EditorialVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcp173690f5-220f-4f9a-9ca1-ce862f523984-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcp173690f5-220f-4f9a-9ca1-ce862f523984-415x250-IndiaHerald.jpgనిజానికి మండ‌లి.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో వైసీపీకి అందివ‌చ్చిన వ‌రంగా మారింది. రాజ‌కీయంగా కీల‌క ప‌ద‌వులు ఇవ్వ‌లేని వారికి.. లేదా.. పార్టీ త‌ర‌ఫున ప‌నిచేసిన వారికి .. మండ‌లి సీట్లు అందివ‌చ్చిన అవ‌కాశంగా మారాయి. దీంతో ఇటీవ‌ల కాలంలో మండ‌లి సీట్లు ఖాళీ కాగానే.. జ‌గ‌న్ వాటిని వెంట‌వెంట‌నే భ‌ర్తీ చేస్తున్నారు. ఫ‌లితంగా ఒక ఏడాది కింద‌ట‌.. టీడీపీకి మెజారిటీ ఉంటే.. ఇప్పుడు వైసీపీకి మెజారిటీ వ‌చ్చింది. అయితే.. గ‌త ఏడాది కింద‌ట‌. మూడు రాజ‌ధానుల ఏర్పాటు.. సీఆర్ డీఏ ర‌ద్దు వంటి చట్టాల‌పై మండ‌లిలో టీడీపీ అనుసYSRCP{#}Assembly;Smart phone;TDP;YCP;central government;Party;CMమ‌న క‌ర్మ ఇలా కాలిందేంటి బ్ర‌ద‌ర్‌.. వైసీపీ నేత‌ల గుస‌గుస‌...!మ‌న క‌ర్మ ఇలా కాలిందేంటి బ్ర‌ద‌ర్‌.. వైసీపీ నేత‌ల గుస‌గుస‌...!YSRCP{#}Assembly;Smart phone;TDP;YCP;central government;Party;CMSun, 01 Aug 2021 12:09:00 GMTఏపీ శాస‌న మండ‌లి ర‌ద్దు అవుతుందా?  అసెంబ్లీ సాక్షిగా సీఎం జ‌గ‌న్ చేసిన తీర్మానానికి.. కేంద్రం ఆమోద ముద్ర వేసేస్తుందా?.. ఇదీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న కీల‌క సంభాష‌ణ‌. ఎవ‌రు ఎవ‌రికి ఫోన్ చేసినా.. ఏ ఇద్ద‌రు నేత‌లు తార‌స‌ప‌డినా.. ఇదే విష‌యంపై చ‌ర్చించుకుంటున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం.. మండ‌లిని ర‌ద్దు చేయాలంటూ.. జ‌గ‌న్ స‌ర్కారు త‌మ‌కు తీర్మానం పంపింద‌ని.. దీనిపై ప‌రిశీలిస్తున్నామ‌ని.. త్వ‌ర‌లోనే నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తామ‌ని.. రాజ్య‌స‌భ‌లో వెల్ల‌డించింది. అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యం ఇక మ‌రుగున ప‌డిన‌ట్టేన‌ని భావించిన వైసీపీ నాయ‌కులు తీవ్ర సంక‌ట ప‌రిస్థితి ఏర్ప‌డింది.

