Illegal affair: భార్య ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్, భర్త ఆంటీల టెక్నీషియన్, రివర్స్ !
బెంగళూరు: కుటుంబ సభ్యులు చూసిన వ్యక్తిని వివాహం చేసుకున్న భార్య ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. భర్త బ్యాంకులో అటెండర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేస్తున్నది. ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారని బంధువులు అందరూ సంతోషించారు. అయితే బయట అందరూ అనుకున్నట్లు వీరి సంసారం సుఖంగా సాగలేదు. భార్య ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేస్తుంటే భర్త బ్యాంకులో ఉద్యోగం చేస్తూ బయట ఆంటీ మీద ప్రయోగాలు చేస్తున్నాడు. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. మద్యాహ్నం హోటల్ లో భార్యతో కలిసి భర్త భోజనం చేశాడు. రాత్రి ఇంట్లో పంచాయితీ పెట్టడాడు. మరుసటి రోజు ఉదయం భార్యను వాకింగ్ కు పిలుచుకుని వెళ్లిన భర్త ఆమెను చంపేసి శవాన్ని రోడ్డు పక్కన విసిరేసి చేతులు దులుపుకోవడం కలకలం రేపింది.
Illegal affair: లడ్డూ లాంటి పెళ్లానికి రసగుల్లా లాంటి లవర్, బెడ్ రూమ్ లో కొడుకు ఏడ్చాడని !

పెద్దలు చేసిన పెళ్లి
కర్ణాటకలోని కోప్పళ జిల్లాలోని యలబుర్గా తాలుకాలోని యడ్కోణి గ్రామంలో నివాసం ఉంటున్న మంజుల (25) అనే యువతికి, కోప్పళ తాలుకా యద్వాబళ్లి గ్రామంలో నివాసం ఉంటున్న మంజునాథ్ అనే యువకుడికి పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. మంజునాథ్, మంజుల దంపతులకు ఐదు సంవత్సరాల లోపు వయసు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మంచి ఉద్యోగాలు
కుటుంబ సభ్యులు చూసిన వ్యక్తిని వివాహం చేసుకున్న మంజుల భర్త మంజునాథ్, ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా జీవించాలని కలలుకనింది. భర్త మంజునాథ్ కుష్టగిలోని కెనరా బ్యాంకులో అటెండర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. భార్య మంజుల కోప్పళ ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేస్తున్నది.

బంధువుల లెక్కలు తారుమారు
మంజుల, మంజునాథ్ ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారని బంధువులు అందరూ సంతోషించారు. అయితే బయట అందరూ అనుకున్నట్లు మంజుల, మంజునాథ్ సంసారం సుఖంగా సాగలేదు. వివాహం చేసుకున్నప్పటి నుంచి అదనపుకట్నం తీసుకురావాలని భర్త మంజునాథ్ అతని భార్య మంజులకు టార్చర్ పెట్టాడు. నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మంచి జీతం సంపాధిస్తున్నానని, మళ్లీ ఎందుకు కట్నం తీసుకురావాలని మంజుల ఎదురుతిరిగింది.

భార్య ల్యాబ్ టెక్నీషియన్..... భర్త ఆంటీల టెక్నీషియన్
భార్య మంజుల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రయోగాలు చేస్తుంటే ఆమె భర్త మంజునాథ్ బ్యాంకులో ఉద్యోగం పూర్తి అయిన తరువాత ఊరిమీద పడి ఆంటీలతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆంటీల మీద రకరకాల ప్రయోగాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్న భర్త మంజునాథ్ సంపాధించిన జీతం మొత్తం పారాయి స్త్రీల వ్యామోహంలో ఖర్చు చేస్తూ భార్య మంజులను అదనపు కట్నం తీసుకురావాలని ఆమెను టార్చర్ పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి.

ఇంట్లో రచ్చరచ్చ చేసి బయట ఎంజాయ్ చేస్తున్న భర్త
ఉదయం చక్కగా ఉద్యోగానికి వెలుతున్న భర్త మంజునాథ్ రాత్రి ఇంటికి వెళ్లి అతని భార్య మంజులను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రతినిత్యం భర్త టాచర్చర్ తట్టుకోలేక మంజుల చాలా కాలం ఓర్చుకుంది. ఇటీవల మంజునాథ్ ఆమె ప్రియురాలితో తిరుగుతూ అతని భార్య మంజులకు అడ్డంగా చక్కిపోవడంతో గొడవలు పెద్దవి అయ్యాయి. కుటుంబ సభ్యులు నచ్చచెప్పడంతో కొన్ని రోజుల తరువాత మంజుల, ఆమె భర్త మంజునాథ్ సైలెంట్ గా ఉండిపోయారు.

భార్యను హోటల్ కు పిలుచుకుని వెళ్లిన భర్త
గురువారం మద్యాహ్నం ఇద్దరూ కలిసి హోటల్ లో మంచి భోజనం చేద్దామని, తరువాత సాయంత్రం ఉద్యోగాలు ముగించుకుని ఒకేసారి ఇంటికి వద్దామని మంజునాథ్ అతని భార్యకు చెప్పాడు. మద్యాహ్నం హోటల్ కు వెళ్లి సంతోషంగా భార్య మంజులతో కలిసి భోజనం చేస్తున్న సమయంలో సెల్ఫీ తీసుకున్న మంజునాథ్ తరువాత ఆ ఫోటో సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టాడు.

వాకింగ్ పిలుచుకుని వెళ్లి భార్యను చంపేశాడు
గురువారం రాత్రి ఇంటికి వెళ్లిన మంజునాథ్ అతని భార్య మంజులతో గొడవ పెట్టుకున్నాడు. రాత్రి దంపతులు ఇద్దరూ వేర్వేరు గదుల్లో నిద్రపోయారు. శుక్రవారం ఉదయం భార్య మంజులను కోప్పళ ఊరి బయట వాకింగ్ కు పిలుచుకుని వెళ్లిన భర్త మార్గం మద్యలో ఆమె గొంతు బిగించి చంపేసి శవాన్ని రోడ్డు పక్కన ఉన్న ముళ్లపొదల్లో విసిరేసి ఇంటికి వెళ్లిపోయాడు. మద్యాహ్నం మంజుల శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

నా అల్లుడు కామాంధుడు, కసాయి
తన అల్లుడికి వేరే మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, సంపాధించిన జీతం మొత్తం పరాయిస్త్రీలకు ఖర్చు చేసి పుట్టింటి నుంచి కట్నం తీసుకురావాలని తమ కుమార్తెను వేధింపులకు గురి చేస్తున్నాడు, పెళ్లి జరిగినప్పటి నుంచి ఇదే పంచాయితీ అని, అతనే మా కూతురు మంజులను హత్య చేశాడని ఆమె తండ్రి కోప్పళ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంజులను తానే హత్య చేశానని ఆంటీల ప్రియుడు మంజునాథ్ పోలీసుల విచారణలో అంగీకరించడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. తల్లి హత్యకు గురి కావడం, తండ్రి జైలుకు వెళ్లడంత ఇద్దరు చిన్నారులు ఇప్పుడు అనాథలు అయ్యారు.