LifeStyleRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/morning-raagaa-c5c5e4c5-427e-41c1-b55f-04285256d063-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/morning-raagaa-c5c5e4c5-427e-41c1-b55f-04285256d063-415x250-IndiaHerald.jpgఈ పండుగ‌ల‌కూ కానుక‌ల‌కూ మ‌ధ్య ఓ వినిమ‌య ప్ర‌పంచం ఉంటుంది.వినిమ‌య సంస్కృతి కార‌ణంగానే మార‌కం మారిపోతుంది. ఆ విధంగా స్నేహంలో ఇత రుల స్నేహంలో మార్క్స్ క‌నిపిస్తాడు. ఆ విధంగా మార్క్స్ నా స్నేహితుడు నేను ఎవ్వ‌రికీ లైఫ్ ఇవ్వ‌ను ఇవ్వ‌లేను అని చెప్పాడు ఆర్జీవీ.. ఆ విధంగా వాడూ నా స్నేహితుడే.. మ‌నిషి ఇలా ఉండ‌డంలో ఉన్న త‌ప్పులు ఎన్ని ఉన్నాయో లెక్కిస్తూ వ‌స్తే ఈ నేలపై కొన్ని మాత్ర‌మే అమితంగా ద‌గ్గ‌ర‌గా తోచేయి. morning raagaa {#}prema;vennela;Culture;Adimulapu Suresh;surya sivakumar;Manam;Loveమార్నింగ్ రాగా : స్నేహం ... సూర్య లంక సముద్ర తీరానమార్నింగ్ రాగా : స్నేహం ... సూర్య లంక సముద్ర తీరానmorning raagaa {#}prema;vennela;Culture;Adimulapu Suresh;surya sivakumar;Manam;LoveSun, 01 Aug 2021 11:04:20 GMTమార్నింగ్ రాగా : స్నేహం ... సూర్య లంక సముద్ర తీరాన

అక్క‌డి నుంచే చెప్పే మాట‌లు
అక్క‌డి నుంచి చెప్ప‌ని మాట‌లు
ఆ తీరం నుంచి ఈ తీరం వ‌ర‌కూ
త‌రిమిన గానం త‌ర‌మ‌ని మౌనం
అన్నీ నాలో అండ్ నాతో
అర్థం చెడాకే స్నేహం
అర్థం తెలిశాకే ప్రేమ
అన్నీ వెలుగు విల‌యం
తేడా తెలిపి పోతాయి

జీవితంలో మ‌నం మిగుల్చుకున్న‌వి
జీవితాంతం తోడుంటాయి అని చ‌దివేను

జీవితంలో మ‌నం వ‌ద్ద‌నుకున్న‌వి
జీవితాంతం వేధిస్తాయి అని నిర్థారించాను

ప‌ర‌స్ప‌ర స్నేహం
ప‌ర‌స్ప‌ర అంగీకారం అన్న‌వి
వేరు వేరుగా ఉంటాయి
మ‌నం ప్ర‌పంచంలో పొందేవి
మనం  ప్ర‌పంచం నుంచి ఆశించేవి
ఒక్క‌టి అయి ఉంటాయా?
తెలియ‌దు..

నిండైన విశ్వాసం ఇచ్చిన స్నేహాలు
వెన్నెల రాత్రులు..అమ‌వాస రోజులు
అన్నీ ఉంటాయి మ‌న‌తో
దేనినీ వ‌ద్ద‌నుకోవ‌డం నిర్ణ‌యం..
..........దేనినో అంగీక‌రించ‌డ‌మో
అనుభవంలోకి తీసుకోవ‌డమో..విజ్ఞ‌త
స్నేహం విజ్ఞ‌త‌తో పాటు నాలో విరుద్ధ‌త కూడా..

....లోప‌లి చెడును వ‌దులుకుని  
స్నేహం చేసిన వాళ్లు ఉన్నారా?
 
