LifeStyleRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/sajjala8127b075-7f80-49f3-84c5-b6e0f3ff9ed6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/sajjala8127b075-7f80-49f3-84c5-b6e0f3ff9ed6-415x250-IndiaHerald.jpgఅక్క‌డి నుంచి వచ్చిన‌వాడే ఫేమ‌స్ క‌మెడి య‌న్ కృష్ణ భ‌గ‌వాన్ . మంచి స్నేహం అంటే క‌ష్టం నుంచి మ‌ర‌ణం నుంచి ఇంకా కొన్నింటి నుంచి కాస్తయినా ఒడ్డెక్కేందుకు సాయం ఇచ్చిన వాడు అని అర్థం రాసుకుంటే వాళ్లిద్ద‌రూ మంచి స్నేహితులు అని నేను త‌ప్ప‌క చెబుతాను. నా స్నేహితులు నా ఇంటి మ‌నుషులు అని గ‌ర్విస్తాను. దుర‌దృష్టం ప‌తంజలి చ‌నిపోయారు.ఆ కుటుంబానికి దిక్కు తోచ‌డం లేదు.అప్పుడు కూడా తానే ఆ ఇంటి పెద్ద అయి ఆర్థిక సాయం చేసి వ‌చ్చారు. మేనేజ్మెంట్ కు చెప్పి ! sajjala{#}Krishna River;Alla Ramakrishna Reddy;Sakshi;krishna;Anandam;Directorనెవ‌ర్ ఎండ్ : స్నేహ‌మే సాక్షినెవ‌ర్ ఎండ్ : స్నేహ‌మే సాక్షిsajjala{#}Krishna River;Alla Ramakrishna Reddy;Sakshi;krishna;Anandam;DirectorSun, 01 Aug 2021 11:51:00 GMTనెవ‌ర్ ఎండ్ : స్నేహ‌మే సాక్షి

జీవితం ఆద‌ర్శంలో ఉంటుంది
ఆద‌ర్శంలో జీవితం ఉంటుంది
ఛ రెండూ త‌ప్పు
ఆద‌ర్శంకు దూరంగా తూరుపు దిక్కున ఉంటుంది
ఆచ‌ర‌ణ‌కు దూరంగా ప‌డ‌మ‌టి దిక్కున ఉంటుంది
రెండు దిక్కుల న‌డుమ లోకం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది
కానీ స్నేహం ఏ  దిక్కూ తోచ‌ని వేళ కూడా ఉంటుంది
కూడ‌లిలో ఉంటుంది.. మంచి స్నేహం అనే ప‌దం నాలో లేదు
నాకు క‌లదు క‌ల‌గ‌దు కూడా కానీ.. ఆ ఇద్ద‌రి స్నేహితులూ
జీవ‌న్మర‌ణ వేళ‌ల్లోనూ ఉన్నారు.. వారికి వంద‌నాలు చెల్లిస్తూ
రాస్తున్నానొక క‌థ‌నం కాదు వివ‌రం

