PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో పార్టీలో ఓ యువ ఎమ్మెల్యే ఇప్పుడు ర‌గులుతున్న‌ట్టు తెలుస్తోంది. క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ యువ‌నేత శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజ‌యం సాధించారు. 2017 ఉప ఎన్నిక‌ల్లో ఓడిన శిల్పా వెంక‌ట్ రెడ్డి త‌న‌యుడే ఈ ర‌వికిశోర్ రెడ్డి. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌నే స్వ‌యంగా ర‌వికిషోర్‌కు సీటు ఇవ్వ‌డం.. బంప‌ర్ మెజార్టీతో ఆయ‌న గెల‌వ‌డం జ‌రిగిపోయాయి. ఈ క్ర‌మంలోనే కీల‌క‌మైన నంద్యాల మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు కోసం ఆయ‌న ఎంతో కష్ట‌Jagan Ysrcp{#}kishore;Shield;Nandyala;Reddy;local language;Yuva;shilpa;District;Wife;CM;MLA;Partyజ‌గ‌న్ చేసిన ప‌నికి హ‌ర్ట్ అయిన వైసీపీ యువ ఎమ్మెల్యే ?జ‌గ‌న్ చేసిన ప‌నికి హ‌ర్ట్ అయిన వైసీపీ యువ ఎమ్మెల్యే ?Jagan Ysrcp{#}kishore;Shield;Nandyala;Reddy;local language;Yuva;shilpa;District;Wife;CM;MLA;PartyFri, 30 Jul 2021 12:50:00 GMTఏపీలో సీఎం జ‌గ‌న్ తీసుకుంటోన్న కొన్ని నిర్ణ‌యాలు పార్టీ నాయ‌కుల‌కు, కేడ‌ర్‌కు న‌చ్చ‌డం లేదు. ఇటీవ‌ల ప‌లు కార్పొరేష‌న్ల‌కు, మున్సిపాల్టీల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. స‌హ‌జంగా ఏ కార్పొరేష‌న్ లేదా మున్సిపాల్టీలో అయినా అక్క‌డ చైర్మ‌న్లు, వైఎస్ చైర్మ‌న్ల‌ను స్థానిక ఎమ్మెల్యే లేదా పార్టీ నేతే డిసైడ్ చేస్తారు. అయితే జ‌గ‌న్ ఇందుకు భిన్నంగా మేయ‌ర్లు, మునిసిప‌ల్ చైర్మ‌న్ల తో పాటు డిప్యూటీ మేయ‌ర్లు, వైస్ చైర్మ‌న్ల పేర్ల‌ను కూడా పై నుంచే షీల్డ్ క‌వ‌ర్ల‌లో పెట్టి పంపారు. దీంతో ఎమ్మెల్యేల‌కు ఈ విష‌యం మింగుడు ప‌డ‌డం లేదు.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో పార్టీలో ఓ యువ ఎమ్మెల్యే ఇప్పుడు ర‌గులుతున్న‌ట్టు తెలుస్తోంది. క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ యువ‌నేత శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజ‌యం సాధించారు. 2017 ఉప ఎన్నిక‌ల్లో ఓడిన శిల్పా వెంక‌ట్ రెడ్డి త‌న‌యుడే ఈ ర‌వికిశోర్ రెడ్డి. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌నే స్వ‌యంగా ర‌వికిషోర్‌కు సీటు ఇవ్వ‌డం.. బంప‌ర్ మెజార్టీతో ఆయ‌న గెల‌వ‌డం జ‌రిగిపోయాయి. ఈ క్ర‌మంలోనే కీల‌క‌మైన నంద్యాల మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు కోసం ఆయ‌న ఎంతో కష్ట‌ప‌డి పార్టీని గెలిపించారు.

మునిసిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌విని త‌న భార్య‌కు ఇప్పించుకోవాల‌ని ముందుగానే ప్లాన్‌తో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఎమ్మెల్యే భార్య కౌన్సెల‌ర్‌గా కూడా గెలిచారు.
ఎమ్మెల్యే భార్య నాగిని రెడ్డి యేడాది కాలంగా మున్సిపాల్టీలో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల‌కు చేరువ అవ్వ‌డంతో పాటు చైర్మ‌న్ పద‌విపై ఆశ‌ల‌తో ఉన్నారు. అయితే ఆమె అంద‌రూ చైర్మ‌న్ అనుకుంటోన్న స‌మ‌యంలో జ‌గ‌న్ నేరుగా రంగంలోకి దిగి ముస్లిం మైనార్టీకి చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. ఇక వైఎస్ చైర్మ‌న్ ప‌ద‌వి అయినా నాగిని రెడ్డికి వ‌స్తుంద‌నుకుంటే జ‌గ‌న్ మ‌రో షాక్ ఇచ్చారు.

వైస్ చైర్మ‌న్ ప‌ద‌విని బ‌లిజ వ‌ర్గానికి చెందిన వాసగిరి విజయభాస్క‌ర్‌కు ఇచ్చారు. దీంతో తాము ఒంటి చేత్తో మున్సిపాల్టీని గెలిపిస్తే ప‌ద‌వులు వేరే వాళ్ల‌కు ఇవ్వ‌డం ఏంట‌ని ఇప్పుడు ఎమ్మెల్యే తీవ్రంగా హ‌ర్ట్ అయిన‌ట్టు స్థానికంగా చ‌ర్చ న‌డుస్తోంది.



ఢిల్లీ గేట్ : సాయిరెడ్డి వెర్సస్ స్పీకర్

మునిసిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వి భార్య ఇవ్వ‌లేద‌ని హ‌ర్ట్ అయిన నంద్యాల ఎమ్మెల్యే ర‌వికిషోర్ ?

తేజ లో కాన్ఫిడెన్స్ ఇంత దూరం తెచ్చింది!!

పోర్నోగ్రఫీ కేసులో ఆ హీరోయిన్ పేరు..!

అన్నా ప్లీజ్ హెల్ఫ్ అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే ఫోన్‌..!

ఇకనుంచి చదువు పూర్తయ్యాక.. విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉండలేరా..?

నైబ‌ర్ హుడ్ రూల్ : బైడెన్ మాత్రం న్యాయం చేస్తాడా?

సూపర్ స్టార్ మహేష్ ఫస్ట్ మూవీ 'రాజకుమారుడు' 21 ఏళ్ళ సక్సెస్ఫుల్ జర్నీ ..... !!

అన్న మీద ప్రేమ... కార్యకర్తల మీద సిబిఐ ఫోకస్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>