SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/spirituality8845d3e7-a90a-4d20-bf5d-7f502a705efc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/spirituality8845d3e7-a90a-4d20-bf5d-7f502a705efc-415x250-IndiaHerald.jpgశుక్రవారం మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన రోజుగా చెప్పబడుతోంది. శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని మనస్ఫూర్తిగా నమ్మి భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఆ అమ్మ వారి ఆశీస్సులు తప్పకుండా మనపై ఉంటాయని విశ్వాసం. ఇక శుక్రవారం రోజున అమ్మ వారికి కనుక ఇలా పూజ చేస్తే ఇక అంతా శుభమే, అష్టైశ్వర్యాలు అన్నీ మన ఇంట్లో కొలువు తీరుతాయి అని శాస్త్రం చెబుతోంది. SPIRITUALITY{#}Turmeric;Lakshmi Devi;Cow slaughter;Srimahalakshmi;aishwarya;Friday;Pooja Hegdeలక్ష్మీ దేవికి ఈ పూజ చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం ?లక్ష్మీ దేవికి ఈ పూజ చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం ?SPIRITUALITY{#}Turmeric;Lakshmi Devi;Cow slaughter;Srimahalakshmi;aishwarya;Friday;Pooja HegdeFri, 30 Jul 2021 08:00:00 GMTశుక్రవారం మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన రోజుగా చెప్పబడుతోంది. శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని మనస్ఫూర్తిగా నమ్మి భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఆ అమ్మ వారి ఆశీస్సులు తప్పకుండా మనపై ఉంటాయని విశ్వాసం. ఇక శుక్రవారం రోజున అమ్మ వారికి కనుక ఇలా పూజ చేస్తే ఇక అంతా శుభమే, అష్టైశ్వర్యాలు అన్నీ మన ఇంట్లో కొలువు తీరుతాయి అని శాస్త్రం చెబుతోంది. ఇంతకీ శుక్రవారం నాడు చేయాల్సిన ఆ పూజా విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ పూజ పేరు ఐశ్వర్య దీపారాదన. 

ఇది తొమ్మిది లేదా  పదకొండు శుక్ర వారాలు ఒక వ్రతంలా చేయాలి. లేదా ప్రతి శుక్రవారం కూడా చేయొచ్చు అని పండితులు చెబుతున్నారు. ఇక పూజా విధానం విషయానికొస్తే.... పూజ గది శుభ్రపరిచి, అలంకరించుకొని ఒక కంచు ప్లేట్ తీసుకుని అందులో పసుపు రాసిన పెద్ద ప్రమిదను ఉంచాలి. ఆ ప్రమిదలో అమ్మ వారికి ఇష్టమైన కల్లు ఉప్పును వేసి దానిపై కాస్త పసుపు, కుంకుమ, అక్షింతలు వేయాలి అలా  సిద్ధం చేసిన ప్రమిదపై రెండు మట్టి కుందీలను పెట్టి, రెండు వత్తులు కలిపి ఒకే ఒత్తిగా  కలిపి ఆవు నూనెతో కాని, నువ్వుల నూనెతో కాని దీపారాధన చేయాలి. 

అలా చేశాక అమ్మ వారికి పూజ చేస్తూ మహాలక్ష్మి మంత్రాన్ని జపించాలి. పూజ అనంతరం అమ్మ వారికి పెట్టిన నైవేద్యాన్ని భక్తితో స్వీకరించి తమని ఆశీర్వదించమని వేడుకోవాలి. ఇలా చేయడం వలన శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉండి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ పూజను ఇదే విధంగా ప్రతి శుక్ర వారం చేయాలి. అంతే కానీ ఒక వారం చేసి మరో వారం చేయకపోతే, మీకు ఆ ఫలితం సిద్ధించదు. కావున ఎటువంటి పరిస్థితుల్లోనూ మరిచిపోకుండా 11 శుక్రవారాలు పూజ చేయండి.



ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... రేపు "రాధేశ్యామ్" అప్డేట్

ప్రభాస్ 'ఆదిపురుష్' లేటెస్ట్ అప్డేట్..!!

శంకర్ కి వేరే పనిలేదట.. అందుకే ఇలా!!

ప్రభాస్ క్రేజ్ కు సమంత అవసరమా..?

ధియేటర్ లో సినిమా చూడమని అడుక్కునే పరిస్థితి వచ్చిందా!

డ్యుయల్ రోల్ కాదు.. చిరు మల్టీ స్టారర్?

వామ్మో .... సంక్రాంతి బరిలో మహేష్, పవన్, ప్రభాస్ .... నిజమే ... ??

'ఆచార్య' - 'అఖండ' బాక్సాఫీస్ వార్ షురూ ..... ??

బెల్లం కొండ కాన్ఫిడెన్స్ లెవెల్ ఈ రేంజ్ లో ఉందేంటి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>