MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajakumaruduc383c41b-ba81-4ccd-a6f1-c746ab714d15-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajakumaruduc383c41b-ba81-4ccd-a6f1-c746ab714d15-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా తండ్రి కృష్ణ నట వారసుడిగా దర్శకరత్న శ్రీ దాసరి నారాయణ రావు తెరకెక్కించిన నీడ సినిమా ద్వారా టాలీవుడ్ కి నటుడిగా పరిచయం అయ్యారు. అక్కడి నుండి వరుసగా బాలనటుడిగా చాలా సినిమాలు చేసి ఆ వయసులోనే ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్న మహేష్, చివరిగా బాలచంద్రుడు మూవీ తో సినిమాలకు విరామం పలికి, అనంతరం పైచదువులు తో పాటు నటన, డ్యాన్స్, ఫైట్స్ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నారు. ఆపై 1999లో రాజకుమారుడు మూవీతో హీరోగా లాంఛ్ అయిన మహేష్, ఫస్ట్ మూవీ తోనే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ rajakumarudu{#}ashwini dutt;k raghavendra rao;vyjayanthi;Episode;Konakalla Narayana Rao;Rajakumarudu;100 days;mani sharma;sree;prasad;Master;Vijayawada;Reddy;Blockbuster hit;Success;Heroine;mahesh babu;Father;House;ajay;cinema theater;bollywood;media;Darsakudu;krishna;Hero;Tollywood;Director;Cinemaసూపర్ స్టార్ మహేష్ ఫస్ట్ మూవీ 'రాజకుమారుడు' 21 ఏళ్ళ సక్సెస్ఫుల్ జర్నీ ..... !!సూపర్ స్టార్ మహేష్ ఫస్ట్ మూవీ 'రాజకుమారుడు' 21 ఏళ్ళ సక్సెస్ఫుల్ జర్నీ ..... !!rajakumarudu{#}ashwini dutt;k raghavendra rao;vyjayanthi;Episode;Konakalla Narayana Rao;Rajakumarudu;100 days;mani sharma;sree;prasad;Master;Vijayawada;Reddy;Blockbuster hit;Success;Heroine;mahesh babu;Father;House;ajay;cinema theater;bollywood;media;Darsakudu;krishna;Hero;Tollywood;Director;CinemaFri, 30 Jul 2021 12:04:21 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా తండ్రి కృష్ణ నట వారసుడిగా దర్శకరత్న శ్రీ దాసరి నారాయణ రావు తెరకెక్కించిన నీడ సినిమా ద్వారా టాలీవుడ్ కి నటుడిగా పరిచయం అయ్యారు. అక్కడి నుండి వరుసగా బాలనటుడిగా చాలా సినిమాలు చేసి ఆ వయసులోనే ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్న మహేష్, చివరిగా బాలచంద్రుడు మూవీ తో సినిమాలకు విరామం పలికి, అనంతరం పైచదువులు తో పాటు నటన, డ్యాన్స్, ఫైట్స్ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నారు. ఆపై 1999లో రాజకుమారుడు మూవీతో హీరోగా లాంఛ్ అయిన మహేష్, ఫస్ట్ మూవీ తోనే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు.

దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాని వైజయంతి మూవీ స్ బ్యానర్ పై సి అశ్వినీదత్ నిర్మించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. బాలీవుడ్ భామ ప్రీతీ జింతా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీహరి, ప్రకాష్ రాజ్, సుమలత, శివాజీరాజా, ప్రసాద్ బాబు, జయప్రకాశ్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు చేసారు. సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాలో మహేష్ తండ్రిగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ లో కనిపిస్తారు. అప్పట్లో రాజకుమారుడు మూవీ చాలా ప్రాంతాల్లో భారీ రికార్డ్స్ ని సొంతం చేసుకుని విజయవాడ లోని అలంకార్ థియేటర్ లో ఏకంగా 100 రోజులు ఆల్ షోస్ హౌస్ ఫుల్ గా ప్రదర్శింపబడి ఫస్ట్ మూవీతోనే మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినాని రుజువు చేసింది.

ముఖ్యంగా ఈ సినిమాలో దర్శకుడు రాఘవేంద్రరావు వండర్ఫుల్ టేకింగ్, హీరోగా మహేష్ సూపర్ యాక్టింగ్, హీరోయిన్ ప్రీతీ అంద చందాలు, ముఖ్యంగా మణిశర్మ అందించిన సాంగ్స్, బీజీఎమ్ తో పాటు ఫైట్ మాస్టర్ విజయన్ కంపోజ్ చేసిన అద్భుతమైన ఫైట్స్, కెమెరా మ్యాన్ అజయ్ విన్సెంట్ అందించిన ఆకట్టుకునే విజువల్స్ సినిమా ఇంత భారీ సక్సెస్ కు ముఖ్య కారణాలుగా నిలిచాయి. కాగా ఈ సినిమా నేటితో సక్సెసఫుల్ గా 22 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో పలువురు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా హీరో మహేష్ తో పాటు రాజకుమారుడు చిత్ర యూనిట్ కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు.....!!  
" style="height: 908px;">




ఓటీటీ లోనూ అంతే.. చుక్కలు చూపిస్తున్నారు!!

ప్రజల కోసం సోనుసూద్‌ ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశాడో తెలుసా ?

పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు అప్పుడే విడాకులు కు వెళుతున్న సంజన!

మీ అంతు చూస్తా ఆగండి..

అశ్లీలత ఓ క‌ళా రూపమే.. వాళ్ల‌కు ఆ న‌టి స‌పోర్ట్‌..!

సినిమాలలో నటించడం పై స్పందించిన బిగ్ బి మనవరాలు..!

గుంటూరు ఘటన కరెంట్ షాక్ కాదా...?

అన్న‌మ‌య్య లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ చేసుకున్న టాప్ డైరెక్ట‌ర్ ?

ఆర్యపై మహిళ చీటింగ్ కేసు... పెళ్లి చేసుకుంటానని...!?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>