CrimePaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/cheating5d691b5b-b4e3-4de2-9f81-bcc8f38faa52-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/cheating5d691b5b-b4e3-4de2-9f81-bcc8f38faa52-415x250-IndiaHerald.jpgచిన్నా చితకా వ్యాప‌రం, కొంద‌రు ఏది దొరికితే ఆ ప‌ని చేసి ఎంతో కొంత సంపాదించుకుంటారు. ఆ సంపాద‌న‌లో కొంత ఖ‌ర్చు పెట్ట‌కుని మిగిలిన‌వి త‌మ పిల్ల‌ల భ‌విష్యత్ కోసం లేదా త‌మ అవ‌స‌రాల కోసమ‌ని చిట్టీలు వేస్తూంటారు. అలా చిట్టీలు వేసిన కొంద‌రు మోస‌పోతూనే ఉంటున్నారు. ప్ర‌భుత్వాలు, పోలీసులు ఎంత‌గా అవ‌గాహ‌న క‌ల్పించినా ప్ర‌జ‌లు చిట్టీలు వేసి లాస్ అవుతూనే ఉన్నారు. మాయ‌గాళ్లు చిట్టీల పేరుతో అమాయ‌క ప్ర‌జ‌ల‌కు కుచ్చు టోపి పెడుతూనే ఉన్నారు. చిట్టీల‌తో త‌మ భ‌విష్యత్తును ఎంతో కొంత మార్చుకుందామ‌ని చూసిన సామాన్యcheating{#}chinna;Chittoor;Wife;policeచిట్టీల వ్యాపారి కుచ్చు టోపి.. రూ.10 కోట్లు పాయే..చిట్టీల వ్యాపారి కుచ్చు టోపి.. రూ.10 కోట్లు పాయే..cheating{#}chinna;Chittoor;Wife;policeSat, 31 Jul 2021 08:12:29 GMT చిన్నా చితకా వ్యాప‌రం, కొంద‌రు ఏది దొరికితే ఆ ప‌ని చేసి ఎంతో కొంత సంపాదించుకుంటారు. ఆ సంపాద‌న‌లో కొంత ఖ‌ర్చు పెట్ట‌కుని మిగిలిన‌వి త‌మ పిల్ల‌ల భ‌విష్యత్ కోసం లేదా త‌మ అవ‌స‌రాల కోసమ‌ని చిట్టీలు వేస్తూంటారు. అలా చిట్టీలు వేసిన కొంద‌రు మోస‌పోతూనే ఉంటున్నారు. ప్ర‌భుత్వాలు, పోలీసులు ఎంత‌గా అవ‌గాహ‌న క‌ల్పించినా ప్ర‌జ‌లు చిట్టీలు వేసి లాస్ అవుతూనే ఉన్నారు. మాయ‌గాళ్లు చిట్టీల పేరుతో అమాయ‌క ప్ర‌జ‌ల‌కు కుచ్చు టోపి పెడుతూనే ఉన్నారు.

     చిట్టీల‌తో త‌మ భ‌విష్యత్తును ఎంతో కొంత మార్చుకుందామ‌ని చూసిన సామాన్యుల ఆశ‌లు ఆవిర‌య్యాయి. వారిని ప‌ట్టించుకునే వారు లేక ఎంత బాధ‌లు ప‌డ్డారో గ‌తంలోని కొన్ని సంఘ‌ట‌న‌ల ఆధారంగా మ‌న‌కు తెలుస్తోంది. ఇదే తీరులో తాజాగా చిత్తూరు జిల్లా న‌గరిలో ఓ చిట్టీల వ్యాపారి ప్ర‌జ‌ల‌ను చీట్ చేసి దాదాపు జంప్ అయ్యాడు. దీంతో చాలా మందిలో ఆందోళ‌న పెరిగింది.  దాదాపు రూ.10 కోట్ల వ‌ర‌కు చీటీలు నిర్వ‌హిస్తున్న అరుణ్‌కుమార్ ఇటీవ‌ల మాయం అయిపోయాడు. దీంతో అత‌ని దగ్గ‌ర చిట్టీలు వేసిన వారు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.  ఈయ‌న ద‌గ్గ‌ర చిట్టీలు వేసింది ఎక్కువ‌గా పేద‌వారే, ల‌క్ష నుంచి 10 ల‌క్ష‌ల వ‌ర‌కు చిట్టీలు క‌ట్టారు. బాధితుల్లో చాలామంది ఏకాంబ‌ర కుప్పంకు చెందిన నేత కార్మికులు.


