PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tpcc013493a0-28ca-4c87-8334-6b35320f9cde-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tpcc013493a0-28ca-4c87-8334-6b35320f9cde-415x250-IndiaHerald.jpgష‌ర్మిలక్క కూడా రేవంత్ ను టార్గెట్ చేయ‌లేదు కానీ కాంగ్రెస్ హై క‌మాండ్ ను మాత్రం నాలుగు మాట‌లు అన్నారు. ఔను! కాంగ్రెస్ బ‌తికింది బ‌లం తెచ్చుకుంది బూస్టు తాగింది కూడా వైఎస్ వ‌ల్లే దీనిని ఎవ్వ‌రూ కాద‌న‌రు కానీ ఓ వ‌ర్గం మాత్రం రెడ్డి ఓట్లలో చీలిక లో భాగంగానే కొత్త పార్టీ వ‌చ్చింద‌ని అంటున్నారు.tpcc{#}Revanth Reddy;MLA;MP;Reddy;Bharatiya Janata Party;Minister;Telangana Rashtra Samithi TRS;revanth;Party;Congress;KCRరెడ్డి వెర్స‌స్ రెడ్డి ఇలానే కొట్టుకోండి! ఆల్ ద బెస్ట్రెడ్డి వెర్స‌స్ రెడ్డి ఇలానే కొట్టుకోండి! ఆల్ ద బెస్ట్tpcc{#}Revanth Reddy;MLA;MP;Reddy;Bharatiya Janata Party;Minister;Telangana Rashtra Samithi TRS;revanth;Party;Congress;KCRFri, 30 Jul 2021 16:38:39 GMTరెడ్డి వెర్స‌స్ రెడ్డి ఇలానే కొట్టుకోండి! ఆల్ ద బెస్ట్

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక అనూహ్యంగానో ఊహ‌కు అనుసారంగానే ష‌ర్మిల పార్టీ ఎనౌన్స్ చేశారు. అయితే త‌న‌కెందుకులే అనుకున్నారో ఏమో కానీ రేవంత్ ష‌ర్మిల పార్టీపై కామెంట్స్ పెద్ద‌గా పాస్ చేయ‌లే. ఆ విధంగా ఆయ‌న హుందాత‌నం పాటించారు.ష‌ర్మిలక్క కూడా రేవంత్ ను టార్గెట్ చేయ‌లేదు కానీ కాంగ్రెస్ హై క‌మాండ్ ను మాత్రం నాలుగు మాట‌లు అన్నారు. ఔను! కాంగ్రెస్ బ‌తికింది బ‌లం తెచ్చుకుంది బూస్టు తాగింది కూడా వైఎస్ వ‌ల్లే దీనిని ఎవ్వ‌రూ కాద‌న‌రు కానీ ఓ వ‌ర్గం మాత్రం రెడ్డి ఓట్లలో చీలిక లో భాగంగానే కొత్త పార్టీ వ‌చ్చింద‌ని అంటున్నారు.

కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు గా నిలిచే ఓట్లు కొన్ని బీఎస్పీ ఎత్తుకు పోతే, మ‌రికొన్ని ష‌ర్మిల క్క ఎత్తుకుపోతే ఒంట‌రి అయ్యేది రేవంతే అని తేల్చేస్తున్నారు. సామాజిక వ‌ర్గ స‌మీ క‌ర‌ణాల్లో భాగంగా ఎంతో కొంత ప్రాధాన్యం ఉన్న క‌మ్మ  ప్ర‌తినిధులంతా టీఆర్ఎస్ లోనే ఉ న్నారు క‌నుక  ఆ ఓట్లూ గులాబీ బాస్ కే పోతాయి. ఇక కాంగ్రెస్ సాధించేది ఏ ముంద‌ని? మ‌రో వైపు రేవంత్ కు వ్య‌తిరేకంగా కోమ టి రెడ్డి సోద‌రులు కోపం వ్య‌క్తం చేస్తూ, ముఠా రాజ‌కీయాలు న‌డుపుతున్నారు. రేవంత్ క‌న్నా దూకుడుగా ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి మొన్న మంత్రి పై క‌స్సు మ‌న్నారు.

