BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/taga6a46ad6-7c3a-43b0-9a13-10ddcd6cb5d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/taga6a46ad6-7c3a-43b0-9a13-10ddcd6cb5d0-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ప్రారంభించే ప్రతి ప‌థ‌కంలో ఒక స్కామ్ ఉందని తెలుగుదేశం పార్టీ నేత కూన రవికుమార్ ఆరోపించారు. పాఠ్య పుస్తకాలు ముద్రించాలంటూ పుణెకు చెందిన ఓ సంస్థ‌కు 100 కోట్ల రూపాయ‌ల కాంట్రాక్టు ఇచ్చార‌ని వెల్ల‌డించారు. ఉద్యోగులు, పింఛ‌నుదారులు ప్రతినెలా జీతాల కోసం, పింఛ‌న్ల కోసం ఎదురు చూపులు చూస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జగన్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న‌ట్లు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంద‌ని రవికుమార్ అన్నారు. ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ పేరు మార్చి విద్యా దీవెన అని పేరు పెట్టtag{#}K S Ravikumar;Sakshi;March;Telugu Desam Party;Jagan;Governmentఏపీలో ఒక్కో స్కీమ్‌కు ఒక్కో స్కామ్‌?ఏపీలో ఒక్కో స్కీమ్‌కు ఒక్కో స్కామ్‌?tag{#}K S Ravikumar;Sakshi;March;Telugu Desam Party;Jagan;GovernmentFri, 30 Jul 2021 12:27:04 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ప్రారంభించే ప్రతి ప‌థ‌కంలో ఒక స్కామ్ ఉందని తెలుగుదేశం పార్టీ నేత కూన రవికుమార్ ఆరోపించారు.  పాఠ్య పుస్తకాలు ముద్రించాలంటూ పుణెకు చెందిన ఓ సంస్థ‌కు 100 కోట్ల రూపాయ‌ల కాంట్రాక్టు ఇచ్చార‌ని వెల్ల‌డించారు.  ఉద్యోగులు, పింఛ‌నుదారులు ప్రతినెలా జీతాల కోసం, పింఛ‌న్ల కోసం ఎదురు చూపులు చూస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  జగన్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న‌ట్లు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంద‌ని రవికుమార్ అన్నారు. ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ పేరు మార్చి విద్యా దీవెన అని పేరు పెట్టార‌ని, సాక్షి దిన‌ప‌త్రిక‌కు విడ‌త‌ల‌వారీగా కోట్ల‌ రూపాయల ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నార‌ని, జగన్ త్వరలో జగనన్న జీతం దీవెన కూడా పెట్ట‌బోతున్నారంటూ ఎక‌సెక్కాలాడారు. నాడు - నేడు పథకం కింద త‌మ ప్ర‌భుత్వం నిర్మించిన పాఠ‌శాల భ‌వ‌నాల‌కు రంగులు వేస్తున్న‌ర‌ని, పాఠ‌శాల‌లో ఏర్పాటుచేసే ప్ర‌తి ఫ్యాన్ రూ.600 కంటే ఎక్కువ‌కు కొంటున్నార‌న్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పాఠశాలల మౌలిక వసతులకు రూ.5000 కోట్లు ప్ర‌తిపాదించామ‌ని,  ఆ నిధులను నాడు - నేడులో ఖర్చుపెట్టి ఇప్పుడు తామేదో ఖ‌ర్చుపెడుతున్న‌ట్లు గొప్పలు చెబుతున్నారని ర‌వికుమార్ విమ‌ర్శించారు.



ఢిల్లీ గేట్ : సాయిరెడ్డి వెర్సస్ స్పీకర్

చిరు అనవసరపు రిస్క్ తీసుకుంటున్నాడా..!!

యువ బాక్స‌ర్ ల‌వ్లీనా బార్గోహెన్ సెమీఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో 4-1 తేడాతో తైపీకి చెందిన మాజీ ప్ర‌పంచ చాంపియ‌న్ నీన్ చిన్‌పై ఘ‌న విజ‌యం సాధించి సెమీస్‌లో బెర్త్ ఖ‌రారు చేసుకుంది. తొలిసారిగా ఒలింపిక్ పోటీల్లో పాల్గొన్న ల‌వ్లీనా అస్సాం రాష్ట్రానికి చెందిన‌వారు. సెమీఫైన్‌లో గెలిస్తే ఫైన‌ల్‌కు వెళుతుంది. ఒక‌వేళ ఓట‌మిపాలైన కాంస్య ప‌త‌కం మాత్రం ఖాయ‌మ‌వుతుంది. దీన్నిబ‌ట్టి ఒలింపిక్స్ లో భార‌త్‌కు రెండోప‌త‌కం రావ‌డం ఖ‌రారైంది. యిట్ లిఫ్ట‌ర్ మీరాబాయి చాను ఇంత‌కుముందు ర‌జ‌త ప‌త‌కం గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. 23 సంవ‌త్స‌రాల ల‌వ్లీనా ఒలింపిక్స్ ఆడ‌టం తొలిసారి. క్వార్ట‌ర్స్ లో ప్ర‌త్య‌ర్థిగా నిలిచిన వ్య‌క్తి మాజీ ప్ర‌పంచ ఛాంపియ‌న్ అయిన‌ప్ప‌టికీ ఆమె ఏమాత్రం తొణ‌క‌లేదు.. బెద‌ర‌లేదు.

