PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/huzurabad-election-for-padi-cowshikreddy-congresscacd2b04-b359-4e4e-9e59-fadcfc7a2b72-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/huzurabad-election-for-padi-cowshikreddy-congresscacd2b04-b359-4e4e-9e59-fadcfc7a2b72-415x250-IndiaHerald.jpgఇదిలా ఉండగా ఇదే నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి తెరాసలో చేరిన విషయం మనకు తెలుసు. ప్రస్తుతం స్వర్గం రవి కూడా ఆ పార్టీలోనే చేరడం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ వస్తుందని ఊహాగానాలు రావడం అక్కడి నాయకుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే కెసిఆర్ జరిపినటువంటి ఇంటెలిజెంట్ సర్వేల్లో మిగతా అందరి నేతల కంటే స్వర్గం రవి కే సానుకూలంగా స్పందన రావడంతో ఆయన వైపే కేసీఆర్ ముగ్గు చూపుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఏదిఏమైనా కొద్ది రోజులు ఓపిక పడితే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.Political {#}pragathi;ravi anchor;Heaven;kaushik;Letter;Revanth Reddy;KCR;Huzurabad;Telangana Rashtra Samithi TRS;revanth;రాజీనామా;Telangana;Congress;Partyకాంగ్రెస్ కి బిగ్ షాక్.. టీఆర్ఎస్ లో చేరనున్న మరో కీలక నాయకుడు..?కాంగ్రెస్ కి బిగ్ షాక్.. టీఆర్ఎస్ లో చేరనున్న మరో కీలక నాయకుడు..?Political {#}pragathi;ravi anchor;Heaven;kaushik;Letter;Revanth Reddy;KCR;Huzurabad;Telangana Rashtra Samithi TRS;revanth;రాజీనామా;Telangana;Congress;PartyThu, 29 Jul 2021 08:06:00 GMTతెలంగాణలోని  హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దెబ్బ మీద దెబ్బ పడుతూ కాంగ్రెస్ క్యాడర్ అంతా పోతుందని చెప్పవచ్చు. అయితే తెలంగాణ టీ పీసీసీ అధ్యక్షుడిగా  రేవంత్ రెడ్డి ఎన్నిక తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్తేజం లో మునిగిపోతున్నదని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి పిసిసి అయిన తర్వాత చాలా మంది పాత నేతలను కలుస్తూ వారిని పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తూ, కార్యకర్తలకు భరోసానిస్తూ రేవంత్ ముందుకు సాగుతున్నాడు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు పార్టీ పటిష్టత కోసం పాటుపడుతున్నడని చెప్పవచ్చు. కానీ అలాంటి నేతకు హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా తలనొప్పిగా మారింది. ఆయన టీ పిసిసి అయిన తర్వాత ఇది మొదటి ఎన్నిక. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని లక్ష్యంతో  రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు.

ఈ తరుణంలోనే  కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ లో కీలక నేతగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేయడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది. దీంతో అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ తరుణంలోనే  హుజురాబాద్ లో  కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. అదే నియోజకవర్గానికి చెందిన టువంటి మరో కీలక నాయకుడు  స్వర్గం రవి  పార్టీకి రాజీనామా చేసి, ఆయన రాజీనామాను తొందరగా ఆమోదించాలని  రేవంత్ రెడ్డిని కోరారు. ప్రస్తుత పరిస్థితులలో తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని ఆయన ఆ లేఖ ద్వారా తెలియజేశారు. ఈనెల 30వ తేదీన  తెరాసలో చేరుతున్నట్టు తెలిపాడు. అయితే స్వర్గం రవి అనే వ్యక్తి హుజురాబాద్ కాంగ్రెస్ లో చాలా కీలక నేత. ఆయన 15 సంవత్సరాలుగా  కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అంతకుముందు తెలంగాణ పిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కూడా పనిచేశారు. పెద్ద పారిశ్రామికవేత్త అయినటువంటి ఆ స్వర్గం రవి హుజురాబాద్ లో తనకంటూ ఒక మంచి క్యాడర్ ను ఏర్పాటు చేసుకున్నారు. రవి రాజీనామాతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ అంతా  తెరాస పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అవుతోంది. ఇంకొకవైపు  స్వర్గం రవి టిఆర్ఎస్ పార్టీలో చేరితే  ఆయనకు పక్క టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. రవి బిసి సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి, స్థానికంగా ఆయనకు పట్టు ఎక్కువగా ఉన్నది. ఇటీవల కాలంలోనే కేసిఆర్ ఆయనను  ప్రగతి భవన్ కు పిలిపించుకున్నాడు అని ప్రచారం కూడా సాగుతోంది.

ఆయనను ప్రగతి భవన్ కు పిలిచింది మాత్రం టికెట్ విషయంలో చర్చించడానికే అని తెరాసలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా  ఇదే నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి  తెరాసలో చేరిన విషయం  మనకు తెలుసు. ప్రస్తుతం స్వర్గం రవి కూడా ఆ పార్టీలోనే చేరడం  ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ వస్తుందని  ఊహాగానాలు రావడం అక్కడి నాయకుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే కెసిఆర్ జరిపినటువంటి ఇంటెలిజెంట్ సర్వేల్లో  మిగతా అందరి నేతల కంటే  స్వర్గం రవి కే సానుకూలంగా స్పందన రావడంతో  ఆయన వైపే కేసీఆర్ ముగ్గు చూపుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఏదిఏమైనా కొద్ది రోజులు ఓపిక పడితే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.



బ‌ట్ట‌లు విప్పుతానంటున్న మంత్రి..! ఎందుకో తెలుసా.?

కేసీఆర్ కి షాక్.. దళితబంధుపై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు..

స్మరణ : తమిళ నటుడు మణివన్నన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

ఆయన రాజీనామా చేస్తే బాగు.. కలలు కంటున్న జనం..?

జులై 29: చరిత్రలో ఈరోజు జరిగిన సంఘటనలు..

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: చెన్నకేశవరెడ్డికి నెక్స్ట్ కష్టమేనా?

పవన్ కల్యాణ్‌కు ఆ ఆఫర్ ఉంటుందా?

ఇక ఎన్టీఆర్‌తో పని లేనట్లేనా?

మాజీ బాస్ బాటలో రేవంత్...ఆ ఫార్ములా వర్క్ అవుతుందా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>