స‌త్యాన్ని ఆవిష్క‌రించాల‌న్న త‌ప‌న‌లో స్నేహం ఉంటుంద‌ని అనుకోను. నీకు విజ‌యం నీకు ఓట‌మి ద‌క్కాక కూడా కొన్ని మాత్ర మే మ‌రింత చేరువుగా ఉంటాయి..లోపాలు మాత్రం స్నేహం చెబుతుంది అని  చెప్పేంత  మంచి నాలో లేదు. లోపాలు చెప్పినా చె ప్ప‌కున్నా లోప‌లి చెడు ఎక్క‌డికీ పోదు.. అది వాన చినుకుల రాక‌తో పోదు..లేదా మంచు సోన‌ల పుల‌క‌రింత‌ల‌తోనూ పోదు.. లో పలి చెడును అలానే  ఉంచి బ‌య‌ట మంచిని మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు మార్చుకుంటూ పొండి. ఆ మంచి పేరు మీ స్నేహం కావొ చ్చు..లేదా మీరు అనుకున్న ప్రేమ కావొచ్చు. లోప‌లి చెడుకు కొన్ని అద‌నంగా వ‌చ్చి చేరే గుణాలు స్వార్థం కావొచ్చు..లేదా ఇంకొ క‌టి కావొచ్చు.. స్నేహం  నేనే అంతా అని చెబుతుంది ప్రేమ నువ్వే అంతా అని చెప్పేలా చేస్తుంది.. భేదం భావంలోనూ ఉద్వేగంలో నూ దాగి ఉంటాయి. గుర్తించడం మీ బాధ్యత.. స్నేహం ఉద్వేగాల‌ను నిర్వేదాల‌నూ ఒకేలా చూడ‌మ‌ని చెబుతుంది. ప్రేమ మాత్రం నిర్వేదాన్ని వైరాగ్యం కింద మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. ఈ ప్ర‌పంచంలో లోప‌లి చెడును వ‌దులుకుని  స్నేహం చేసిన వాళ్లు ఇం కా నా వ‌ర‌కు ప‌రిచ‌యం కాలేదు. అయితే మేలు.

మ‌నుషులు ఇప్పటిక‌న్నా
....................బాగుంటారు

ఒక్క‌డిగా పోతున్నాను..లోప‌లి స్నేహితుడు ఫ్రాయిడ్..వెలుప‌లి శ‌త్రువు ఎవ్వ‌రో తెలియ‌డం లేదు. ఈ పండుగ‌ల‌కూ కానుక‌ల‌కూ మ‌ధ్య ఓ వినిమ‌య ప్ర‌పంచం ఉంటుంది.వినిమ‌య సంస్కృతి కార‌ణంగానే మార‌కం మారిపోతుంది. ఆ విధంగా స్నేహంలో ఇత రుల స్నేహంలో మార్క్స్ క‌నిపిస్తాడు. ఆ విధంగా మార్క్స్ నా స్నేహితుడు. నేను ఎవ్వ‌రికీ లైఫ్ ఇవ్వ‌ను ఇవ్వ‌లేను అని చెప్పాడు ఆర్జీవీ.. ఆ విధంగా వాడూ నా స్నేహితుడే.. మ‌నిషి ఇలా ఉండ‌డంలో ఉన్న త‌ప్పులు ఎన్ని ఉన్నాయో లెక్కిస్తూ వ‌స్తే ఈ నేలపై కొన్ని మాత్ర‌మే అమితంగా ద‌గ్గ‌ర‌గా తోచేయి. కాలం  ఇచ్చిన ప‌రీక్ష‌ల‌లో ఓడిపోవ‌డంలో నా బాధ్య‌త ఉంది.. న‌న్ను వెక్కిరించిన స్నేహాలూ ఉన్నాయి. ఇప్పుడ‌వి ఎక్క‌డున్నాయి అన్న‌ది చెప్ప‌లేను. మ‌నుషుల‌లో స‌త్యం జ‌యిస్తుంది అని..మ‌నుషులు ఇప్ప టి క‌న్నా బాగుంటారు అని ఓ స్పృహను కూడా స్నేహ‌మే అందించిపోయింది.

