PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-support-rally-on-theree-capitals-in-vijayawada13364e2c-f3eb-460c-8320-4c59935a89cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-support-rally-on-theree-capitals-in-vijayawada13364e2c-f3eb-460c-8320-4c59935a89cf-415x250-IndiaHerald.jpgఇదే ఫార్ములాని ఫాలో అయితే నెక్స్ట్ ఎన్నికల్లో రాయదుర్గంలో పోలిటికల్ సీన్ మారుతుంది. టీడీపీకి అనుకూలంగా పరిస్తితులు ఉంటాయి. అంటే నెక్స్ట్ ఇక్కడ టీడీపీకి గెలిచే అవకాశాలు వస్తాయని అనుకోవచ్చు. మరి ఇప్పటినుంచే అందుకు తగ్గట్టుగా పరిస్థితులు ఉన్నాయా? అంటే ఉన్నాయనే రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ తరుపున ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పనిచేస్తున్నారు.YSRCP TDP{#}Congress;Jagan;Cheque;District;MLA;TDP;YCP;Governmentవైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ మాజీ మంత్రి చెక్ ?వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ మాజీ మంత్రి చెక్ ?YSRCP TDP{#}Congress;Jagan;Cheque;District;MLA;TDP;YCP;GovernmentSun, 01 Aug 2021 12:43:00 GMTఅనంతపురం జిల్లా రాయదుర్గం....మొదట నుంచి ఈ నియోజకవర్గ ప్రజలు పార్టీలకు మిక్సడ్ ఫలితాలు ఇస్తూ వస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం అంటే 1983 నుంచి రాయదుర్గంలో ఒకసారి టీడీపీ గెలిస్తే, మరోసారి కాంగ్రెస్ ఇలా గెలుస్తూ వచ్చేవి. ఇక చివరి రెండు ఎన్నికల్లో ఇక్కడ ఫలితాలు అలాగే వచ్చాయి. 2014లో టీడీపీ తరుపున కాల్వ శ్రీనివాసులు గెలిస్తే, 2019లో వైసీపీ తరుపున కాపు రామచంద్రారెడ్డి విజయం సాధించారు.

ఇదే ఫార్ములాని ఫాలో అయితే నెక్స్ట్ ఎన్నికల్లో రాయదుర్గంలో పోలిటికల్ సీన్ మారుతుంది. టీడీపీకి అనుకూలంగా పరిస్తితులు ఉంటాయి. అంటే నెక్స్ట్ ఇక్కడ టీడీపీకి గెలిచే అవకాశాలు వస్తాయని అనుకోవచ్చు. మరి ఇప్పటినుంచే అందుకు తగ్గట్టుగా పరిస్థితులు ఉన్నాయా? అంటే ఉన్నాయనే రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ తరుపున ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పనిచేస్తున్నారు.

అయితే ఇక్కడ ప్రభుత్వం తరుపున జరిగే కార్యక్రమాలు తప్ప, మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమి జరగడం లేదు. పైగా ఎమ్మెల్యేలకు నిధులు అందించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ పథకాల మీదే ఎమ్మెల్యే ఆధారపడాల్సిన పరిస్తితి ఉంది. అయితే పథకాలు కూడా పూర్తిగా ఎమ్మెల్యేని కాపాడే పరిస్తితి లేదు. పైగా టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు ఊహించని విధంగా పుంజుకున్నట్లు కనిపిస్తోంది.

ఈ రెండేల్లో రాష్ట్రంలో ఏ టీడీపీ నేత పోరాటం చేసినా, చేయకపోయినా కాల్వ మాత్రం వైసీపీపై నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు. అలాగే నియోజకవర్గంలో ప్రజలకు, కార్యకర్తలకు అండగా నిలబడుతున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇవే ఇప్పుడు కాల్వకు అడ్వాంటేజ్ అవుతున్నాయి. అటు నియోజకవర్గంలో వైసీపీ నేతల అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపణలు వస్తున్నాయి.

ఇళ్ల స్థలాల్లో అక్రమాలు, భూ కబ్జాలు ఎక్కువయ్యాయని కాల్వ ఫైర్ అవుతున్నారు. అలాగే కాపు రామచంద్రారెడ్డికి చెందిన కంకర క్వారీలకు ప్రభుత్వం మంజూరు చేసిన పర్మిట్లలో అవినీతి జరిగిందని అంటున్నారు. ఈ అంశాలు ఎమ్మెల్యే కాపుకు బాగా మైనస్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఏదేమైనా రాయదుర్గంలో కాపుకు కాల్వ చెక్ పెట్టేలా కనిపిస్తున్నారు.



గర్భిణుల విషయంలో ఏపీ మరో రికార్డ్ !

బుల్లి పిట్ట : హైదరబాద్ వాసులకు ఉచిత వైఫై సేవలు..

రాయ‌దుర్గం ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డి అవినీతిపై మాజీ మంత్రి కాల్వ నిత్య పోరాటం ?

అమరావతి ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంపు మరో ఏడాది

మ‌న క‌ర్మ ఇలా కాలిందేంటి బ్ర‌ద‌ర్‌.. వైసీపీ నేత‌ల గుస‌గుస‌...!

ఆ వైసీపీ ఎమ్మెల్యేకు పొగ పెడుతున్నారా... జ‌గ‌న్ వ్యూహ‌మేంటి...?

పెగాసస్ స్పైవేర్ పై నేడు సుప్రీంకోర్టు లో విచారణ

ఏపీ నార్త్‌కు కొత్త ఎమ్మెల్యే వ‌చ్చేశాడు...!

బీజేపీకి చుక్క‌లు చూపిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>