MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/do-you-make-friends-with-intoxicants-see-the-life-of-these-actors7b0f746a-1b30-49b9-b26e-f4ba4fe33c6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/do-you-make-friends-with-intoxicants-see-the-life-of-these-actors7b0f746a-1b30-49b9-b26e-f4ba4fe33c6f-415x250-IndiaHerald.jpgమన బాగు కోరే వాళ్లతో మనం స్నేహం చేయాలి. మన జీవితాన్ని చిత్తు చేసే వాళ్లకు మనం దూరంగా ఉండాలి. అయితే కొందరు హీరోలు, హీరోయిన్లు.. వాటితో ప్రమాదం అని తెలిసినా... కొన్ని పరిస్థితుల్లో వాటితో ఫ్రెండ్ షిప్ చేసి జీవితాన్ని చిత్తు చేసుకున్నారు. తర్వాత ఆ తప్పు తెలుసుకొని ఆ స్నేహానికి దూరమయ్యారు. ఇపుడు వాటిని శత్రువుల్లా చూస్తున్నారు. Do you make friends with intoxicants See the life of these actors{#}Pooja Bhatt;Shruti Haasan;Father;Pooja Hegde;Hero;Drugs;Cinemaమత్తుతో స్నేహం చేస్తారా..? ఈ నటుల లైఫ్ చూడండి..!మత్తుతో స్నేహం చేస్తారా..? ఈ నటుల లైఫ్ చూడండి..!Do you make friends with intoxicants See the life of these actors{#}Pooja Bhatt;Shruti Haasan;Father;Pooja Hegde;Hero;Drugs;CinemaSun, 01 Aug 2021 08:11:39 GMTలోక నాయకుడు, విలక్షణ నటుడు కమల్ హాసన్ గారాల పట్టి శ్రుతీ హాసన్ స్టార్డమ్ సంపాదించుకొని.. రాకెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న సమయంలో.. కెరీర్ కు సడెన్ గా బ్రేకులు పడ్డాయి. ఉన్న అవకాశాలు కాస్తా ఊడిపోయాయి. 'కాటమరాయుడు' సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుంది. మరి శృతిహాసన్ ఇంత గ్యాప్ తీసుకోవడానికి ఆల్కాహాలే కారణమని తెలుస్తోంది.  బ్రేకప్‌తో ఆల్కాహాల్‌కి అడిక్ట్ అయిన ఈ అమ్మడు.. ఈ వ్యసనానికి దూరమయ్యాకే మళ్లీ బిజీ అయ్యిందని టాక్. 'క్రాక్‌'తో రీఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ ప్రభాస్‌తో 'సలార్‌' చేస్తోంది.

హీరోయిన్ పూజా భట్ తన సినీ జీవితంలో యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా చాలా రోల్స్‌ ప్లే చేసింది. అడుగుపెట్టిన ప్రతీ చోట మంచి ఫలితాలే అందుకుంది.  అయితే ఇంత సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌లో ఒక పొరపాటు కూడా చేశానని ఇప్పటికీ బాధపడుతుంది పూజా భట్. భయాలని కప్పిపుచ్చుకోవడానికి పూజ ఆల్కహాల్ కు  బాగా దగ్గరైందని సమాచారం. దీంతో చాలా సమస్యలే  వచ్చాయట. అయితే తండ్రి మహేశ్‌ భట్‌తో మాట్లాడాక పూర్తిగా మందు మానేసిందట పూజ. 2017 నుంచి మళ్లీ మందు ముట్టుకోలేదని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది.  
:
ఇక మనీషా కోయిరాల అయితే ఆటోబయోగ్రఫీ 'హీల్డ్‌- హౌ కేన్సర్ గేవ్‌ మి ఏ న్యూ లైఫ్‌'లో మందుకి బానిసవ్వద్దని పేజీల కొద్ది స్టేట్మెంట్స్‌ రాసింది. బాధని మరిచిపోవడానికి మందు తాగాలి అనుకుంటారు గానీ, మితిమీరితే మందే అన్ని బాధలకి కారణమవుతుందని రాసింది. అంతేకాదు మందుకి దూరమయ్యాక లైఫ్‌ చాలా కొత్తగా మారిందని చెప్పింది.

రణ్‌బీర్ కపూర్‌కి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ.  అయితే ఈ క్రేజీ స్టార్‌కి బోల్డన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయట. ఒక ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌ కాలేజ్‌టైమ్‌లో డ్రగ్స్‌ తీసుకున్నానని చెప్పాడు. తర్వాత హెల్త్‌కి మంచిదికాదని డ్రగ్స్‌ మానేసినా, సిగరెట్‌ని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నానంటున్నాడు రణ్‌బీర్.  హీరో సంజయ్‌ దత్. డ్రగ్స్, ఆల్కహాల్‌కు బానిస అయి...తన తండ్రి సాయంతో బయట పడ్డాడు. అమెరికన్ రిహాబిలేషన్‌ సెంటర్‌లో జాయిన్ అయి ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. చివరకు డ్రగ్స్ నుంచి బయటపడి మళ్లీ సినీ కెరీర్ మొదలుపెట్టాడు.








మత్తుతో స్నేహం చేసిన హీరో, హీరోయిన్లు.. చివరకు తప్పు తెలుసుకొని న్యూ లైఫ్ స్టార్ట్

సీబీఎస్ఈ ఫలితాల్లో సత్తా చాటిన ప్రముఖ నటి..!

హైదరాబాద్ మీదుగా ఇంత డ్రగ్స్ రవాణా అవుతుందా..?

రీ ఎంట్రీ ఇస్తానంటున్న హీరోయిన్ రచన...

సడన్ గా రానా యూఎస్ ట్రిప్.. . అందుకోసమేనా ?

హ్యాపీ బర్త్ డే : ఝుమ్మంది సొట్టబుగ్గల సుందరి..!

స్మరణ: కోలీవుడ్ స్టార్ వివేక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

ఆ దేశంలో వ్యాపారం మొదలు పెట్టిన హీరో కంపెనీ..

ఫేడ్ అవుట్ హీరోలకు ఇంత డిమాండ్ ఏంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>