CrimePodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rajkundrab542128a-5639-433c-84a9-f1c5aea23292-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rajkundrab542128a-5639-433c-84a9-f1c5aea23292-415x250-IndiaHerald.jpgపోర్న్ వీడియోల కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోర్న్ కంటెంట్ వీడియోలు చిత్రీకరించిన కేసులో ఇప్పటికే వయాన్ ఇండస్ట్రీస్ సంస్ఖకు చెందిన రాజ్ కుంద్రా, నటుడు గెహానా వశిష్ట సహా మరో నిర్మాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు విచారణను ముంబై క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ కు ముంబై పోలీసులు బదిలీ చేశారు. పోర్న్ కంటెంట్ వ్యవహారంలో మాల్వాని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ముంబై సమీపంలోని మాద్ ద్వీపంలోRajkundra{#}December;vegetable market;Mumbai;Arrest;raj;bollywood;Police Station;Husband;police;Indiaరాజ్ కుంద్రాకు మరిన్ని తిప్పలురాజ్ కుంద్రాకు మరిన్ని తిప్పలుRajkundra{#}December;vegetable market;Mumbai;Arrest;raj;bollywood;Police Station;Husband;police;IndiaThu, 29 Jul 2021 15:56:00 GMTపోర్న్ వీడియోల కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోర్న్ కంటెంట్ వీడియోలు చిత్రీకరించిన కేసులో ఇప్పటికే వయాన్ ఇండస్ట్రీస్ సంస్ఖకు చెందిన రాజ్ కుంద్రా, నటుడు గెహానా  వశిష్ట సహా మరో నిర్మాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు విచారణను ముంబై క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ కు ముంబై పోలీసులు బదిలీ చేశారు.

పోర్న్ కంటెంట్ వ్యవహారంలో మాల్వాని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ముంబై సమీపంలోని మాద్ ద్వీపంలో ఒక బంగ్లాపై దాడి చేసిన పోలీసులు... పోర్న్ కంటెంట్ షూటింగ్ చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఆ కేసులో ఇప్పటికే ప్రాపర్టీ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోర్న్ కంటెంట్ వ్యవహారంలో అరెస్టైన రాజ్ కుంద్రా... ప్రస్తుతం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.

అటు అంతర్గత వాణిజ్య నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణలపై శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా సహా అతని సంస్థలపై 3 లక్షల జరిమానా విధించింది మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్  ఆఫ్ ఇండియా సెబీ. రాజ్ కుంద్రాను కీ కుట్రదారుడు అని పిలిచారు ముంబై పోలీసులు. మోసం చేయడంతో పాటు అశ్లీల, అసభ్య ప్రకటనలు, ప్రదర్శనలకు పాల్పడినట్లు భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.

సమాచార సాంకేతిక చట్టం, మహిళల అసభ్య ప్రాతినిధ్య నిషేధ చట్టంలోని విభాగాలను కూడా ముంబై పోలీసుల ఉపయోగించారు. హాట్ షాట్ అనే యాప్ ద్వారా అశ్లీల కంటెంట్ ను అప్ లోడ్ చేసిన కేసులు 10 మందితో పాటు రాజ్ కుంద్రాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది ఆగస్టు, డిసెంబర్ మధ్య హాట్ షాట్ యాప్ చందాదారుల నుంచి రాజ్ కుంద్రా కోటీ 17 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు రిమాండ్ దరఖాస్తులో ముంబై పోలీసులు వెల్లడించారు. రాజ్ కుంద్రా బెయిల్ పిటిషన్ ను బాంబే హైకోర్టు విచారించనుంది.



సంపూర్ణ లాక్ డౌన్.. ఆగస్ట్ 1వరకు..!

తగ్గేదే లే... లేడీ సూపర్ మరో మూవీ స్టార్ట్

కేసీఆర్ నువ్వెక్కడ ఆనాడు . ?

అంతర్జాతీయ కాల్స్ ని లోకల్ కాల్స్ గా మార్చే ముఠా గుట్టు రట్టు

బావా..బామర్ధి సినిమా ఎంట్రీ వెన‌క గ‌మ్మ‌త్తైన న్యూస్ ఒక్క‌టే ...!

రాజమౌళి సెంటిమెంట్ ను కొరటాల బ్రేక్ చేస్తాడా..?

ఇక మీదట ప్రతి జిల్లాలో వన్ స్టాప్ సెంటర్లు

రాజమౌళి తన సినిమా పబ్లిసిటీ మొదలు పెట్టనున్నాడా?

ఛీఛీ..భ‌ర్త బుర‌ద‌లో ప‌డితే భార్య ఏం చేసిందో చూడండి.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>