PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/good-news-for-students-going-there-america6308cf03-3a29-4713-9006-6969ece3fc24-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/good-news-for-students-going-there-america6308cf03-3a29-4713-9006-6969ece3fc24-415x250-IndiaHerald.jpgభారతీయ విద్యార్థులకు అమెరికాకు వెళ్లి చదువుకోవాలని ఆశ. అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఫ్లైట్ లో హాయిగా ఎగిరి అగ్రరాజ్యంలో వాలిపోవాలని తహతహలాడుతుంటారు. అయితే ఇటీవల కరోనా కేసుల కారణంగా.. ఫ్లైట్ లు రద్దయ్యాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఎయిరిండియా విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. Good news for students going there america{#}Philippines;students;INTERNATIONAL;India;Coronavirusఅక్కడికి వెళ్లే విద్యార్థులకు శుభవార్త..!అక్కడికి వెళ్లే విద్యార్థులకు శుభవార్త..!Good news for students going there america{#}Philippines;students;INTERNATIONAL;India;CoronavirusSat, 31 Jul 2021 12:00:00 GMTఅమెరికా వెళ్లే విద్యార్థులకు ఎయిరిండియా తీపికబురు చెప్పింది. ఆగస్ట్ తొలివారం నుంచి అమెరికాకు విమాన సర్వీసులు రెట్టింపు చేస్తామని.. విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఇటీవల పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామంది. ఇటీవల పలు అంతర్జాతీయ సర్వీసులను ఎయిరిండియా రీషెడ్యూల్ చేయడంతో విద్యార్థులు అసంతృప్తికి గురయ్యారు. సోషల్ మీడియాలో ఎయిరిండియాకు విజ్ఞప్తులు పంపగా.. స్పందించిన సంస్థ ఈ ప్రకటన చేసింది.

ఇక భారత్ లో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను డీజీసీఏ ఆగస్ట్ 31వరకు పొడిగించింది. అయితే కార్గో విమానాలకు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు డీజీసీఏ ఓ ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు భారత్ లో కొత్తగా 41వేల 649కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే.. 6శాతం తగ్గాయి. ఇక మరో 593మంది కరోనాతో కన్నుమూశారు. మరోవైపు గడిచిన 24గంటల్లో 37వేల 291మంది కోలుకున్నారు. మొత్తం కేసులు 3కోట్ల 16లక్షళ 13వేల 993కు చేరింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 4లక్షల 8వేల 920మంది.. కోలుకున్నవారు 3కోట్ల 7లక్షల 81వేల 263మంది ఉన్నారు. మరణాలు అయితే 4లక్షల 23వేల 810కి చేరాయి.

కరోనా కారణంగా ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రయాణీకులపై అమలులో ఉన్న నిషేధాన్ని పొడిగించింది. ఇండియా నుంచి వచ్చే వారిపై ఇప్పటికే అమలులో ఉన్న నిషేధాన్ని ఆగస్ట్ 15వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. డెల్టావేరియంట్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకుందట. ఫిలిప్పీన్స్ లో భారత మెడికల్ విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. భారత ప్రయాణీకులపై ఫిలిప్పీన్స్ ఏప్రిల్ లో మొదట నిషేధం విధించింది.

ఎయిరిండియా తీసుకున్న తాజా నిర్ణయంతో విద్యార్థులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తమ కల నెరవేరబోతోందని ఎగిరి గంతేస్తున్నారు. అగ్రరాజ్యానికి వెళ్లే విద్యార్థులు ఉన్నత చదువులు చదివి.. ప్రయోజకులుగా తిరిగి రావాలని మనమూ కోరుకుందాం..



 





టెస్ట్ సిరీస్ ముంగిట.. టీమిండియాకు గుడ్ న్యూస్.. ఇంగ్లాండ్ కు బ్యాడ్ న్యూస్?

జాతిరత్నం లాంటి మరో సినిమా.. టైటిల్ ఇదే!!

కూతురు ఒలంపిక్స్ ఫైనల్ లో, తండ్రి పొలంలో...!

ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కె అవ‌తార్ టెక్నిషియ‌న్స్‌@ 500కోట్ల బ‌డ్జెట్‌..?

టోక్యో ఒలంపిక్స్ : క్వార్టర్స్ కి మహిళా హాకీ జట్టు?

అల్లు రామలింగయ్య పేరు వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా..?

శంకర్ చేసిన పనికి హర్ట్ అవుతున్న చెర్రీ ఫ్యాన్స్!!

'తిమ్మరుసు' హీరోకు బంపర్ ఆఫర్ ఇచ్చిన 'దేవర'... ?

రజినీ అల్లుడు మాములోడు కాదు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>