నిజానికి మండ‌లి.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో వైసీపీకి అందివ‌చ్చిన వ‌రంగా మారింది. రాజ‌కీయంగా కీల‌క ప‌ద‌వులు ఇవ్వ‌లేని వారికి.. లేదా.. పార్టీ త‌ర‌ఫున ప‌నిచేసిన వారికి .. మండ‌లి సీట్లు అందివ‌చ్చిన అవ‌కాశంగా మారాయి. దీంతో ఇటీవ‌ల కాలంలో మండ‌లి సీట్లు ఖాళీ కాగానే.. జ‌గ‌న్ వాటిని వెంట‌వెంట‌నే భ‌ర్తీ చేస్తున్నారు. ఫ‌లితంగా ఒక ఏడాది కింద‌ట‌.. టీడీపీకి మెజారిటీ ఉంటే.. ఇప్పుడు వైసీపీకి మెజారిటీ వ‌చ్చింది. అయితే.. గ‌త ఏడాది కింద‌ట‌. మూడు రాజ‌ధానుల ఏర్పాటు.. సీఆర్ డీఏ ర‌ద్దు వంటి చట్టాల‌పై మండ‌లిలో టీడీపీ అనుస‌రించిన వైఖ‌రితో ఆగ్ర‌హం చెందిన జ‌గ‌న్ మండ‌లి ర‌ద్దును ప్ర‌తిపాదించారు. దీనికి సంబంధించిన తీర్మానం పంపారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ర‌ద్దు అంశం.. ప‌రిశీల‌న‌లో ఉంద‌ని.. కేంద్రం వెల్ల‌డించింది. ఒక‌వేళ ర‌ద్దు చేస్తే.. ప‌రిస్థితి ఏంటి? అనేది వైసీపీ నేత‌ల ఆందోళ‌న‌. ఇదే విష‌యంపై జ‌గ‌న్ కూడా అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నార‌ని పార్టీ కీల‌క నేతల మ‌ధ్య చ‌ర్చ‌గా ఉంది. అయితే.. ఇప్ప‌టికిప్పుడు ఏం చేసినా.. ప్ర‌యోజ‌నం త‌క్కువేన‌ని అంటున్నారు. అయితే.. మండ‌లి ర‌ద్దు కాకూడ‌దంటే.. వ‌చ్చే అసెంబ్లీలో మ‌ళ్లీ ర‌ద్దు ప్ర‌తిపాద‌న‌ను వెన‌క్కి తీసుకుంటున్నామ‌ని తీర్మానం చేయ‌డం ద్వారా మాత్ర‌మే దీనిని ఆపే అవ‌కాశం ఉంటుంద‌ని.. అంటున్నారు. మ‌రి ఇలా చేస్తే.. ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు రావా? అనేది మ‌రో ప్ర‌శ్న‌.

కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితి పార్టీనేత‌ల‌ను సంతృప్తి ప‌ర‌చాలంటే.. మండ‌లి కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. పార్టీ కీల‌క నేత‌లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో అసెంబ్లీని అత్యవ‌స‌రంగా అయినా.. స‌మావేశ ప‌రిచి..మండ‌లిని కొన‌సాగిస్తున్న‌ట్టు తీర్మానం చేయాల‌ని.. అప్ప‌ట్లో ప‌రిస్థితి వేర‌ని.. అందుకే ర‌ద్దు చేయాల‌ని అనుకున్నామ‌ని.. కానీ.. ఇప్పుడు ప‌రిస్థితి మారినందున ర‌ద్దును ఉప‌సంహ‌రించుకుంటున్నామ‌ని.. ప్ర‌తిపాదించ‌డం ద్వారా.. మండ‌లిని ర‌క్షించుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ఎటు అడుగులు వేస్తారోచూడాలి.



ఈటల, హరీష్ రావులా మితృత్వం ఏమాయే..!

మ‌న క‌ర్మ ఇలా కాలిందేంటి బ్ర‌ద‌ర్‌.. వైసీపీ నేత‌ల గుస‌గుస‌...!

అమ్మా బైలెల్లినాదో.. తల్లీ బైలెల్లినాదో..!

ఆ వైసీపీ ఎమ్మెల్యేకు పొగ పెడుతున్నారా... జ‌గ‌న్ వ్యూహ‌మేంటి...?

పెగాసస్ స్పైవేర్ పై నేడు సుప్రీంకోర్టు లో విచారణ

బండి సంజయ్‌కి అధిష్టానం షాక్‌.. పాదయాత్రకు బ్రేక్‌ ?

ఏపీ నార్త్‌కు కొత్త ఎమ్మెల్యే వ‌చ్చేశాడు...!

బీజేపీకి చుక్క‌లు చూపిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే...!

పూరీ కి ఇంత అన్యాయం ఏ సినిమా కి జరగలేదు!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>