క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్న స్నేహితుడు..ఇంకొద్ది రోజుల‌లో మ‌ర‌ణానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న స్నేహితుడు..కుటుంబంలో కాస్త కూడా ఆ నందం లేని రోజులు.మీకు నేనున్నా అన్న భ‌రోసా ఇచ్చిన స్నేహితుడు.. ఒక్క‌డే స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి. మంచి స్నేహితుడు ఎలా ఉంటాడు. ప‌తంజ‌లి అనే రైటర్ కు ద‌క్కిన స్నేహితుడిలా ఉంటాడు. సీత‌మ్మ వాకిట తుల‌సి మొక్క‌లా ఉంటాడు. నాకు న‌చ్చిన స్నేహితుల్లో నా వాళ్లు అని చెప్పుకునే గ‌ర్వం పొగ‌రు అన్నీ ఇచ్చిన వాళ్లు ఆ ఇద్ద‌రు. రామ కృష్ణా రెడ్డి స‌ర్ ఒక్క‌టే అనుకున్నారు ..సాక్షి ఎడిటోరియ‌ల్ డైరెక్టర్ గా ఉన్న‌ప్పుడు ఈ పత్రిక‌కు ప్రారంభ సంపాద‌కులు కేఎన్ వై ప‌తంజలి త‌ప్ప ఇంకెవ్వ‌రూ వ‌ద్దు అని! ఎందరు పోటీ ప‌డ్డారో! మంచి స్నేహానికి ఇదీ విలువ. రాజ‌కీయ రంగంలో ఇప్పుడు కాస్త బిజీ అయిపోయినా ఆయ‌న మాకెప్పుడూ మంచి స్నేహితుడు. హితైషి అని రాయాలి.. చూసి న‌వ్వుతాడు.. ఇలా రాస్తే.. డీడీ (దూర‌ద‌ర్శ‌న్)లో వ‌సంత కోకిల అనే ఓ సీరియ ల్ ను రామ‌కృష్ణా రెడ్డి ప్రొడ్యూస్ చేశారు. ప‌తంజ‌లి స‌ర్ రైట‌ర్ . ఉప్ప‌ల‌పాటి డైరెక్ట‌ర్ .. అక్క‌డి నుంచి వచ్చిన‌వాడే ఫేమ‌స్ క‌మెడి య‌న్ కృష్ణ భ‌గ‌వాన్ . మంచి స్నేహం అంటే క‌ష్టం నుంచి మ‌ర‌ణం నుంచి ఇంకా కొన్నింటి నుంచి కాస్తయినా ఒడ్డెక్కేందుకు సాయం ఇచ్చిన వాడు అని అర్థం రాసుకుంటే వాళ్లిద్ద‌రూ మంచి స్నేహితులు అని నేను త‌ప్ప‌క చెబుతాను. నా స్నేహితులు నా ఇంటి మ‌నుషులు అని గ‌ర్విస్తాను. దుర‌దృష్టం ప‌తంజలి చ‌నిపోయారు.ఆ కుటుంబానికి దిక్కు తోచ‌డం లేదు.అప్పుడు కూడా తానే ఆ ఇంటి పెద్ద అయి ఆర్థిక సాయం చేసి వ‌చ్చారు. మేనేజ్మెంట్ కు చెప్పి ! త‌న‌వంతు బాధ్య‌త నిర్వ‌ర్తించి వ‌చ్చారు. ఓ విధంగా సీతారామ‌య్య ట‌వ‌ర్స్ (హైద్రాబాద్ ) నుంచి సీత‌మ్మ ధార వ‌ర‌కూ ఆయ‌న తోడు రామ‌కృష్ణా రెడ్డి. మీ జీవితంలో మంచి స్నేహితులు మాత్ర‌మే మీ ఆస్తి అనుకుంటే అంత‌కుమించిన ఆనందం ఇంకొక‌టి ఉండ‌దు. అదే భ‌రోసా కూడా! మీరు మంచిని సంపాదించి మంచిని ప్రేమించి మంచి పూల‌నూ ప్రేమించి ఎదిగి రండి.. కాలం మీ తోడు జ్ఞాప‌కం మీ తోడు.. కడ‌దాకా మీ అనుకునే వాళ్లంతా మీ తోడు.. కాలుతున్న క‌ట్టె చెంత కూడా మీకు కాల‌మే కాదు స్నేహ‌మూ తోడే..







ఫ్రెండ్ షిప్ డే: ఏ గొడవలూ ఈ స్టార్స్ ను దూరం చేయలేకపోయాయి...

సినిమా పరిశ్రమలో వీరిద్దరి స్నేహం సాటిరానిది!!

పూరీ కి ఇంత అన్యాయం ఏ సినిమా కి జరగలేదు!!

క‌రోనా విజృంభ‌ణ‌కు విశ్వ‌క్రీడ‌లు కార‌ణమా..? జ‌పాన్ ఎందుకు వ‌ణికిపోతుంది..!

భారీ కటౌట్ తో పనిలేదు.. అది ఉంటే చాలు..!

ఇదే ఆచార్య లో అసలు మైనస్.. అందుకే!!

చిరు సినిమా కు బాబీ ఆ సినిమా టచ్ ఇస్తాడట!!

రామ్ చరణ్ మూవీలో కేరళ స్టార్ హీరో ?

రీ ఎంట్రీ ఇస్తానంటున్న హీరోయిన్ రచన...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>