MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venuf11a44cf-2349-48c2-abe5-b9284d0a699f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venuf11a44cf-2349-48c2-abe5-b9284d0a699f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కామెడీ చిత్రాల హీరోగా వేణు తొట్టెంపూడి కి మంచి పాపులారిటీ ఉంది. ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను తన నటన తో మంత్రముగ్ధులను చేసి వారిని ఎంతగానో ఆకట్టుకునే వాడు. స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే, ఇల్లాలు ప్రియురాలు, శ్రీ కృష్ణ 2006, అల్లరి అల్లరి, యమగోల వంటి చిత్రాలలో ఆయన పండించిన కామెడీకి ప్రేక్షకులు ఎంతో అలరింపబడ్డారు. తొలుత హీరోగా సినిమా ఇండస్ట్రీ లోకి ప్రవేశించిన వేణు ఆ తర్వాత కమెడియన్ గా కూడా నటించడానికి ఏమాత్రం వెనకాడలేదు.venu{#}Sri Krishna;Comedian;Illalu;Allari;Comedy;Venu Thottempudi;Swayamvaram;NTR;Wife;Ravi;ravi teja;Audience;Telugu;Cinemaవేణు రీ ఎంట్రీ లో ఊహించని పాత్ర.. రవితేజ కి ధీటుగా!!వేణు రీ ఎంట్రీ లో ఊహించని పాత్ర.. రవితేజ కి ధీటుగా!!venu{#}Sri Krishna;Comedian;Illalu;Allari;Comedy;Venu Thottempudi;Swayamvaram;NTR;Wife;Ravi;ravi teja;Audience;Telugu;CinemaThu, 29 Jul 2021 16:08:00 GMTటాలీవుడ్ లో కామెడీ చిత్రాల హీరోగా వేణు తొట్టెంపూడి కి మంచి పాపులారిటీ ఉంది. ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను తన నటన తో మంత్రముగ్ధులను చేసి వారిని ఎంతగానో ఆకట్టుకునే వాడు. స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే, ఇల్లాలు ప్రియురాలు, శ్రీ కృష్ణ 2006, అల్లరి అల్లరి, యమగోల వంటి చిత్రాలలో ఆయన పండించిన కామెడీకి ప్రేక్షకులు ఎంతో అలరింపబడ్డారు. తొలుత హీరోగా సినిమా ఇండస్ట్రీ లోకి ప్రవేశించిన వేణు ఆ తర్వాత కమెడియన్ గా కూడా నటించడానికి ఏమాత్రం వెనకాడలేదు.

1999లో స్వయంవరం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన సినిమా కెరీర్ లో 26 సినిమాల్లో హీరోగా నటించి తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే హీరోగా సినిమా లు చేస్తున్న సమయంలో సరైన హిట్లు సాధించలేక క్రమక్రమంగా మరుగున పడి పోయాడు ఈ టాలెంటెడ్ హీరో. రామాచారి చిత్రంలో ఆఖరిగా నటించిన వేణు ఇప్పటివరకు ఏ తెలుగు చిత్రంలోనూ నటించలేదు అంటే ఆయన ఎంతటి నిరాశ లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. దమ్ము సినిమాలో ఎన్టీఆర్ తో ఓ కీలక పాత్రలో నటించిన ఈయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కొనసాగలేక పోయాడు. 

తాజాగా ఆయన రీ ఎంట్రీ రవితేజ సినిమాలో ఖరారయింది. రవితేజ హీరోగా చేస్తున్న 68వ సినిమా రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఇది కొంత డిఫరెంట్ పాత్ర అని తెలుస్తుంది. విలన్ గా కనిపించిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు. ప్రస్తుతం ఫేడ్ అవుట్ అయిపోయిన చాలా మంది హీరోలు ఏ పాత్రైనా చేయడానికి సిద్ధం అవుతున్న నేపథ్యంలో వేణు కూడా అలాంటి పాత్రలు చేసి మళ్ళీ గుర్తింపు దక్కించుకోవాలి, వరుస అవకాశాలు దక్కించుకోవాలనే అనుకోవడం తో ఆయన ఈ సినిమాలో ఊహించని పాత్రలో చేస్తున్నాడట. మరి రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఆయనకు భవిష్యత్తులో ఎంత మంచి పేరు తీసుకు వస్తుందో చూడాలి. 



మీరాబాయి చానుకు ఐకాన్స్ బంపర్ ఆఫర్

వామ్మో .... సంక్రాంతి బరిలో మహేష్, పవన్, ప్రభాస్ .... నిజమే ... ??

చీర కట్టులో అనసూయ నడుమందాలు.. !

రాధే శ్యామ్ సమ్మర్ కి వెళ్తుందా?

ఖడ్గం సినిమా తీయడానికి ముషారఫ్ కారణం అని మీకు తెలుసా ?

'అఖండ' ఇంటర్వెల్ బ్యాంగ్ ఆ సినిమాలను గుర్తు చేస్తుందా..?

హీరో కార్తీక్ కు.. గాయాలు..

ఐదు భారీ సినిమాలు.. థమన్ రచ్చ కన్ఫర్మ్..!

'ఆచార్య' - 'అఖండ' బాక్సాఫీస్ వార్ షురూ ..... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>