PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-5f116ab5-b08a-4830-98bb-5b47a36fc67c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-5f116ab5-b08a-4830-98bb-5b47a36fc67c-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశాన్ని నేడు జ‌రుగ‌నుంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఏర్పాటు చేయ‌నున్న కేబినెట్ మీటింగ్ మ‌ధ్యాహ్నం 2గంట‌ల‌కు ప్రారంభం కానుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక‌లు, ఒక వేళ దానికంటే ముందే ఎమ్మెల్సీ ఎన్నిక‌లు రావొచ్చనే ఊహాగానాల మ‌ధ్య ఈ మంత్రివ‌ర్గ స‌మావేశం ఆస‌క్తి క‌లిగిస్తోంది. ద‌ళిత బంధు, చేనేత బీమా, ద‌ళిత బీమాపై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగే అవ‌కాశ‌ముంది. ఉప‌ ఎన్నిక‌ల నేప‌థ్యంలో హుజురాబాద్ అభివృద్దిపై తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై మంత్రివ‌ర్గం చ‌ర్చించ‌నుంది. రాష్ట్రంలో తీవ్రంగా కురుస్తts govt{#}Cabinet;Huzurabad;Minister;Telangana;CMనేడే కేబినేట్ స‌మావేశంః చ‌ర్చ‌కు వ‌చ్చే అంశాలు ఇవేనా..?నేడే కేబినేట్ స‌మావేశంః చ‌ర్చ‌కు వ‌చ్చే అంశాలు ఇవేనా..?ts govt{#}Cabinet;Huzurabad;Minister;Telangana;CMSun, 01 Aug 2021 09:28:00 GMT తెలంగాణ రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశాన్ని నేడు జ‌రుగ‌నుంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఏర్పాటు చేయ‌నున్న కేబినెట్ మీటింగ్ మ‌ధ్యాహ్నం 2గంట‌ల‌కు ప్రారంభం కానుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక‌లు, ఒక వేళ దానికంటే ముందే ఎమ్మెల్సీ ఎన్నిక‌లు రావొచ్చనే ఊహాగానాల మ‌ధ్య ఈ మంత్రివ‌ర్గ స‌మావేశం ఆస‌క్తి క‌లిగిస్తోంది. ద‌ళిత బంధు, చేనేత బీమా, ద‌ళిత బీమాపై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగే అవ‌కాశ‌ముంది.

    ఉప‌ ఎన్నిక‌ల నేప‌థ్యంలో హుజురాబాద్ అభివృద్దిపై తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై మంత్రివ‌ర్గం చ‌ర్చించ‌నుంది. రాష్ట్రంలో తీవ్రంగా  కురుస్తున్న వ‌ర్షాలు, ఇరిగేష‌న్‌, వ్య‌వ‌సాయంపైనా చ‌ర్చ జ‌రుగ‌నుంది. క‌రోనా థ‌ర్డ్ వేవ్ మొద‌లు కానున్న నేప‌థ్యంలో వైద్యం ప‌రంగా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పైన స‌మావేశంలో మాట్లాడే అవ‌కాశం ఉంది. అదే క్ర‌మంలో క‌రోనా కార‌ణం ఆగిపోయిన ఎమ్మెల్సీ ఎన్నిక‌లు కూడా కేబినెట్ మీటింగ్‌లో తెర‌పైకి రానున్న‌ట్లు తెలుస్తోంది.

   హుజురాబాద్ ఎన్నిక‌ల వేళ ద‌ళిత బంధును  ప్ర‌క‌టించిన సీఎం కేసీఆర్ అర్హులైన ప్ర‌తి ద‌ళితునికి ఈ ప‌థంకం ద్వారా ల‌బ్ది చేకూరుస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ద‌ళిత బంధును పైలెట్ ప్రాజెక్ట్‌గా హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో అమ‌లు చేయ‌డానికి తేదీలు కూడా ఖ‌రారు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కే ఎంత‌మంది అర్హులు ఉన్నారు. ద‌ళిత వాడ‌ల్లో ఏఏ స‌మ‌స్య‌లున్నాయో ఆ వివ‌రాల‌ను అధికారులు సేక‌రించారు. ఈ విష‌యంపై మీటింగ్‌లో చ‌ర్చించనున్నారు. అదే విధంగా ద‌ళిత బీమా, చేనేత బీమా పై కూడా మంత్రి వ‌ర్గ స‌మావేశంలో చ‌ర్చ‌కు రానుంది.

   50 వేల ఉద్యోగాల భ‌ర్తీపై కూడా ఈ స‌మావేశంలో చ‌ర్చ‌కు రానుంది. గ‌తంలో ఖాళీలను ప్ర‌భుత్వం ముందు పెట్టిన‌ప్ప‌టికీ అందులో గంద‌ర‌గోళం ఉండ‌డంతో మ‌రోసారి ఆర్థిక శాఖ అధికారులు ఖాళీల వివ‌రాల‌ను మంత్రి వ‌ర్గం ముందు ఉంచ‌నున్నారు. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ ల వివ‌రాలు, ఆర్థిక శాఖ పై చ‌ర్చించ‌నున్నారు. కృష్ణా, గోదావ‌రి న‌దీ యాజ‌మాన్య బోర్డ‌ల ప‌రిధిని ఖ‌రారు చేస్తూ కేంద్రం విడుద‌ల చేసిన గెజిట్ నోటిఫికేష‌న్‌ను ఈ మంత్రి వ‌ర్గ స‌మావేశంలో మంత్రులు చ‌ర్చించ‌నున్నారు.

  ఇప్పుడిప్పుడే క‌రోనా సెకండ్ వేవ్ ముగుస్తుంద‌నే క్ర‌మంలో మూడో ముప్పు పొంచి ఉంద‌నే  హెచ్చ‌రిక‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంల క‌రోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌లపైనా స‌మావేశంలో మాట్లాడ‌నున్నారు. ఆక్సిజ‌న్ కోర‌త‌, ఆస్ప‌త్రుల్లో బెడ్స్ కొర‌త లేకుండా చూడ‌డం లాంటి విష‌యాల‌పై కేబినెట్ ఫోక‌స్ చేయ‌నుంది.
   



హుజురాబాద్ బరిలో ఊరుకు పదిమంది..?

రాజన్న ఆత్మ కేవీపీ అయితే.. జగనన్న ఆత్మ ఆయనే..?

చాలా బాధగా ఉంది : ఈటల

జగన్ టీమ్ కి షాకిస్తున్న పవన్ శిష్యుడు

గొడ్డు మాంసం తినండి..బిజేపి సలహాలు !

కలుపుకుపోతానని చెప్పి ఇదేంటి రేవంత్.. ?

ఎంతమాట..! చంద్రబాబుకు ఆవగింజంత కూడా సిగ్గు లేదా..?

ముస్లిం మహిళల ఆత్మగౌరవం నిలబడింది..!

ఆ విషయంలో.. గిన్నిస్‌ బుక్‌లో కేసీఆర్‌..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>