MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_events/friendship-dayabfe3a8f-7d1c-4125-9a0f-54e445c0e909-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_events/friendship-dayabfe3a8f-7d1c-4125-9a0f-54e445c0e909-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ పరిశ్రమలో హీరో నితిన్‌ ఎంతో కష్టపడి.. మంచి స్థాయికి వచ్చాడు. అతని కెరీర్‌ మొదట్లో జయం, సై లాంటి సినిమాలు మంచి విజయం సాధించినప్పటికీ.. ఆ తర్వాత హిట్‌ కోసం చాలా శ్రమించాడు. గుండె జారీ గల్లంతైయిందే మూవీతో మళ్లీ హీరో నితిన్‌ ఫామ్‌ లోకి వచ్చాడు. అయితే... నితిన్‌... హీరో గానే కాకుండా చాలా సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అందులో ఒకటి... ''అఖిల్‌- ది పవర్‌ ఆఫ్‌ జువా''. ఈ సినిమా అక్కినేని అఖిల్‌ కు అరంగేట్ర చిత్రం. వాస్తవానికి అక్కినేని అఖిల్‌ మరియు హీరో నితిన్‌ ఇద్దరూ ప్రాణ స్నేహితులు, friendship day{#}mani sharma;Lie;Heart;Allu Sneha;Cinema;producer;Producer;Manam;Akkineni Nagarjuna;Heroహిట్‌.. ప్లాఫ్‌లు వద్దు : స్నేహమే ముద్దు !హిట్‌.. ప్లాఫ్‌లు వద్దు : స్నేహమే ముద్దు !friendship day{#}mani sharma;Lie;Heart;Allu Sneha;Cinema;producer;Producer;Manam;Akkineni Nagarjuna;HeroSun, 01 Aug 2021 09:11:31 GMTటాలీవుడ్‌ పరిశ్రమలో హీరో నితిన్‌ ఎంతో కష్టపడి.. మంచి స్థాయికి వచ్చాడు. అతని కెరీర్‌ మొదట్లో జయం, సై లాంటి సినిమాలు మంచి విజయం సాధించినప్పటికీ.. ఆ తర్వాత హిట్‌ కోసం చాలా శ్రమించాడు. గుండె జారీ గల్లంతైయిందే మూవీతో మళ్లీ హీరో నితిన్‌ ఫామ్‌ లోకి వచ్చాడు. అయితే... నితిన్‌... హీరో గానే కాకుండా చాలా సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అందులో ఒకటి... ''అఖిల్‌- ది పవర్‌ ఆఫ్‌ జువా''. ఈ సినిమా అక్కినేని అఖిల్‌ కు అరంగేట్ర చిత్రం.

వాస్తవానికి అక్కినేని అఖిల్‌ మరియు హీరో నితిన్‌ ఇద్దరూ ప్రాణ స్నేహితులు, ఆ స్నేహమే హీరో నితిన్‌ ను''అఖిల్‌'' సినిమా నిర్మాతగా నిలబెట్టింది. అక్కినేని అఖిల్‌... తొలి సినిమానే నితిన్‌ కు అప్పగించారంటే మనం ఆలోచించుకోవచ్చు... వాళ్లిందరూ ఎంత మంచి మిత్రులనేది. ఎంతో మంది టాప్‌ డైరెక్టర్లు ఉన్నప్పటికీ... యంగ్‌ హీరో నితిన్‌ కు అక్కినేని నాగార్జున అఖిల్‌ సినిమా బాధ్యతలను అప్పగించాడు. ఇక ఈ అఖిల్‌ సినిమాకు హీరో నిర్మాతగా వ్యవహరించగా...వీవీ వినాయక్‌ దర్శకత్వం వహించారు. అలాగే... ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్‌ అందించగా... వెలిగొండ శ్రీనివాస కథను అందించారు. ఇక సినిమాలో హీరో అఖిల్‌ సరసన సయ్యేషా నటించింది.

అటు ఈ అఖిల్‌ సినిమాను 50 కోట్ల బడ్జెట్‌ తో చేశారు. అయితే.. అఖిల్‌ సినిమా టాలీవుడ్‌ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో నిర్మాత నితిన్‌ కు ఈ అఖిల్‌ సినిమా పీడకలనే మిగిల్చింది. డిస్ట్రిబ్యూటర్‌ నుంచి ఎగ్జిబిటర్‌ వరకు ప్రతి ఒక్కరూ నష్టపోయారు. అటు హీరో అఖిల్‌ కూడా డీలా పడిపోగా..అక్కినేని ఫ్యామిలీ మరియు నితిన్‌ ల మధ్య చాలా వరకు గ్యాప్‌ పెరిగిపోయింది. కానీ.. నితిన్‌ మరియు అఖిల్‌ మధ్య స్నేహ బంధం చాలా బలంగానే ఉంది. అఖిల్‌ కు హిట్‌ ఇవ్వలేకపోయాను...కచ్చితంగా త్వరలోనే హిట్‌ ఇస్తానని లై సినిమా ప్రమోషన్స్‌ లో నితిన్‌ అన్నారు. ఇదే నితిన్‌, అఖిల్‌ మధ్య స్నేహ బంధానికి నిదర్శనం. హిట్‌, ప్లాప్‌ లతో సంబంధం లేకుండా వారిందరూ తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే.. సోషల్ మీడియాలోనూ వీరిద్దరూ చాటింగ్‌ కూడా చేసుకుంటారట. ఒకరంటే.. మరోకరికి చాలా అభిమానం.





వ్యూహాత్మకంగా వెనకడుగేసిన కేసీఆర్

చిరు సినిమా కు బాబీ ఆ సినిమా టచ్ ఇస్తాడట!!

రామ్ చరణ్ మూవీలో కేరళ స్టార్ హీరో ?

మోహన్ బాబుపై చెప్పు విసిరిన మహిళ... అది పరువు నష్టం కాదా ?

స్నేహబంధం కాస్త బంధుత్వంగా మారిన వేళ..

సినీ ఇండస్ట్రీలో గొప్ప మిత్రులుగా అక్కినేని నాగేశ్వరరావు, డి. రామానాయుడు పేరు తెచ్చుకున్నారు.

మత్తుతో స్నేహం చేసిన హీరో, హీరోయిన్లు.. చివరకు తప్పు తెలుసుకొని న్యూ లైఫ్ స్టార్ట్

మత్తుతో స్నేహం చేస్తారా..? ఈ నటుల లైఫ్ చూడండి..!

సీబీఎస్ఈ ఫలితాల్లో సత్తా చాటిన ప్రముఖ నటి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>