనుచ‌రుల ద‌గ్గ‌ర వ్య‌క్తం చేస్తున్నారు. లేక‌పోతే..నిన్న మొన్న‌టి వ‌ర‌కు కేసులు, అరెస్టులు అంటూ.. హ‌డావుడి చేసిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. ఇప్పుడు చిన్న అవ‌కాశం ఉంటే.. జేసీల‌కు ఛాన్స్ లేకుండా చేసే అవ‌కాశం ఉండికూడా తాడిప‌త్రిని వారికే అందించ‌డం.. వైస్ చైర్మ‌న్ ప‌ద‌వినీ వ‌దులు కోవ‌డం వంటివి.. జేసీల దూకుడు పెర‌గ‌డం వంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న పెద్దారెడ్డి.. త‌న‌కు ఎర్త్ పెడుతున్నారా? అనే సందేహాలు వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి జ‌గ‌న్ మ‌దిలో ఏముందో తెలియాలంటే..వెయిట్ చేయాల్సిందే.





తాడిప‌త్రి రాజ‌కీయాల్లో జేసీ వ‌ర్సెస్ పెద్దారెడ్డి.. ముదురుతోన్న యుద్ధం ?

పెగాసస్ స్పైవేర్ పై నేడు సుప్రీంకోర్టు లో విచారణ

స్కూల్ టూ సినిమా చ‌ర‌ణ్, శ‌ర్వానంద్ దోస్తానా..!

బండి సంజయ్‌కి అధిష్టానం షాక్‌.. పాదయాత్రకు బ్రేక్‌ ?

ఏపీ నార్త్‌కు కొత్త ఎమ్మెల్యే వ‌చ్చేశాడు...!

బీజేపీకి చుక్క‌లు చూపిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే...!

పవన్ కీలక నిర్ణయం... బ్యాక్ టు పాలిటిక్స్ ?

వాట్సాప్ కి ప్రత్యామ్నాయంగా కొత్త యాప్.. పేరేంటో తెలుసా?

తెరాస ఆకర్షుతో .. బిజెపి' కాంగ్రెస్ విలవిల..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>