PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vyabichara95dbf467-fdbd-4c61-bce7-f2c422401413-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vyabichara95dbf467-fdbd-4c61-bce7-f2c422401413-415x250-IndiaHerald.jpgఎవ‌రూ కూడా కావాల‌ని వేశ్య‌గా మారాల‌ని కోరుకోరు. ఒక‌రి కింద న‌లిగిపోవాల‌ని..గాయ‌ప‌రిచినా దాడి చేసినా బ‌రించాల‌ని అనుకోరు. లోక‌మంతా త‌మ‌కు అదోర‌కంగా చూస్తుంటే భ‌రించాల‌ని...ఎన్ని మాట‌లు అన్నా స‌హించాల‌ని కోరుకోరు. కానీ వారి కుంటుబ ప‌రిస్థితులు ఆర్థిక స్థితిగ‌తులే ఆ పాడు వృత్తిలోకి నెడ‌తాయి. దాంతో జీవితాంతం అదే వృత్తిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ అవ‌మానాల‌ను భ‌రిస్తూ గ‌డుపుతుంటారు. కాగా తాజాగా సెక్స్ వర్కర్లు మరియు అక్రమ రవాణా బాధితుల రాష్ట్ర సమైక్య విముక్తి మరియు హెల్ప్ సంస్థ త‌మ‌ను ప్ర‌భుత్వం ఆదుsex workers{#}Patti;Sexసెక్స్ వ‌ర్క‌ర్ల‌ను ప్ర‌భుత్వ‌మే ఆదుకోవాలి.. !సెక్స్ వ‌ర్క‌ర్ల‌ను ప్ర‌భుత్వ‌మే ఆదుకోవాలి.. !sex workers{#}Patti;SexFri, 30 Jul 2021 14:31:26 GMTఎవ‌రూ కూడా కావాల‌ని వేశ్య‌గా మారాల‌ని కోరుకోరు. ఒక‌రి కింద న‌లిగిపోవాల‌ని.. గాయ‌ప‌రిచినా దాడి చేసినా బ‌రించాల‌ని అనుకోరు. లోక‌మంతా త‌మ‌కు అదోర‌కంగా చూస్తుంటే భ‌రించాల‌ని ...ఎన్ని మాట‌లు అన్నా స‌హించాల‌ని కోరుకోరు. కానీ వారి కుంటుబ ప‌రిస్థితులు ఆర్థిక స్థితిగ‌తులే ఆ పాడు వృత్తిలోకి నెడ‌తాయి. దాంతో జీవితాంతం అదే వృత్తిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ అవ‌మానాల‌ను భ‌రిస్తూ గ‌డుపుతుంటారు. కాగా తాజాగా సెక్స్ వర్కర్లు మరియు అక్రమ రవాణా బాధితుల రాష్ట్ర సమైక్య విముక్తి మరియు హెల్ప్ సంస్థ త‌మ‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని డిమాండ్ చేస్తోంది. ప్రపంచ  మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సెక్స్ వర్కర్లు నిరసనకు దిగారు . 

ఈ సంధ‌ర్బంగా వారు మాట్లాడుతూ...సెక్స్ వర్కర్ల ఇబ్బందులను ఆసరా చేసుకుని తమకు రుణాలను ఇచ్చి బలవంతంగా అధిక వడ్డీలు వసూలు చేస్తున్నటువంటి వడ్డీ వ్యాపారస్తుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నియంత్రణ చట్టం తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు. అలాగే రుణ గ్రహీతల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు తీసుకురావాలంటూ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు చేతిలో చిక్కుకునే చాలా కుటుంబాలు మరో ప్రత్యామ్నాయం లేక వ్యాపార లైంగిక దోపిడీ దారుల వలలో చిక్కి చివ‌రికి వ్య‌భిచార‌ గృహంలోనికి నెట్టివేయబడుతున్నామంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు .

రాష్ట్రంలోని సెక్స్ వర్కర్లకు మరియు అక్రమ రవాణా బాధితులకు స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయాల‌ని.... వివిధ బ్యాంకుల ద్వారా త‌మ‌కు వెంట‌నే రుణాలను అందించాలంటూ ప్ర‌భుత్వాన్ని కోరారు. చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడిన సెక్స్ వర్కర్ లందరికీ  మెప్మా  ద్వారా రుణాలను మంజూరు చేసి త‌మ జీవితాలలో వెలుగులు నింపాల‌ని కోరారు. అంతే కాకుండా తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ సెక్స్ వర్కర్లు విజ్ఞ‌ప్తి చేశారు .



ఇల్లీగల్ యాక్టివిటీస్ లో పట్టుబడ్డ సెలెబ్రిటీలు వీళ్ళే...!

దేశంలో మనుషుల అక్రమ రవాణా ఇంతలా జరుగుతోందా..?

నన్ను ఈ కేసులో ఇరికించకండి - లక్స్ పాప



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>