టోక్కో ఒలింపిక్స్ లో భార‌త్‌కు మ‌రో ప‌త‌కం ఖాయం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ప్రారంభించే ప్రతి ప‌థ‌కంలో ఒక స్కామ్ ఉందని తెలుగుదేశం పార్టీ నేత కూన రవికుమార్ ఆరోపించారు. పాఠ్య పుస్తకాలు ముద్రించాలంటూ పుణెకు చెందిన ఓ సంస్థ‌కు 100 కోట్ల రూపాయ‌ల కాంట్రాక్టు ఇచ్చార‌ని వెల్ల‌డించారు. ఉద్యోగులు, పింఛ‌నుదారులు ప్రతినెలా జీతాల కోసం, పింఛ‌న్ల కోసం ఎదురు చూపులు చూస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జగన్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న‌ట్లు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంద‌ని రవికుమార్ అన్నారు. ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ పేరు మార్చి విద్యా దీవెన అని పేరు పెట్టార‌ని, సాక్షి దిన‌ప‌త్రిక‌కు విడ‌త‌ల‌వారీగా కోట్ల‌ రూపాయల ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నార‌ని, జగన్ త్వరలో జగనన్న జీతం దీవెన కూడా పెట్ట‌బోతున్నారంటూ ఎక‌సెక్కాలాడారు. నాడు - నేడు పథకం కింద త‌మ ప్ర‌భుత్వం నిర్మించిన పాఠ‌శాల భ‌వ‌నాల‌కు రంగులు వేస్తున్న‌ర‌ని, పాఠ‌శాల‌లో ఏర్పాటుచేసే ప్ర‌తి ఫ్యాన్ రూ.600 కంటే ఎక్కువ‌కు కొంటున్నార‌న్నారు.

ఏపీ సీడ్స్ కు జాతీయ అవార్డు

భ‌ర్త అంటే భ‌ర్తే. ఆయ‌న‌తో తాళి క‌ట్టించుకొని ఏడ‌డ‌గులు న‌డిచిన త‌ర్వాత ఆయ‌న చూపిన బాట‌లోనే న‌డ‌వాలి. శిల్పాశెట్టి కూడా త‌న భ‌ర్త‌కు మ‌ద్ద‌తుగా పోరాటం చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. పోలీసుల‌మీదో.. లాయ‌ర్ల‌మీదో కాదు.. మీడియా మీద‌. అవును.. మీడియామీద పోరాటానికి శిల్ప సిద్ధ‌మ‌య్యారు. రాజ్‌కుంద్రా పోర్న్ వీడియోలు తీయిస్తున్నాడనే కార‌ణంతో అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. పోర్నోగ్ర‌ఫీకి సంబంధించి అత‌ను ఏం చేస్తున్నాడు? మోడ‌ల్స్ తో ఎలా మాట్లాడాడు? వారిని ఇటువైపు ఎలా ప్రేరేపించాడు? వ్యాపారం నిర్వ‌హించ‌డానికి అత‌నికి స‌హ‌క‌రించిందెవ‌రు? పోలీసుల దృష్టిలో రాజ్‌కుంద్రా ఎలా ప‌డ్డాడు? లాంటి విష‌యాపై మీడియాలో జోరుగా క‌థ‌నాలు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌నిలోప‌నిగా శిల్పాశెట్టిమీద కూడా ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపించాయి.

మీ అంతు చూస్తా ఆగండి..

అస‌లు హుజూరాబాద్ ఎన్నిక‌ను ఎవ‌రు తెచ్చుకోమ‌న్నారు? రాష్ట్రంలో ఎన్నిక‌ల‌న్నీ అయిపోయాయిగా.. అంతా ప్ర‌శాంతంగానే ఉందిగా.. అయినా ఎన్నిక కావ‌ల్సి వ‌చ్చిందా ఏమిటి? ఈటెల రాజేంద‌ర్ ఏమిచేశారో? ఏమి తెలియ‌దో మీకు తెలియ‌దా కేసీఆర్ సారూ.. ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం, వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిద్దామ‌నుకున్నారు. అంత‌వ‌ర‌కు బాగానేఉందికానీ ఆయ‌న కూడా మీతోటి స‌మ‌కాలీనుడేక‌దా.. మీరెన్ని వ్యూహాలు ఎంపిక చేయ‌గ‌ల‌రో.. మీరెలా రాజ‌కీయ చాణ‌క్యం న‌డ‌ప‌గ‌ల‌రో కొన్ని సంవ‌త్స‌రాల నుంచి ద‌గ్గ‌ర‌నుంచి చూసిన వ్య‌క్తి. అటువంటి వ్య‌క్తి మీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు.. మీరెటువంటి వ్యూహాలు ప‌న్నితే వాటిని తిప్పికొట్ట‌గ‌ల‌రు. అయినా కావాల‌ని కోరితెచ్చుకున్న ఉప ఎన్నిక కోసం ఇంత ఒత్తిడిని ఎదుర్కోవ‌డం అవ‌స‌ర‌మా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>