PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/tokyo-olympicsa95aca8a-1f2f-4544-8156-9342924e0255-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/tokyo-olympicsa95aca8a-1f2f-4544-8156-9342924e0255-415x250-IndiaHerald.jpgఒలంపిక్స్‌లో ప‌త‌కాలు సాధిస్తున్న దేశాలు సంబ‌ర‌ప‌డిపోతున్నాయి. త‌మ‌కు ప‌త‌కాల సంఖ్య పెరిగిపోతుంద‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నాయి. కాని విశ్వ‌క్రీడ‌ల‌కు ఆతిధ్యం ఇచ్చిన జ‌పాన్ మాత్రం చిగురుటాకులా వ‌ణికిపోతోంది. అసలు 2020 లో నిర్వ‌హించాల్సిన టోక్కో ఒలంపిక్స్ కొవిడ్ కార‌ణంగా వాయిదాప‌డింది. ఇప్పుడు జ‌పాన్‌లో ఒలంపిక్ క్రీడ‌లు మొద‌ల‌వ‌డంతో అస‌లు క‌రోనా కేసులు లేని ఆ దేశం ఇప్పుడు ఏకంగా హెల్త్ ఎమ‌ర్జెన్సీని కూడా విధించింది. దీనికి కార‌ణం కొవిడ్ కేసులు విప‌రీతంగా పెరిగిపోవ‌డమే.. ఈ విధంగా క‌రోనా విజృంభ‌ణ‌కుolypmic-corona{#}2020;Anandam;Tokyo;Government;Coronavirusక‌రోనా విజృంభ‌ణ‌కు విశ్వ‌క్రీడ‌లు కార‌ణమా..? జ‌పాన్ ఎందుకు వ‌ణికిపోతుంది..!క‌రోనా విజృంభ‌ణ‌కు విశ్వ‌క్రీడ‌లు కార‌ణమా..? జ‌పాన్ ఎందుకు వ‌ణికిపోతుంది..!olypmic-corona{#}2020;Anandam;Tokyo;Government;CoronavirusSun, 01 Aug 2021 10:55:00 GMT ఒలంపిక్స్‌లో ప‌త‌కాలు సాధిస్తున్న దేశాలు సంబ‌ర‌ప‌డిపోతున్నాయి. త‌మ‌కు ప‌త‌కాల సంఖ్య పెరిగిపోతుంద‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నాయి. కాని విశ్వ‌క్రీడ‌ల‌కు ఆతిధ్యం ఇచ్చిన జ‌పాన్ మాత్రం చిగురుటాకులా వ‌ణికిపోతోంది. అసలు 2020 లో నిర్వ‌హించాల్సిన టోక్కో ఒలంపిక్స్ కొవిడ్ కార‌ణంగా వాయిదాప‌డింది. ఇప్పుడు జ‌పాన్‌లో ఒలంపిక్ క్రీడ‌లు మొద‌ల‌వ‌డంతో అస‌లు క‌రోనా కేసులు లేని ఆ దేశం ఇప్పుడు ఏకంగా హెల్త్ ఎమ‌ర్జెన్సీని కూడా విధించింది. దీనికి కార‌ణం కొవిడ్ కేసులు విప‌రీతంగా పెరిగిపోవ‌డమే.. ఈ విధంగా క‌రోనా విజృంభ‌ణ‌కు ఒలంపిక్ క్రీడ‌లే కార‌ణ‌మా?

   ఈ విశ్వ‌క్రీడ‌ల్లో 204 దేశాల‌కు చెందిన 11,500 అథ్లెట్లు పాల్గొన్నారు. 33 క్రీడల్లో 339 పతకాంశాల్లో 17 రోజుల పాటు జరుగ‌నున్నాయి. ఈ విశ్వ‌స‌మ‌రంలో  అనేక‌మంది క్రీడాకారులు త‌మ నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తారు. చెప‌ల‌తో స‌మానం ఈద‌గ‌లిగే స్విమ్మర్లు, చిరుత‌లా వేగంగా ప‌రుగెత్తే ర‌న్న‌ర్లు, రెప్ప‌పాటులో గిర్రున తిరిగే జిమ్నాస్ట‌ర్లు ఇలా 33 క్రీడ‌ల్లో క్రీడాకారులు పాల్గొంటారు. ఇందులో మ‌న దేశం నుంచి దాదాపు 127 మంది క్రీడాకారులు మాత్ర‌మే టోక్కో ఒలంపిక్స్‌లో పాల్గొన్నారు. అయితే, ఇంతమందిలో కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యల‌ను ఒలింపిక్స్ నిర్వాహకులు, అతిధ్య దేశం ప్రభుత్వం తీసుకున్నా కూడా కరోనా సూపర్ స్ప్రెడర్స్‌గా ఈ గ్లోబ‌ల్ ఈవెంట్‌ మారిందంటూ అభిప్రయాలు కూడా జ‌పాన్‌లో వినిపిస్తున్నాయి.

  ఈ పోటీల్లో ఇత‌ర‌ దేశాలకు చెందిన కొంతమంది క్రీడాకారులు కరోనా మ‌హ‌మ్మారి బారినపడి.. పోటీ నుంచి తప్పుకున్నారు కూడా. టోక్యో నగరంలో మాత్రం కరోనా వైరస్ విజృంభిస్తోంది. గ‌తం నుంచి ఇప్పటివరకూ ఎన్నడూ లేని విధంగా న‌గ‌రంలో భారీగా క‌రోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.  గడిచిన 24 గంటల్లోనే కేవలం టోక్యోలోనే మూడు వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి అంటే ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. పెరుగుతున్న కేసులతో టోక్యోలోని ఆసుపత్రులపై మళ్లీ ఒత్తిడి పెరుగుతున్నట్టు అక్క‌డి అధికారులు పేర్కొంటున్నారు.


  ఒలంపిక్ క్రీడా గ్రామంలో ఇప్పటి వరకు 241 మంది వైర‌స్ బారిన పడ్డట్టు నిర్వహకులు ప్ర‌క‌టించారు. ఇవాళ కొత్తగా మరో ఏడు కేసులు నమోదైనట్లు, ఇందులో నలుగురు అథ్లెట్లు కూడా ఉన్నట్లు తెలిపారు.  ఒలంపిక్ కార‌ణంగా కరోనా కేసులు చాపకింద నీరులా పాకుతుండటం ఒలింపిక్‌ నిర్వహకులతో సహా అథ్లెట్లు కూడా ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. అయితే, మ‌రీ ముఖ్యంగా డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతుండ‌డంతో స‌మ‌స్య మ‌రింత తీవ్రంగా మారే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు భావిస్తున్నారు.



వారికి వ్యాక్సిన్ లు వేయడంలో జగన్ సర్కార్ నంబర్-2.. !

ఇప్పటికే ఎక్కువైంది.. ఇక ఖాళీ చేయండి.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్?

వర్షాకాలం తల్లి కాబోతున్న మహిళలు పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు ?

పార్ల‌మెంట్‌లో విప‌క్షాల ర‌భ‌స‌తో ఇన్ని కోట్ల‌ న‌ష్ట‌మా..!

10% కరోనా పాజిటివిటీ రేటు ఉంటే కఠిన ఆంక్షలు

హుజురాబాద్ బరిలో ఊరుకు పదిమంది..?

భాగ్యనగరంలో బోనాల సంబురం.. !

వ్యూహాత్మకంగా వెనకడుగేసిన కేసీఆర్

రజత పతాక విజేత పై మాధవన్ సంచలన కామెంట్స్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>