PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan543c596b-6d00-4ad2-aa97-3fb4484672cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan543c596b-6d00-4ad2-aa97-3fb4484672cf-415x250-IndiaHerald.jpgవైసీపీలో రెండున్నర ఏళ్ల క్రితం ఎన్నికల ఫలితాల ముందు రోజు ఏ రకమైన టెన్షన్ వాతావరణం ఉందో మళ్ళీ అలాంటి పరిస్థితే ఉందని ప్రచారం అయితే సాగుతోంది. బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి ఎందుకు ఈ టెన్షన్ అంటే దానికి గల కారణాలు వేరే ఉన్నాయని అంటున్నారు. jagan{#}CBI;king;MP;YCP;Jaganవైసీపీలో టెన్షన్.. టెన్షన్... ?వైసీపీలో టెన్షన్.. టెన్షన్... ?jagan{#}CBI;king;MP;YCP;JaganThu, 29 Jul 2021 20:09:16 GMTవైసీపీలో రెండున్నర ఏళ్ల క్రితం ఎన్నికల ఫలితాల ముందు రోజు ఏ రకమైన టెన్షన్ వాతావరణం ఉందో మళ్ళీ అలాంటి పరిస్థితే ఉందని ప్రచారం అయితే సాగుతోంది. బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి ఎందుకు ఈ టెన్షన్ అంటే దానికి గల కారణాలు వేరే  ఉన్నాయని అంటున్నారు.

జగన్ బెయిల్ రద్దు పిటిషన్ మీద మరి కొద్ది గంటలలో సీబీఐ కోర్టులో విచారణ ఉంది. జగన్ బెయిల్ రద్దు మీద దర్యాప్తు  సంస్థ సీబీఐ ఏ రకమైన కౌంటర్ దాఖలు చేసింది అన్నదే ఇపుడు చర్చగా ఉంది. జగన్ బెయిల్ నిబంధనలు ఉల్లఘించారు అని పేర్కొంటూ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీని మీద ఇరు వైపుల వాదనలు ముగిసాయి.

అయితే అత్యంత కీలకమైన సీబీఐ కౌంటర్ పిటిషన్ మీదనే అందరి దృష్టి ఇపుడు ఉంది. సీబీఐ ఈ విషయంలో గడువు కోరడం వల్లనే ఈ నెల 30నకు కేసు వాయిదా పడింది. ఇక బెయిల్ రద్దు మీద సీబీఐ వైఖరి ఏంటి అన్నది కూడా చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే జగన్ బెయిల్ రద్దు అయితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది కూడా చర్చగా ఉంది.

ఇటు పార్టీలో ప్రభుతంలో కూడా సర్వం సహాగా జగన్ ఉన్నారు. ఆయనతోనే మొత్తం కధ నడుస్తోంది. వైసీపీలో నంబర్ టూ అంటూ ఎవరూ లేరు. ఈ నేపధ్యంలో వైసీపీ సిబిరం లో టెన్షన్ గానే ఉంది అంటున్నారు. మరో వైపు రాజకీయ వర్గాల్లోనూ దీని మీద ఆసక్తి ఉంది. జగన్ బెయిల్ రద్దు అయితే రాష్ట్ర రాజకీయాల్లోనే కీలకమైన పరిణామాలు సంభవిస్తాయని కూడా అంటున్నారు. మొత్తానికి మరి కొద్ది గంటలల్లో ఏం జరుగుతుంది అన్నదే చూడాల్సి ఉంది అంటున్నారు. వెయిట్ చేయడమే మరి.







ఆడు ఆడించు : ద‌ర్యాప్తు సంస్థ‌ల‌న్నీ బొమ్మ‌లేనా!

అప్పుడు జగన్ చేసారు.. ఇప్పుడు యోగి చేస్తున్నారు : విజయసాయి

వైసీపీలో రెండున్నర ఏళ్ల క్రితం ఎన్నికల ఫలితాల ముందు రోజు ఏ రకమైన టెన్షన్ వాతావరణం ఉందో మళ్ళీ అలాంటి పరిస్థితే ఉందని ప్రచారం అయితే సాగుతోంది. బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి ఎందుకు ఈ టెన్షన్ అంటే దానికి గల కారణాలు వేరే ఉన్నాయని అంటున్నారు.

షాకింగ్ : చిరంజీవితో కలిసి ఢిల్లీకి రేవంత్ రెడ్డి?

శంకర్ కి వేరే పనిలేదట.. అందుకే ఇలా!!

హమ్మయ్య: జగన్ మనసు మారింది...?

పులుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు : జగన్

తెలంగాణ ఎందుకు వచ్చిందో చెప్పాలన్న మాజీ ఎంపీ

జగనోరి కోరిక తీరడం అంత వీజీనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>