PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth2673961c-9f3b-42d4-9028-7746c351eda7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth2673961c-9f3b-42d4-9028-7746c351eda7-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? అక్కడ టీఆర్ఎస్‌ని ఓడించాలంటే రేవంత్ ఏం చేయాలి? అంటే ప్రస్తుతానికి హుజూరాబాద్‌లో రేవంత్ రెడ్డి అదిరిపోయే వ్యూహాలు ఏమి వేస్తున్నట్లు కనిపించడం లేదు. పైగా పీసీసీ పదవి వచ్చిన మొదట్లోనే హుజూరాబాద్ ఉపఎన్నిక తన సామర్ధ్యానికి పరీక్ష కాదని చెప్పేశారు. revanth{#}Minister;Telangana Rashtra Samithi TRS;Congress;TPCC;Revanth Reddy;revanthహుజూరాబాద్ వార్: ఈటలకు రేవంత్ చేస్తున్న హెల్ప్ ఏంటి?హుజూరాబాద్ వార్: ఈటలకు రేవంత్ చేస్తున్న హెల్ప్ ఏంటి?revanth{#}Minister;Telangana Rashtra Samithi TRS;Congress;TPCC;Revanth Reddy;revanthFri, 30 Jul 2021 01:00:00 GMTతెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? అక్కడ టీఆర్ఎస్‌ని ఓడించాలంటే రేవంత్ ఏం చేయాలి? అంటే ప్రస్తుతానికి హుజూరాబాద్‌లో రేవంత్ రెడ్డి అదిరిపోయే వ్యూహాలు ఏమి వేస్తున్నట్లు కనిపించడం లేదు. పైగా పీసీసీ పదవి వచ్చిన మొదట్లోనే హుజూరాబాద్ ఉపఎన్నిక తన సామర్ధ్యానికి పరీక్ష కాదని చెప్పేశారు.

అలాగే ఇప్పుడు హుజూరాబాద్‌లో గెలవడానికి కీలకమైన వ్యూహాలు వేస్తున్నట్లు కనిపించడం లేదు. అటు అభ్యర్ధి విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఒకవేళ అభ్యర్ధిని నిలబెట్టిన అక్కడ బలమైన నాయకుడు ఉండకపోవచ్చని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కావాల్సింది టీఆర్ఎస్ ఓడిపోవడమని, అదే సమయంలో ఇక్కడ కాంగ్రెస్‌కు గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి.

ఇలాంటి తరుణంలో పరోక్షంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు రేవంత్ సాయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ తరుపున బలమైన అభ్యర్ధిని పెట్టడం, నిత్యం నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటించి, అక్కడ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేయడం వల్ల కొంచెం కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు పడతాయి. అలా కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు రావడం వల్ల, టీఆర్ఎస్‌కు బెనిఫిట్ అవుతుందనే రేవంత్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు ఈటల, కాంగ్రెస్‌లు చీల్చుకోవాలి. ఈ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలి అది టీఆర్ఎస్‌కే లాభం జరుగుతుందని చెప్పొచ్చు. అలాంటప్పుడు ఇక్కడ కాంగ్రెస్ సైలెంట్ అయితే, ఈటలకు ప్లస్ అవుతుందని తెలుస్తోంది. అంటే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఎంత తక్కువ ఓట్లు తెచ్చుకుంటే అంతగా టీఆర్ఎస్ గెలుపుపై ప్రభావం పడుతుంది. అదే కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు చీలిస్తే ఈటలకు దెబ్బపడి, టీఆర్ఎస్‌కు ప్లస్ అవుతుంది. అందుకే రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ఉపఎన్నికని సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. మొత్తానికైతే రేవంత్ పరోక్షంగా ఈటలకు హెల్ప్ చేస్తున్నట్లే కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



రోజాకు షాక్ ఇవ్వబోతున్న నారాయణ..!

ఫ్యాక్ట్ ఫైండింగ్ : అక్రమ మైనింగ్ పై టీడీపీ యుద్ధం

ఆడు ఆడించు : ద‌ర్యాప్తు సంస్థ‌ల‌న్నీ బొమ్మ‌లేనా!

చిక్కుల్లో రేవంత్ ... కేసీఆర్ స్కెచ్

షాకింగ్ : చిరంజీవితో కలిసి ఢిల్లీకి రేవంత్ రెడ్డి?

సీఎం సమక్షంలో TRS లో చేరనున్న ఇనుగాల పెద్దిరెడ్డి

థియేటర్స్ రీఓపెన్... థియేటర్లో సందడికి 8 సినిమాలు రెడీ

బ్రేకింగ్: ఇక లాభం లేదని హైకోర్ట్ కి వెళ్ళిన ఉమా...?

హుజురాబాద్ లో కాంగ్రెస్ పుంజుకునేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>