అంతేకాకుండా ఆ ఇంటి ఎంపీ కూడా క‌స్సుబుస్సులు ఆడుతున్నారు. ఇలాంటి త‌రుణంలో రెడ్డి సామాజిక‌వ‌ర్గం ఓట్లు చీలిపోవ‌డం త‌ప్ప లాభించేది ఏమీ ఉండ‌దు. ఎలానూ దళిత బంధు తెస్తున్నారు క‌నుక కాస్త‌యిన సింప‌తీ కేసీఆర్ పైనే ఉంటుంది. పోనీ ఇది ఎన్నిక‌ల నాట‌కం అనుకుంటే ఓట్లు సిన్సియ‌ర్ ఆఫీస‌రుగా పేరున్న ప్ర‌వీణ్ కు ప‌డ్తా యి.. ఆయ‌న  చెప్పిన అభ్య‌ర్థికి ప‌డ్తాయి. కానీ కాంగిరేసుకు ప‌డ‌వు. ద‌ళిత బంధును రేవంత్ బాహాటంగా వ్య‌తిరేకించ‌లేరు. అలా అని ఇది మంచి ప‌థ‌కం అని మ‌ద్ద‌తు ప‌ల‌క‌నూ లేరు. ఇదే విధంగా రాష్ట్రంలో అన్ని పార్టీలూ ఉన్నాయి. ఇప్పుడు కోమ‌టి రెడ్డి సోద‌రుల‌ను అధిష్టానం అదుపు చేయ‌దు.. రేవంత్ తో స‌స్పెన్ష‌న్ నాట‌కం ఆడిస్తుంది. దాంతో వాళ్లు వెళ్లి బీజేపీలో చేరి త‌ప్పంతా రేవంత్ దే అన్న మాట ఒక‌టి త‌ప్ప‌క వినిపిస్తారు. అప్పుడు కూడా ఒంట‌రి అయ్యేది రేవంతే! ఒక‌వేళ కోమ‌టి రెడ్డి సోద‌రుల రాక‌తో బీజేపీ బ‌ల‌ప‌డితే ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో కాస్తో కూస్తో సీట్లు తెచ్చుకుంటే అప్పుడు  కోమ‌టి రెడ్డి సోద‌రులు కేంద్రంలోనూ చ‌క్రం తిప్ప‌గ‌ల‌రు. కానీ రేవంత్ కు ఆ ఛాన్స్ ఉండదు.రేవంత్ ఈ విష‌య‌మై మ‌రో మారు ఆలోచ‌న చేసుకుని ముందుగానే కోమ‌టి రెడ్డి సోద‌రుల దూకుడును ఆప‌గ‌ల‌గాలి అని ఆయ‌న అభిమానులు చెబుతున్నారు. వాస్త‌వానికి తెలంగాణ‌లో కాంగిరేసు పుంజుకుంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించింది రేవంత్ క‌నుక ఇలాంటి శ‌క్తుల ఆట‌లకు అడ్డం ప‌డాల్సింది అధిష్టాన‌మే! కానీ విభ‌జించు పాలించు సూత్రాన్ని పార్టీలు ముఖ్యంగా కాంగిరేసు లాంటి పార్టీలు పాటిస్తాయి క‌నుక రేవంత్ లాంటి నాయ‌కులు వీరి  ఆట‌లో పావు కాకూడ‌దు అన్న‌ది ప‌రిశీల‌కుల మాట.






సీబీఐ మెడ‌లో గంట క‌ట్టేదెవ‌రు?

వివాదాల్లో శానంపూడి సైదిరెడ్డి, సాధువుతో పూజలు

ర‌ఘు రామ తో వైసీపీ టాక్స్ నిజ‌మేనా!

మ‌హిళ చేతిని తొక్కుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే అంబ‌టి?

బ‌చ్చా లీడర్ల మాట కూడా రేవంత్ వింటాడా!

రాజ్ కుంద్రా 3,000 కోట్లు నొక్కేసాడు : బీజేపీ నేత

సుధీర్ బాబుకి శ్రీదేవి దొరికింది..!

తెలంగాణ‌ నేత‌న్న‌ల‌కు గుడ్ న్యూస్... !

ఎంపీ క‌విత‌కు హైకోర్ట్ లో ఊర‌ట‌.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>