PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/vangaveeti-chandra-babu8e5e2527-be2d-45a4-8e2e-b91f0b40a60a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/vangaveeti-chandra-babu8e5e2527-be2d-45a4-8e2e-b91f0b40a60a-415x250-IndiaHerald.jpgఇలాంటి వారిలో విజ‌య‌వాడ‌కు చెందినే వంగ‌వీటి రాధా పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఆయ‌న 2019 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు వైసీపీలో ఉన్నారు (గ‌తంలో ఎన్ని పార్టీలు మారార‌నేది ప‌క్క‌న పెడితే). అయితే.. ఆ ఎన్నిక‌ల్లో తాను కోరుకున్న టికెట్ ఇవ్వ‌లేద‌ని.. టీడీపీలోకి జంప్ చేశారు. అయితే.. ఇక్క‌డా ఛాన్స్ లేక‌పోయినా.. చంద్ర‌బాబు మ‌ళ్లీ సీఎం కావాలంటూ.. త‌ల్లి.. ర‌త్న‌కుమారితో క‌లిసి పెద్ద యాగ‌మే చేశారు. అదే స‌మ‌యంలో రాష్ట్రం మొత్తం ప‌ర్య‌టించి.. జ‌గ‌న్ సీఎం కాకుండా అడ్డుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. అయితే అప్ప‌ట్లో ఏ టీVangaveeti Chandra Babu{#}Bonda Umamaheswara Rao;Yuva;CBN;Hanu Raghavapudi;Father;Cycle;CM;YCP;TDP;Partyబాబుకు ఊహించ‌ని షాక్ ఇచ్చేందుకు వంగ‌వీటి రెడీ ?బాబుకు ఊహించ‌ని షాక్ ఇచ్చేందుకు వంగ‌వీటి రెడీ ?Vangaveeti Chandra Babu{#}Bonda Umamaheswara Rao;Yuva;CBN;Hanu Raghavapudi;Father;Cycle;CM;YCP;TDP;PartyFri, 30 Jul 2021 09:30:00 GMTటీడీపీ అధినేత చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న వైఖ‌రితో చాలా మంది యువ‌నేత‌లు డైల‌మాలో ప‌డిపోయారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. చాలా మందిని పార్టీలోకి ఆహ్వానించిన చంద్ర‌బాబు కొంద‌రికి టికెట్లు ఇవ్వ‌లేక‌పోయారు. అయితే..పార్టీ అధికారంలోకి రాగానే నామినేటెడ్ ప‌ద‌వులు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. దీంతో వైసీపీని వీడి చాలా మంది యువ నేత‌లు.. టీడీపీ బాట‌ప‌ట్టారు. అయితే.. పార్టీ అనుకున్న విధంగా అధికారంలోకి రాలేదు.  ఇక‌, గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో కొత్త‌వారి (అంటే.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు సైకిల్ ఎక్కిన వారు)ని ప‌ట్టించుకునే తీరిక చంద్ర‌బాబుకు లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలో యువ నాయ‌కులు.. గ‌డిచిన రెండేళ్లుగా పార్టీలో వెయిట్ చేసినా.. ఇంకా బాబు త‌మ‌ను గుర్తించ‌క‌పోవ‌డం.. ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డంతో ఉందామా ?  పోదామా? అనే డైల‌మాలో ప‌డ్డారు.

ఇలాంటి వారిలో విజ‌య‌వాడ‌కు చెందినే వంగ‌వీటి రాధా పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఆయ‌న 2019 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు వైసీపీలో ఉన్నారు (గ‌తంలో ఎన్ని పార్టీలు మారార‌నేది ప‌క్క‌న పెడితే). అయితే.. ఆ ఎన్నిక‌ల్లో తాను కోరుకున్న టికెట్ ఇవ్వ‌లేద‌ని.. టీడీపీలోకి జంప్ చేశారు. అయితే.. ఇక్క‌డా ఛాన్స్ లేక‌పోయినా.. చంద్ర‌బాబు మ‌ళ్లీ సీఎం కావాలంటూ.. త‌ల్లి.. ర‌త్న‌కుమారితో క‌లిసి పెద్ద యాగ‌మే చేశారు. అదే స‌మ‌యంలో రాష్ట్రం మొత్తం ప‌ర్య‌టించి.. జ‌గ‌న్ సీఎం కాకుండా అడ్డుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. అయితే అప్ప‌ట్లో ఏ టీడీపీ అయితే రాధా తండ్రి రంగాను హ‌త్య చేసిందో అదే టీడీపీ చెంత ఆయ‌న చేరతారా ? అన్న విమ‌ర్శ‌లు కూడా వైసీపీ నుంచి వ‌చ్చాయి.

