SignaturesPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/road-in-hill8bed431c-0e28-4aec-b919-ff41d4c93e4f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/road-in-hill8bed431c-0e28-4aec-b919-ff41d4c93e4f-415x250-IndiaHerald.jpgచ‌రిత్ర‌కు సాక్ష్యాలుగా కొండ గుహ‌లు, కోట‌లు ఎక్కువ‌గా మ‌న‌కు క‌న‌బ‌డుతాయి. ఎలాంటి టెక్నాల‌జీ లేని స‌మ‌యంలో కూడా కొండ‌ల‌పై కోట‌లు నిర్మించిన తీరు అత్యద్భుతంగా క‌నిపిస్తుంది. వాటిని చూసి ఎలా నిర్మించారా అని ఆశ్చ‌ర్య‌పోతాం. కానీ ప్ర‌స్తుతం ప్ర‌పంచానికి దూరంగా ఉంటున్న ఓ గ్రామం వాళ్లు ఏవైనా నిత్యావ‌స‌ర వ‌స్తువులు కావాల‌నుకుంటే కొండ ఎక్కిదిగాల్సి అటువైపుగా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో అక్క‌డ ఉన్న యువ‌కులు కేవలం ఉలి, సుత్తి సాయంతో 1.2 కిలోమీటర్ల మేర కొండలో సొరంగ మార్గం త‌వ్వారు. దీంతో ఈ కొండ‌లో ఉన్న దారి road in hill{#}Government;villageకొండనే దారిగా మ‌లిచి.. గ్రామం కోసం సాహసం..!కొండనే దారిగా మ‌లిచి.. గ్రామం కోసం సాహసం..!road in hill{#}Government;villageFri, 30 Jul 2021 07:20:00 GMT
     చైనాలోని తైహాంగ్‌ పర్వత ప్రాంతంలో ఉన్న కొండపై ఉన్న చిన్న గ్రామం గావులియంగ్‌. సముద్రమట్టానికి 1,700 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడి ప్రజలు నిత్యావసర వస్తువులు ఏవైనా తెచ్చుకోవాలంటే కొండకు వేలాడదీసిన పురాతనమైన 720 మెట్ల నిచ్చెనను ఎక్కి దిగాల్సిందే. గ్రామంలో ఎవరైనా అస్వస్థతకు గురైతే.. ఎనిమిది మంది సాయంతో వారిని కిందకి దించాలి. పండించిన పంట‌ల‌ను అవ‌త‌లి వైపు తీసుకెళ్లాల‌న్న చాలా క‌ష్టంగా ఉండేది. ఇలాంటి దుర్భ‌ర ప‌రిస్థితుల‌నే మూడు ద‌శ‌బ్ధాల క్రితం వ‌ర‌కు ఈ గావులియంగ్ గ్రామ‌స్తులు ఎదుర్కొన్నారు. అయితే, 1972లో గ్రామంలోని 13 మంది తీసుకున్న నిర్ణయం గ్రామ‌స్వ‌రూపంతో పాటు, ప్ర‌జ‌ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.
 
   కొండపై రోడ్డు కనిపించిన త‌రువాత‌ అక్కడో గ్రామం ఉందన్న విషయం అప్పుడే ప్రపంచానికి  తెలిసింది.  కొండ అంచుల్లో సొరంగ మార్గంలో సాహస ప్రయాణం చేయడానికి ఆస‌క్తిచూపే వారు ఈ కొండ గ్రామానికి వ‌రుస‌ కట్టారు. అలా క్ర‌మంగా ఈ గ్రామం సందర్శక ప్రాంతంగా మారిపోయింది. దీంతో గ్రామానికి పంటల ద్వారానే కాకుండా.. పర్యటకంగానూ ఆదాయం వ‌స్తోంది.

     గ్రామం నుంచి సమీప నగరానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని ఆ గ్రామ‌ ప్రజలు ప్రభుత్వానికి ఎంత విజ్ఞప్తి చేసినా అక్కడి గవర్నమెంట్ పట్టించుకోకపోవడంతో ఫలితం మాత్రం లేదు. దీంతో ఊరిలోని 13 మంది యువకులు స్వయంగా తామే కొండలో సొరంగ మార్గం నిర్మించాలని 1972లో నిర్ణయించుకున్నారు.  ఆర్థిక స్థోమత లేకపోవడంతో టెక్నాల‌జీని ఉప‌యోగించ‌లేక ఉలి, సుత్తితో కొండ అంచులో సొరంగం త‌వ్వడం మొదలుపెట్టారు. ఎంత శ్రమించినా మూడు నెల‌ల్లో ఒక మీటరు సొరంగాన్ని మాత్ర‌మే త‌వ్వ‌గ‌లిగారు. అయినా, వారు వెనకడుగు వేయకుండా  మరింత కసిగా పనిచేయడం ప్రారంభించారు. దీంతో వారి ప‌ట్టుద‌ల‌ను చూసి గ్రామంలోని మరికొందరు సాయంగా చేశారు. ఇలా ఐదేళ్లు శ్రమించి కొండపై నుంచి కిందకి 1.2 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని తవ్వి రోడ్డును నిర్మించారు.





టీఎస్ : గురుకులాల్లో 50శాతం సీట్లు వారికే.. !

టిడ్కో ఇళ్లపై వైసీపీ మరో సెల్ఫ్ గోల్..

తల్లిదండ్రుల వల్లే రేపులు జరుగుతున్నాయన్న సీఎం

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు అవే మైనస్...

అచ్చెన్నకు తిప్పలు తెచ్చిపెట్టిన గొప్పలు...బుక్ అయిపోయారుగా!

నిర్లక్ష్యమా.. అయితే మూల్యం తప్పదు?

అప్పుడు జగన్ చేసారు.. ఇప్పుడు యోగి చేస్తున్నారు : విజయసాయి

బిజినెస్: మోడీ ప్రభుత్వం ప్రకటించిన అదిరిపోయే ఆఫర్.. రూ.5 లక్షలు మీ సొంతం..

పులుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు : జగన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>