MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sonu-sooda7758e97-6baa-478b-ad61-a95e1701fa39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sonu-sooda7758e97-6baa-478b-ad61-a95e1701fa39-415x250-IndiaHerald.jpgసోను సూద్ ఒకప్పుడు ఈ పేరు వింటే ఏమి అనిపించేది, ఒక నటుడు, విలన్ అందులోనూ తెలుగు, హిందీ, తమిళ్ ఇలా కొన్ని భాషలకు మాత్రమే ఈ పేరు సుపరిచితం. కానీ కరోనా కష్ట కాలంలో దేశమంతా ఎక్కడ విన్నా ప్రజల నోట ఈ పేరే. ఒకరకంగా చెప్పాలంటే కరోనా కంటే ఫేమస్ అయ్యారు సోనూ సూద్. ఇంత గొప్ప ఖ్యాతి గడించిన వ్యక్తి అయినప్పటికీ ఇప్పటికీ అంతే సింపుల్ గా ఉంటూ సాధారణంగా జీవిస్తున్నారు. SONU SOOD{#}Kanna Lakshminarayana;Service;bhavana;Tamil;Coronavirusసోనూ సూద్ ఆశయమే ప్రజల్లో దేవుడ్ని చేసింది...సోనూ సూద్ ఆశయమే ప్రజల్లో దేవుడ్ని చేసింది...SONU SOOD{#}Kanna Lakshminarayana;Service;bhavana;Tamil;CoronavirusFri, 30 Jul 2021 09:00:00 GMTసోను సూద్ ఒకప్పుడు ఈ పేరు వింటే ఏమి అనిపించేది, ఒక నటుడు, విలన్ అందులోనూ తెలుగు, హిందీ, తమిళ్ ఇలా కొన్ని భాషలకు మాత్రమే ఈ పేరు సుపరిచితం. కానీ కరోనా కష్ట కాలంలో దేశమంతా ఎక్కడ విన్నా ప్రజల నోట ఈ పేరే. ఒకరకంగా చెప్పాలంటే కరోనా కంటే ఫేమస్ అయ్యారు సోనూ సూద్. ఇంత గొప్ప ఖ్యాతి గడించిన వ్యక్తి అయినప్పటికీ ఇప్పటికీ అంతే సింపుల్ గా ఉంటూ సాధారణంగా జీవిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా సొంత ఊళ్లకు చేరుకోవడానికి వలస కూలీలు మొదలు పెట్టిన కాలినడక ప్రయాణం ఈయన్ని కదిలించింది, మార్గ మధ్యంలో కూలీల మరణం ఈయన్ని కలచివేసింది. ఎవరో వస్తారు ఎదో చేస్తారు అని ఆలోచిస్తూ ఇలాంటి దారుణాలు చూడటం కన్నా నాకు ఎంత వీలవుతుందో అంత చేసి కొంతమందికైనా ఉపయోగపడాలని వారిని రక్షించి అండగా నిలవాలని సంకల్పించారు. 

కానీ వలస కూలీల కోసం అనుకున్న దానికంటే ఎక్కువగానే సహాయ సహకారాలు అందించారు. వారిని తన సొంత ఖర్చులతో వారి ఊళ్లకు చేర్చారు. మనిషి ఆశా వాది అన్నది నిజమే...ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. అదే విధంగా సోనూ సూద్ కూడా ఆశా వాదే...తను చేసిన సహాయం తనకు సంతృప్తిని కలిగించలేదు ఇంకా ఎన్నో వేలమంది, కాదు లక్షలమంది తన సహాయం కోసం ఎదురు చూస్తున్నారేమో అన్న భావన మొదలయ్యింది. అందరికీ సహాయం చేయాలన్న ఆశ రోజు రోజుకీ పెరుగుతోంది. అలా ఒక్కో సహాయం ఎన్నో కుటుంబాలకు జీవితాన్ని అందించింది. ఎంత సాయం చేసినా ఆయన తనివి తీరలేదు. నిజానికి ఆయన సంకల్పం చాలా దృఢమైనది అందుకే ఆస్తులు కరుగుతున్నా కంగరుపడలేదు భవిష్యత్తు గురించి భయపడలేదు. మానవసేవయే మాధవ సేవ అని భావించారు.

మన తోటి వారికి సాయం చేస్తే ఆ చేతులకు సాయం  ఆ దేవుని సాయం అందుతుందని భావించి అనుకున్న మార్గంలోనే ప్రయాణిస్తూ వేల మందికి డబ్బు , జీవనాధారం కోసం ట్రాక్టర్లు, ఉపాధి, మందులు ఇలా ఒకటేమిటి. నోరు తెరిచి అన్న నాకు ఈ సాయం కావాలి అని అడిగినవారికి, ఆపదలో ఉన్నవారికి ఇలా ఎందరికో అండగా నిలబడి చేయూతనిచ్చాడు. కలియుగ దేవుడిలా మారి కరోనాపై జీవన పోరాటంలో ప్రజలకు అండగా నిలిచాడు. ప్రభుత్వానికి మించి పనిచేశాడు, తన సాయన్ని దేశ నలుమూలలకు విస్తరించి సహాయ సహకారాలు అందించాడు. ఇప్పుడు ప్రజలందరి మనసులో దేవుడిలా నిలిచిపోయాడు. ఇంకా మరెన్నో సేవలను అందిస్తూ ఒక చిన్న ప్రభుత్వాన్నే నడుపుతున్నాడు.



నేను ఏ పార్టీలో లేను..ఇదే నా పార్టీ : జేడీ

పెగాసస్ తో ప్రజా సమస్యలు పక్కదారి పడుతున్నాయా..?

వైసీపీ ఎంపికి తీవ్ర అస్వస్థత.. !

టిడ్కో ఇళ్లపై వైసీపీ మరో సెల్ఫ్ గోల్..

సొంతింటికొచ్చిన కరోనా.. చైనాలో విజృంభణ..?

హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు భారీ షాక్.. !

డెల్టా వేరియంట్‌ చైనాలోకి అడుగు పెట్టింది. చైనాలో దీని ప్రభావంతో రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగుతున్నాయట. దీంతో ఇప్పుడు చైనా మరోసారి వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. భారీగా కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు చేయిస్తోంది.

సోనూసూద్ కు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా.

మోదీ గేమ్ ప్లాన్ అదుర్స్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>