CrimeMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/prasanna-kumar-cheated-girls-and-womens3c4ce683-4aae-4bb5-a83a-e7e0569b7b4f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/prasanna-kumar-cheated-girls-and-womens3c4ce683-4aae-4bb5-a83a-e7e0569b7b4f-415x250-IndiaHerald.jpgఅమ్మాయిలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠినమైన చట్టాలను తీసుకొచ్చినా కేటుగాళ్ల చేతిలో అమ్మాయిలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ యువకుడు ఏకంగా 200 మంది అమ్మాయిలను వందమంది మహిళలను మోసం చేశాడు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని అమ్మాయిలకు మహిళలకు వల వేయడం తన వృత్తిగా చేస్తున్నాడు. అలా పరిచయం ఏర్పడిన అమ్మాయిల వద్ద నుండి డబ్బులు గుంజడం.. ఫోటోలు వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయడం లాంటివి చేస్తూ వచ్చాడు. గతంలో చెడు వ్యసనాలకు బానిసై చైన్ స్నాచింగ్ లకు కూడా పాల్పడి పలు కేసుల్లో జైలుకు వెళ్Kadapa{#}sunil;kadapa;prasanna;media;job;police;goldఏపీ : 200 మంది అమ్మాయిలను..100 మంది మహిళలకు వల వేసి చివరికి.. !ఏపీ : 200 మంది అమ్మాయిలను..100 మంది మహిళలకు వల వేసి చివరికి.. !Kadapa{#}sunil;kadapa;prasanna;media;job;police;goldSun, 01 Aug 2021 15:54:00 GMTఅమ్మాయిలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠినమైన చట్టాలను తీసుకొచ్చినా కేటుగాళ్ల చేతిలో అమ్మాయిలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ యువకుడు ఏకంగా 200 మంది అమ్మాయిలను వందమంది మహిళలను మోసం చేశాడు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని అమ్మాయిలకు మహిళలకు వల వేయడం తన వృత్తిగా చేస్తున్నాడు. అలా పరిచయం ఏర్పడిన అమ్మాయిల వద్ద నుండి డబ్బులు గుంజడం.. ఫోటోలు వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయడం లాంటివి చేస్తూ వచ్చాడు. గతంలో చెడు వ్యసనాలకు బానిసై చైన్ స్నాచింగ్ లకు కూడా పాల్పడి పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. తాజాగా కేటుగాడి బండారం పోలీసులు బయట పెట్టారు. వివరాల్లోకి వెళితే.... కడప జిల్లా పొద్దుటూరు కు చెందిన ప్రసన్న కుమార్ అనే యువకుడు చిల్లరగా తిరుగుతూ ఉందేవాడు. హైదరాబాద్, విజయవాడ, కడపలో జులాయిగా తిరుగుతూ పలువురు అమ్మాయిలకు ఎర వేయడం ప్రారంభించాడు.

అంతేకాకుండా పేర్లను మార్చుకుంటూ సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు తెరచి అమ్మాయిలకు రిక్వెస్ట్ పెట్టడం ప్రారంభించారు. అమ్మాయిలు రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేశారంటే మెల్లిగా మాటలు కలపడం... ఆ తర్వాత వారిని కలవడం లాంటివి చేసేవాడు. అనంతరం డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయడం... వీడియోలు బయటపెడతానని బెదిరించడం చేసేవాడు. అలా ప్రసన్నకుమార్ ఇప్పటివరకు రెండు వందల మంది అమ్మాయిలు, 100 మంది మహిళలను మోసం చేసినట్టు కడప డీఎస్పీ సునీల్ వెల్లడించారు. చెడు వ్యసనాలకు బానిసై గతంలో ప్రసన్నకుమార్ చైన్ స్నాచింగ్ లకు కూడా పాల్పడి జైలుకు వెళ్ళినట్టు డీఎస్పీ తెలిపారు. అయితే పరువుకు సంబంధించిన విషయం కావడంతో మహిళలు, అమ్మాయిలు తాము మోసపోయామని ఎక్కడా ఫిర్యాదు చేయలేదని చెప్పారు. కాగా తాజాగా కడపలో ఉద్యోగం ఇప్పిస్తానని అమ్మాయిని మోసగించడం తో కేటుగాడి బండారం బయటపడినట్టు తెలిపారు. అంతేకాకుండా ప్రసన్న కుమార్ వద్ద 30 గ్రాముల బంగారం మరియు 1.26లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.


షాకిస్తున్న దళిత బంధు.. మరో టిఆర్ఎస్ ఎమ్మెల్యేకి రాజీనామా డిమాండ్?

చరిత్ర సృష్టించిన భారత హాకీ టీమ్

షాక్‌: రాజ‌కుంద్రా బాట‌లోనే మ‌రో హీరోయిన్‌.. మోడ‌ల్స్‌తో పోర్న్ వీడియోలు ?

1000 కోట్ల ప్రాజెక్ట్ లో బిజీ ఉన్న బాలీవుడ్ నటి ప్రెగ్నెంట్ అయ్యిందా.. ?

అరుదైన రికార్డు.. ఒకే మహిళకు 7 పతకాలు?

ఫ్రెండ్షిప్ డే రోజే.. ఎంత దారుణం జరిగింది?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి బాబాగా మారాడు.. చివరికి?

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు..?

5ఏళ్ళ బాలుడి హత్య.. అక్రమ సంబంధమే కారణం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>