MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/annamayya376de5c5-c199-4fb5-a5c3-e340e0cfe1ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/annamayya376de5c5-c199-4fb5-a5c3-e340e0cfe1ab-415x250-IndiaHerald.jpgఇక రాఘవేంద్రరావు నాగార్జునను అన్నమయ్య గా చిత్రీకరించిన తీరు అత్యద్భుతం. రమ్యకృష్ణ - కస్తూరి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా ఈ సంవత్సరం పాటు ఆడి తెలుగు ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. ఆ తర్వాత ఎన్ని భక్తిరస చిత్రాలు వచ్చినా వాటికి ప్రేరణ మాత్రం అన్న‌మ‌య్యే అని చెప్పాలి. అయితే వాస్తవంగా ఈ సినిమాను ముందు జంధ్యాల - బాపు లాంటి దర్శకులు తెరకెక్కించాలని అనుకున్నారట. జంధ్యాల అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని పాటలను కూడా రికార్డు చేసి షూటింగ్ ను ప్రారంభించాలని అనుకున్నారట.Annamayya{#}ramya krishnan;Tirupati;Annamayya;Jandhyala Ravishankar;Bapu;Annayya;Mohandas Karamchand Gandhi;Audi;kasthuri;Akkineni Nagarjuna;Rajamouli;Tollywood;Director;Cinema;Teluguఅన్న‌మ‌య్య లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ చేసుకున్న టాప్ డైరెక్ట‌ర్ ?అన్న‌మ‌య్య లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ చేసుకున్న టాప్ డైరెక్ట‌ర్ ?Annamayya{#}ramya krishnan;Tirupati;Annamayya;Jandhyala Ravishankar;Bapu;Annayya;Mohandas Karamchand Gandhi;Audi;kasthuri;Akkineni Nagarjuna;Rajamouli;Tollywood;Director;Cinema;TeluguFri, 30 Jul 2021 11:40:00 GMTటాలీవుడ్ లో సీనియర్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు ఎన్ని సంచలనాలు క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 110 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన దర్శకేంద్రుడు గా తెలుగు సినిమా పై తనదైన ముద్ర వేశారు. పైగా ఆయన శిష్యుడు రాజమౌళి దర్శకధీరుడు గా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతున్నారు. ఇదిలా ఉంటే కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాఘవేంద్రరావు భక్తిర‌స‌ చిత్రాలతో కూడా ప్రేక్షకులను రంజింప చేశారు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తో అన్నమయ్య - శ్రీరామదాసు వంటి సూపర్ హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు. ఇక బాల‌కృష్ణ‌తో పాండురంగ‌డు సినిమా ను కూడా తీశారు.

ఇక రాఘవేంద్రరావు నాగార్జునను అన్నమయ్య గా చిత్రీకరించిన తీరు అత్యద్భుతం. రమ్యకృష్ణ  - కస్తూరి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా ఈ సంవత్సరం పాటు ఆడి తెలుగు ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. ఆ తర్వాత ఎన్ని భక్తిరస చిత్రాలు వచ్చినా వాటికి ప్రేరణ మాత్రం అన్న‌మ‌య్యే అని చెప్పాలి. అయితే వాస్తవంగా ఈ సినిమాను ముందు జంధ్యాల - బాపు లాంటి దర్శకులు తెరకెక్కించాలని అనుకున్నారట. జంధ్యాల అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని పాటలను కూడా రికార్డు చేసి షూటింగ్ ను ప్రారంభించాలని అనుకున్నారట.

అయితే అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. చివరకు జె.కె.భారవి ఇచ్చిన కథ ఆధారంగా రాఘవేంద్రరావు దొరస్వామిరాజు నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కించారు. అన్న‌మ‌య్య ఇటు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంతో పాటు అటు క‌మ‌ర్షియ‌ల్ హిట్ కూడా కొట్టింది. ఈ సినిమాలో పాట‌లు ఎప్పుడూ విన్నా కొత్త‌గానే ఉంటాయి. ఆ తిరుమల వెంకన్న స్వామియే స్వ‌యంగా తనతో అన్నయ్య సినిమా చేయించుకున్నారని రాఘవేంద్రరావు పలు సందర్భాల్లో గొప్పగా చెప్పుకున్నారు. ఇలా జంధ్యాల తీయాల్సిన అన్న‌మ‌య్య కాస్తా రాఘ‌వేంద్ర‌రావు చేతిలో ప‌డి హిట్ అయ్యింది.



సూపర్ స్టార్ మహేష్ ఫస్ట్ మూవీ 'రాజకుమారుడు' 21 ఏళ్ళ సక్సెస్ఫుల్ జర్నీ ..... !!

ప్రజల కోసం సోనుసూద్‌ ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశాడో తెలుసా ?

సినిమాలలో నటించడం పై స్పందించిన బిగ్ బి మనవరాలు..!

అన్న‌మ‌య్య సినిమా తీయాల‌ని సాంగ్స్ రికార్డు చేసుకున్నాక కూడా వ‌దిలేసిన జంధ్యాల ?

అన్న‌మ‌య్య చేస్తే రొమాంటిక్ ఇమేజ్ పోతుంద‌ని నాగార్జున‌కు వార్నింగ్ ఇచ్చిన కృష్ణ‌వంశీ ?

అన్న‌మ‌య్య సినిమా చేయ‌వ‌ద్ద‌ని నాగార్జున‌కు ఆ ద‌ర్శ‌కుడి వార్నింగ్ ?

రాజ్ కుండ్రాతో సహా జైలు పాలైన సెలబ్రిటీలు వీళ్ళే 11am

సత్యదేవ్ అనుకున్నది సాధించాడు గా!!

నా బాధ వినండి ప్లీజ్‌ : మంత్రి కేటీఆర్‌ యాంకర్‌ రష్మి ట్వీట్‌ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>