మీరు పొందిన  చీక‌టి రేప‌టి వెలుగుకు
.....................కార‌ణం అయి ఉంటుంది


మ‌నం రాజ‌కీయాల్లో లేదా ఇత‌ర రంగాల్లో  కేవ‌లం అవ‌స‌రాల‌నే చూస్తాం అని అంటారు..అవును! మ‌నం చూసేది చేసేది ఈ అవ‌స రం నుంచి పొందిన సాన్నిహిత్యం. ఇది స్నేహానికి ఓ అడ్డు గోడ కానీ మ‌నం కూల్చ‌లేం. మ‌న రూపాయి మ‌న ద‌గ్గ‌ర లేన‌ప్పుడు మన రూపాయి ఇత‌రుల ద‌గ్గ‌ర అత్యంత అధికార ద‌ర్పం వెల‌గ‌బెడుతున్న‌ప్పుడో స్నేహం క‌న్నా ఇంకొన్ని గొప్పగా ఉంటాయి. మ‌నుషుల్లో ఈ రకం స్నేహాలు చూశాక న‌వ్వుకుంటాను. అర్థవంత‌మ‌యిన స్నేహాలు లేనందుకు, ఉన్నాయని భ్ర‌మ ప‌డుతు న్నందుకు కొన్నింటిని చూసి మ‌ళ్లీ మ‌ళ్లీ న‌వ్వుకుంటాను. లోప‌లి స్నేహితుడు క‌వి తిల‌క్ పుట్టిన రోజు ఈ రోజు..వాడికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు..వెలుప‌లి ప్ర‌పంచంలో త‌మ‌దైన దారిని నిర్మిస్తున్న కొంద‌రు స్నేహితులు ఉన్నారు క‌దా! వారికో కృత‌జ్ఞ‌త ఓ ధ‌న్య వాద..మీ జీవితాల్లో మట్టి నుంచి మ‌ట్టి వ‌ర‌కూ మ‌ట్టి నుంచి  మ‌నిషి,మ‌నిషి నుంచి ఆత్మ వ‌ర‌కూ దేహం నుంచి జ్ఞానం వ‌ర‌కూ ఇప్ప‌టిదాకా ప‌రిచయం అయిన‌వ‌న్నీ ఈ ఉద‌యం వ‌ద్ద‌నుకోండి ఏం కాదు.. విరుద్ధ‌త‌లో ఉండే ఆనందం.. ఒప్పుకోలులో ఉండ దు.. నేను ప్రేమించేది న‌న్ను వ‌ద్ద‌నుకున్న‌వి త‌ప్ప నన్ను కోరి చేరిన‌వి కావు.. వాటిలో ఉండే విలువ నాకు తెలుసు. స్నే హం వ‌ద్ద‌నుకున్నాక, ప్రేమ వ‌ద్ద‌నుకున్నాక మీకు లోకం ఇంకొంత ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అప్పుడు మీరు పొందిన  చీక‌టి రేప‌టి వెలుగుకు కార‌ణం అయి ఉంటుంది. ఆ వెలుగు ఓ వేదం.. నేను ఆ వేదంలో ఉన్నాను. ఈ ఉద‌యాన.

 
- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

 
ఫొటో : సురేశ్ బాబు - సూర్య లంక స‌ముద్ర తీరాన  






ఇండస్ట్రీలో సమంత క్లోజ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?

మనీ : అదిరిపోయే స్కీమ్ తో వచ్చిన మోడీ ప్రభుత్వం..

స్నేహానికి నిర్వచనం నయన్.. త్రిష..

హిట్‌.. ప్లాఫ్‌లు వద్దు : స్నేహమేరా జీవితం !

స్నేహబంధం కాస్త బంధుత్వంగా మారిన వేళ..

సీబీఎస్ఈ ఫలితాల్లో సత్తా చాటిన ప్రముఖ నటి..!

హైదరాబాద్ మీదుగా ఇంత డ్రగ్స్ రవాణా అవుతుందా..?

రీ ఎంట్రీ ఇస్తానంటున్న హీరోయిన్ రచన...

ఆగష్టు 1: చరిత్రలో ఈనాటి ముఖ్య సంఘటనలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>