PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/huzurabad-election-for-padi-cowshikreddy-bjp-f47f8d3d-a25e-4736-b678-caec4e14eb34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/huzurabad-election-for-padi-cowshikreddy-bjp-f47f8d3d-a25e-4736-b678-caec4e14eb34-415x250-IndiaHerald.jpgమంచి క్యాడర్ ఉన్న వ్యక్తి. ఆయన హుజురాబాద్ లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఈ సందర్భంలోనే ఆయన తెరాస ఆకర్షణలో పడి టిఆర్ఎస్ లో చేరారు. దీంతో హుజురాబాద్ కాంగ్రెస్ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. కాంగ్రెస్ తరఫున ఎవరిని నిలబెట్టాలో అర్థంకాని పరిస్థితిలో కాంగ్రెస్ క్యాడర్ ఎదురుచూస్తోంది. ఈ విధంగా తెరాస వ్యూహాలతో టిఆర్ఎస్ కాంగ్రెస్ చతికిల పెడుతున్నాయని చెప్పవచ్చు. కానీ ఓటర్ నాడీ ఏ విధంగా ఉందో ఎలక్షన్ అయితే గాని తెలియదు.Political {#}kaushik;Eatala Rajendar;Telangana Rashtra Samithi TRS;Congress;Bharatiya Janata Party;Telangana Chief Minister;Party;Huzurabad;Ministerతెరాస ఆకర్షుతో .. బిజెపి' కాంగ్రెస్ విలవిల..?తెరాస ఆకర్షుతో .. బిజెపి' కాంగ్రెస్ విలవిల..?Political {#}kaushik;Eatala Rajendar;Telangana Rashtra Samithi TRS;Congress;Bharatiya Janata Party;Telangana Chief Minister;Party;Huzurabad;MinisterSun, 01 Aug 2021 10:06:00 GMT హుజురాబాద్ ఉప ఎన్నికల్లో  ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో  తెరాస చేసినటువంటి వ్యూహాలకు  బిజెపి, కాంగ్రెస్ పార్టీలు  చిత్తవుతున్నాయని చెప్పవచ్చు. ఎలాగైనా టిఆర్ఎస్ ను ఓడించాలనే లక్ష్యంతో  బిజెపి దుబ్బాక ఎలక్షన్ల తీరును చూపించాలని అనుకుంటుంది. కానీ గులాబీ ఎత్తుల   ముందు విలవిలలాడుతున్నదని  చెప్పవచ్చు. ఈటల రాజేందర్ రాజీనామాతో అనివార్యమైన ఉప ఎన్నిక ఇప్పటివరకు ఎన్నికల కమిషన్  నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. అయినా హుజురాబాద్ లో మాత్రం  ప్రచారం చేయడంలో యుద్ధవాతావరణం తలపిస్తోంది. మే లో మొదలైన ప్రచారం గత 3 నెలల నుండి హుజూరాబాద్ నియోజకవర్గం అంతా  ఎక్కడ చూసినా  ఎన్నికల పండగల కనిపిస్తోంది . కానీ ఈటెల ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు అనుకొని అందరూ భావించారు.

కానీ ఆయన అనూహ్యంగా  బీజేపీలో చేరారు. హుజురాబాద్ లో బిజెపికి ఎక్కువ పట్టు లేనప్పటికీ ఈటలకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ బిజెపికి తోడ్పాటు అవుతోంది. ఈటల టిఆర్ఎస్ పార్టీలో ఎన్నో పదవులను అలంకరించి, బిజెపిలో చేరి  తెరాస పైన విమర్శలు చేయడం, టిఆర్ఎస్ తరఫున  హుజురాబాద్ లో  గెలిచినటువంటి ఈటల  పార్టీని భూస్థాపితం చేస్తామని అనడం  చూసి ముఖ్యమంత్రి కేసీఆర్  చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజేందర్ కు  రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన మంత్రి హరీష్ రావు  ఈటలకు దీటుగా హరీష్ రావు అయితేనే  తట్టుకోగలడాని  ఆయనను వ్యూహకర్తగా నియమించినారు. హరీష్ రావు తమదైన శైలిలో హుజురాబాద్ మొత్తం పార్టీ క్యాడర్ ను ఏకతాటి పైకి తీసుకు వస్తున్నారు. ఆ తర్వాత ఈటల రాజేందర్ ను  నిర్వీర్యం చేయడం కోసం బీజేపీ పార్టీలో లీడర్లను ఒక్కొక్కరుగా టిఆర్ఎస్ పార్టీలో కలుసుకుంటున్నారు. ఇలా రోజురోజుకు హుజురాబాద్ లో టిఆర్ఎస్ బలాన్ని పెంచుతూ , ఈటల బలాన్ని తగ్గిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలోనే మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి   ఆయన అనుచరులైన దేశిని కోటి, సమ్మిరెడ్డి, కిషన్ రెడ్డి, బిజెపి కౌన్సిలర్ల అందరిని తెరాసలోకి లాగారు. ఈ విధంగా మార్క్ రాజకీయంతో ఈటెల శిబిరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ వస్తున్నారు.

ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ లో ప్రధాన నాయకుడైన  పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో మంచి క్యాడర్ ఉన్న వ్యక్తి. ఆయన  హుజురాబాద్ లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఈ సందర్భంలోనే  ఆయన తెరాస ఆకర్షణలో పడి టిఆర్ఎస్ లో చేరారు. దీంతో హుజురాబాద్ కాంగ్రెస్ పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. కాంగ్రెస్ తరఫున ఎవరిని నిలబెట్టాలో అర్థంకాని పరిస్థితిలో కాంగ్రెస్ క్యాడర్ ఎదురుచూస్తోంది. ఈ విధంగా  తెరాస వ్యూహాలతో టిఆర్ఎస్ కాంగ్రెస్  చతికిల  పెడుతున్నాయని చెప్పవచ్చు. కానీ  ఓటర్ నాడీ ఏ విధంగా ఉందో  ఎలక్షన్ అయితే గాని తెలియదు.



నేడే కేబినేట్ స‌మావేశంః చ‌ర్చ‌కు వ‌చ్చే అంశాలు ఇవేనా..?

హుజురాబాద్ బరిలో ఊరుకు పదిమంది..?

వ్యూహాత్మకంగా వెనకడుగేసిన కేసీఆర్

రాజన్న ఆత్మ కేవీపీ అయితే.. జగనన్న ఆత్మ ఆయనే..?

జగన్ టీమ్ కి షాకిస్తున్న పవన్ శిష్యుడు

ఫ్రెండ్షిప్‌ డే : నితీశ్‌, లాలూ.. స్నేహ శత్రువులు..!

గొడ్డు మాంసం తినండి..బిజేపి సలహాలు !

కలుపుకుపోతానని చెప్పి ఇదేంటి రేవంత్.. ?

ఎంతమాట..! చంద్రబాబుకు ఆవగింజంత కూడా సిగ్గు లేదా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>