అప్ప‌టి వ‌ర‌కు బాగానే ఉంది. త‌ర్వాత వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. కానీ, ఎన్నిక‌ల స‌మ‌యంలో కొద్దికాల‌మే అయిన‌ప్ప‌టికీ.. టీడీపీకి ద‌న్నుగా ఉన్న రాధా విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు దృష్టి పెట్ట‌డం లేద‌నే టాక్ మాత్రం వినిపిస్తోంది. అంతేకాదు .. అనేక మందికి ప‌ద‌వులు ఇచ్చినా.. రాధాను మాత్రం ఆయ‌న ప‌ట్టించుకోలేదు.అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ మ‌ద్ద‌తు ఇచ్చిన ప్ర‌తి కార్య‌క్ర‌మానికి ఏడాది కింద‌టి వ‌ర‌కు రాధా హాజ‌ర‌య్యారు. రాజ‌ధాని ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా నిలిచారు. ప‌లుమార్లు.. చంద్ర‌బాబు చెప్ప‌క‌పోయినా.. వెళ్లి.. రైతుల‌కు భ‌రోసా ఇచ్చారు.

ఇవ‌న్నీ గ‌మ‌నించినా బాబు ఎందుకో రాధాను ప‌క్క‌న పెడుతోన్న ప‌రిస్థితే ఉంది. ఇక‌, ఇప్ప‌ట్లో ఆయ‌న‌ను ప‌ట్టించుకునే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. పైగా బెజ‌వాడ‌లో రాధా ఇష్ట‌ప‌డే బెజ‌వాడ సెంట్ర‌ల్ సీటు నుంచి టీడీపీ సీనియ‌ర్ నేత బొండా ఉమా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఉందామా?  పోదామా? అనే చ‌ర్చ వంగ‌వీటి గూటిలో ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. మ‌రి.. కీల‌క నేత‌ను పోగుట్టుకుంటారా?  లేక‌.. చంద్ర‌బాబు ఏదైనా రాష్ట్ర‌స్థాయి ప‌ద‌వి ఇచ్చి.. రాధాను ఆయ‌న మ‌న‌సు మార‌కుండా ఉంటారా ? అన్న‌ది చూడాలి.





టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు వంగ‌వీటి రెడీ ?

మొబైల్ మాట్లాడుతూ బండి నడపడం నేరం కాదటా..! ఎలా..?

జాకీలు, క్రెయిన్‌లతో చంద్రబాబును, టీడీపీని పైకి లేపాలనుకున్నా.. అది సాధ్యం కాదని మంత్రి బొత్స అంటున్నారు. జగన్ ఏకంగా కొత్త ఇళ్లతో గ్రామాలనే సృష్టిస్తున్నాడని బొత్స చెబుతున్నారు.

ఎంత జాకీలేసి లేపినా.. ఇక టీడీపీ లేవదా..?

జ‌గన్ అంద‌లం ఎక్కించిన నేత‌కు సొంత పార్టీ నేత‌ల పొగ ?

స్టార్స్ కోసం కూడా చేయని 5 పనులు సోనూసూద్ కోసం... అభిమానం అంతే !!

కాంగ్రెస్ కు వారే మైన‌స్సా..? పార్టీ ప‌డ‌వ మునిగిపోయేందుకు..

వైసీపీ ఎంపికి తీవ్ర అస్వస్థత.. !

ఆ పాట నిద్రపోనివ్వడం లేదు..అనుష్క శర్మ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>