SatireChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/satire/129/jobsdd91762f-7522-4129-bc2c-7dab360a8469-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/satire/129/jobsdd91762f-7522-4129-bc2c-7dab360a8469-415x250-IndiaHerald.jpgప్రభుత్వ ఉద్యోగం ప్రతి యువకుడి ఆశ.. కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుంటే ఇక జీవితంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగం ఉంటుందా.. ఊడుతుందా అన్న బెంగ ఉండదు..జీతం వస్తుందా రాదా అన్న బెంగ ఉండదు. ఒక్కసారి వస్తే ఇక రిటైర్ అయ్యిందాకా చింత ఉండదు. అంతే కాదు.. ప్రభుత్వ ఉద్యోగస్తుడు అంటే అదో గౌరవం..అందుకే ప్రభుత్వ ఉద్యోగం కోసం యువత అంతగా ఆలోచిస్తుంటారు. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు ఉద్యోగాలు త్వరగా నింపట్లేదు. అనుమతి ఉన్న ఉద్యోగాలనే ఖాళీగా పెడుతున్నారు తప్ప త్వరగా నోటిఫికేషన్లు వేయడం లేదు. తాజాగా తjobs{#}March;job;central government;2020;KCRబాబోయ్.. 9 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయా..?బాబోయ్.. 9 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయా..?jobs{#}March;job;central government;2020;KCRFri, 30 Jul 2021 07:13:00 GMTప్రభుత్వ ఉద్యోగం ప్రతి యువకుడి ఆశ.. కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుంటే ఇక జీవితంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగం ఉంటుందా.. ఊడుతుందా అన్న బెంగ ఉండదు..జీతం వస్తుందా రాదా అన్న బెంగ ఉండదు. ఒక్కసారి వస్తే ఇక రిటైర్ అయ్యిందాకా చింత ఉండదు. అంతే కాదు.. ప్రభుత్వ ఉద్యోగస్తుడు అంటే అదో గౌరవం..అందుకే ప్రభుత్వ ఉద్యోగం కోసం యువత అంతగా ఆలోచిస్తుంటారు.


అయితే ఇప్పుడు ప్రభుత్వాలు ఉద్యోగాలు త్వరగా నింపట్లేదు. అనుమతి ఉన్న ఉద్యోగాలనే ఖాళీగా పెడుతున్నారు తప్ప త్వరగా నోటిఫికేషన్లు వేయడం లేదు. తాజాగా తేలిందేమిటంటే.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మొత్తం 8.72 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయట. వివిధ శాఖల్లో ఈ ఖాళీలు ఉన్నాయట. ఈ విషయాన్ని  కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేందర్‌ సింగ్‌ స్వయంగా చెప్పారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన రాజ్యసభలో  సమాధానం చెప్పారు.


2020 మార్చి ఒకటో తేదీ నాటికి కేంద్రంలో మొత్తం 40 లక్షల 4 వేల 9వందల 41 పోస్టులు మంజూరు అయ్యాయట. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో 31 లక్షల 32వేల 6వందల 98 మంది పనిచేస్తున్నారట. అంటే.. గతేడాది మార్చి ఒకటో తేదీ నాటికి 8లక్షల 72వేల 2వందల 43 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట.  2016-17 నుంచి 2020-21 వరకు ఐదేళ్లలో యూపీఎస్సీ ద్వారా 25వేల 267 ఉద్యోగాలు నియమించారట. అలాగే.. స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ ద్వారా 2లక్షల 14వేల 601 ఉద్యోగాలు భర్తీ చేశారట.


ఇక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 2లక్షల 4వేల 245 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ రాజ్యసభకు వెల్లడించారు.. ఈ విషయంలో రాష్ట్రాలు కూడా ఏమీ తక్కువ తినలేదు. కేసీఆర్ సర్కారు దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంచిందని ఇటీవల ఓ కమిటీ నివేదికలో తేలింది. ఈ ఉద్యోగాలు నింపితే.. లక్షల మంది యువతకు ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వ పనులూ సాఫీగా సాగుతాయి.





మోదీ గేమ్ ప్లాన్ అదుర్స్

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మొత్తం 8.72 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయట. వివిధ శాఖల్లో ఈ ఖాళీలు ఉన్నాయట. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేందర్‌ సింగ్‌ స్వయంగా చెప్పారు.

పోలీస్ అధికారి నియామకంతో చిక్కుల్లో పడ్డ మోదీ..

హుజూరాబాద్‌ ఎన్నిక.. దేశంలోనే రికార్డు కొట్టబోతోందా..? ‍

ఆడు ఆడించు : ద‌ర్యాప్తు సంస్థ‌ల‌న్నీ బొమ్మ‌లేనా!

చిక్కుల్లో రేవంత్ ... కేసీఆర్ స్కెచ్

బిజినెస్: మోడీ ప్రభుత్వం ప్రకటించిన అదిరిపోయే ఆఫర్.. రూ.5 లక్షలు మీ సొంతం..

హమ్మయ్య: జగన్ మనసు మారింది...?

OBC స్టూడెంట్స్ కి కేంద్రం గుడ్ న్యూస్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>