  అరుణ్‌కుమార్ కొద్ది రోజులుగా క‌రోనా సాకు చూసి డ‌బ్బులు చెల్లించ‌కుండా దాటుకుంటూ వ‌చ్చారు. ఇదే క్ర‌మంలో త‌న భార్య పిల్ల‌ల‌ను ఇంట్లో వ‌దిలి మాయం అయిపోయాడు. విష‌యం తెలుసుకున్న బాధితులు న‌గ‌రి సీఐ మ‌ద్ద‌య్య చారికి ఫిర్యాదు చేశారు. అరుణ్‌కుమార్ క‌నిపించ‌క‌పోయే స‌రికి ఆయ‌న దగ్గ‌ర చిట్టీలు వేసిన దాదాపు 200 మంది ఆందోళ‌న చెందుతున్నారు. బాధితులు మాత్రం ఏలాగైన త‌మ‌కు త‌మ డ‌బ్బులు తిరిగి ఇప్పించాల‌ని పోలీసుల‌ను వేడుకుంటున్నారు. త‌మ పిల్ల‌ల చ‌దువుల కోసం, పెళ్లిళ్ల కోసం చిట్టీలు వేశామ‌ని ఇలా మోసం జ‌రుగుతుంద‌ని ఊహించ‌లేద‌ని బాధితులు ల‌బోదిబోమంటున్నారు.

  అయితే, చిట్టీల విష‌యంలో గ‌తంలోనే అనేక సార్లు పోలీసులు, ప్ర‌భుత్వాలు, న్యాయ నిపుణులు అనేక సూచ‌న‌ల‌తో పాటు హెచ్చ‌రిక‌లు కూడా చేశారు. చిట్టీలు వేసే వారు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, న‌మ్మ‌కం లేని వారి ద‌గ్గ‌ర అవ‌స‌ర‌మ‌యితే చిట్టీలు వేయ‌ద్ద‌ని సూచించారు. ఏది ఏమైనా ప్ర‌జ‌లు చిట్టీలు వేసి మాయ‌గాళ్ల చేతుల్లో మోస‌పోతూనే ఉన్నారు. ఇప్ప‌టికైనా త‌గిన ముందు జాగ్ర‌త్త‌లు తీసుకొని ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించాల‌ని ప‌లువురు సూచిస్తున్నారు.






శిల్పా శెట్టికి షాక్ : పరువు నష్టం ఎలా అవుతుంది ?

మందుబాబులకు షాక్.. రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్‌ !

భర్త బుల్లెట్ కొనిస్తే.. భార్య ఏం చేసిందో తెలుసా..?

దేవినేనికి వైసీపీ ఇంత మేలు చేసిందా?

రివర్స్ పాలిటిక్స్: ఇప్పుడు దేవినేనికి...అప్పుడు వైఎస్సార్‌కు..?

సినిమాల్లో అవకాశం ఇస్తానని.. పాంహౌజ్ తీసుకెళ్లి ఆమెపై...?

నువ్వెవ‌రు? నా ఇంటికొచ్చి తాళం వేస్తున్నావ్‌?

ఈటల రాజేందర్ కు స్వల్ప అస్వస్థత

మీడియా పై శిల్ప శెట్టి పరువు నష్టం దావా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>