MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcp29dc3131-9568-4bd6-b3a0-0f7422db7df9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcp29dc3131-9568-4bd6-b3a0-0f7422db7df9-415x250-IndiaHerald.jpgఅధికార వైసీపీలో దూకుడుగా పనిచేసే యువ ఎమ్మెల్యేలకు కొదవ లేదనే చెప్పొచ్చు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేలుగా గెలిచి, తక్కువ సమయంలోనే ప్రజల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నాయకుల్లో జక్కంపూడి రాజా కూడా ఒకరు. రాజా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గురించి తూర్పు గోదావరి ప్రజలకు పెద్దగా పరిచయం అక్కరలేదు. దశాబ్దాల పాటు జక్కంపూడి కాంగ్రెస్‌లో పనిచేశారు. గతంలో వైఎస్సార్ క్యాబినెట్‌లో కూడా పనిచేశారు. ysrcp{#}JAKKAMPUDI RAJA;Y. S. Rajasekhara Reddy;East;Service;Yuva;raja;Venkatesh;MLA;Hanu Raghavapudi;TDP;YCPహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రాజానగరంలో రాజా రెండోసారి?హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రాజానగరంలో రాజా రెండోసారి?ysrcp{#}JAKKAMPUDI RAJA;Y. S. Rajasekhara Reddy;East;Service;Yuva;raja;Venkatesh;MLA;Hanu Raghavapudi;TDP;YCPSun, 01 Aug 2021 05:00:00 GMTఅధికార వైసీపీలో దూకుడుగా పనిచేసే యువ ఎమ్మెల్యేలకు కొదవ లేదనే చెప్పొచ్చు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేలుగా గెలిచి, తక్కువ సమయంలోనే ప్రజల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నాయకుల్లో జక్కంపూడి రాజా కూడా ఒకరు. రాజా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గురించి తూర్పు గోదావరి ప్రజలకు పెద్దగా పరిచయం అక్కరలేదు. దశాబ్దాల పాటు జక్కంపూడి కాంగ్రెస్‌లో పనిచేశారు. గతంలో వైఎస్సార్ క్యాబినెట్‌లో కూడా పనిచేశారు.

ఇక జక్కంపూడి వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున రాజానగరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. తొలిసారి ఎమ్మెల్యే అయినా సరే ఏ మాత్రం తడబడకుండా ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజల సమస్యలని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకెళుతున్నారు.

రాజానగరంలో కొత్తగా రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, సి‌సి రోడ్లు, నాడు-నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి, జగనన్న కాలనీల ద్వారా పేదలకు ఉచితం ఇళ్ళు నిర్మించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు సమస్యలకు లేకుండా చూసుకుంటున్నారు. అటు జక్కంపూడి రామ్మోహన్ రావు ట్రస్ట్ ద్వారా ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. ఇక రాజానగరంలో దెబ్బతిన్న రోడ్లని అభివృద్ధి చేయడం, కొత్తగా రైతు బజార్లు నిర్మాణం, నియోజకవర్గంలో క్రీడా ప్రాంగణం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇలా అన్నీ రకాలుగా రాజానగరం ప్రజలకు రాజా సేవ చేస్తున్నారు.

అందుకే తక్కువ కాలంలోనే రాజా ప్రజల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న రాజాకు ప్రజల మద్ధతు పెరిగింది. అటు టీడీపీ ఇక్కడ వీక్ అయింది. రాజానగరంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అంత దూకుడుగా పనిచేయడం లేదు. ఇక మొత్తం మీద చూసుకున్నట్లైతే రాజానగరంలో రాజాకు తిరుగులేదని తెలుస్తోంది. రెండోసారి కూడా రాజాకు ఎమ్మెల్యేగా గెలవడం సులువే అని చెప్పొచ్చు.





జగన్ ట్రాప్‌లో చిక్కుకున్న బాబు..ప్లాన్ అదేనా!

అక్కడ పవన్‌కు కొంచెం కూడా ఛాన్స్ లేదుగా!

మాన్సాస్‌లో ట్విస్ట్‌లు..ఎంతదూరం తీసుకెళ్తారో?

ఆ 19 స్థానాల్లో లీడింగ్ మారిందా?

ఆ జిల్లా పరిషత్ ఫలితాల కోసం టీడీపీ ఆతృత...ప్లస్ ఉందా?

ఉద్యోగులకు ఒకేసారి.. రెండు శుభవార్తలు చెప్పిన జగన్..!

అంతా గురూజీ చేతుల్లోనే వుందంటున్న పవన్ ఫ్యాన్స్ ..... ??

అధికార వైసీపీలో దూకుడుగా పనిచేసే యువ ఎమ్మెల్యేలకు కొదవ లేదనే చెప్పొచ్చు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేలుగా గెలిచి, తక్కువ సమయంలోనే ప్రజల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నాయకుల్లో జక్కంపూడి రాజా కూడా ఒకరు. రాజా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గురించి తూర్పు గోదావరి ప్రజలకు పెద్దగా పరిచయం అక్కరలేదు. దశాబ్దాల పాటు జక్కంపూడి కాంగ్రెస్‌లో పనిచేశారు. గతంలో వైఎస్సార్ క్యాబినెట్‌లో కూడా పనిచేశారు.

ఎక్కడైనా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ యుద్ధం సహజంగానే జరుగుతుంది. కానీ ఏపీలో మాత్రం రాజకీయం కాస్త వ్యక్తిగతమైపోతుంది. పార్టీలు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తుంటాయి. అయితే ఇందులో అధికార పార్టీలదే పైచేయిగా ఉంటుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలనీ ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలిసిందే. రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా నేతలని ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పొచ్చు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>