Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rana563cc6fd-a66e-4664-939d-4640c5de68f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rana563cc6fd-a66e-4664-939d-4640c5de68f1-415x250-IndiaHerald.jpgమాములుగా మల్టీస్టారర్ సినిమా అంటే అందులో నటించే ఇద్దరి హీరోలకు సమానమైన పాత్రలు ఇస్తారు. కాని సెట్స్ మీద ఉన్న ఓ మల్టీస్టారర్ సినిమా అది కూడా ఒక రీమేక్ సినిమాలో ఒక హీరోకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మరో హీరోకి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇంతకీ ఆ సినిమా ఏది అంటే మళయాళ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ గా చేస్తున్న సినిమా అవడం విశేషంPawan-Rana-Bheemla-Nayak{#}Huzur Nagar;Kanna Lakshminarayana;rana daggubati;Nayak;Daggubati Venkateswara Rao;Venkatesh;Remake;Pawan Kalyan;Cinemaభీమ్లా నాయక్ టైటిల్.. రానాకు ఇంత అన్యాయమా..?భీమ్లా నాయక్ టైటిల్.. రానాకు ఇంత అన్యాయమా..?Pawan-Rana-Bheemla-Nayak{#}Huzur Nagar;Kanna Lakshminarayana;rana daggubati;Nayak;Daggubati Venkateswara Rao;Venkatesh;Remake;Pawan Kalyan;CinemaWed, 28 Jul 2021 14:00:00 GMTమాములుగా మల్టీస్టారర్ సినిమా అంటే అందులో నటించే ఇద్దరి హీరోలకు సమానమైన పాత్రలు ఇస్తారు. కాని సెట్స్ మీద ఉన్న ఓ మల్టీస్టారర్ సినిమా అది కూడా ఒక రీమేక్ సినిమాలో ఒక హీరోకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మరో హీరోకి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇంతకీ ఆ సినిమా ఏది అంటే మళయాళ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ గా చేస్తున్న సినిమా అవడం విశేషం. సాగర్ చంద్ర డైరక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి చేస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ సినిమాలో రానాకి అన్యాయం జౌగుతుందని ఫీల్ అవుతున్నారు దగ్గుబాటి ఫ్యాన్స్.

అలా ఎందుకు అంటే సినిమా నుండి ప్రతి అప్డేట్ పవర్ స్టార్ కోణం నుండే ఇస్తున్నారు. పవన్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన దగ్గర నుండి లేటెస్ట్ గా ఆయన పాత్ర పేరు ఎనౌన్స్ చేస్తూ విడుదల తేదీ ప్రకటించిన వీడియో వరకు రానా ఏదో సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు. రానా సినిమాలో నటిస్తున్నాడని ఎనౌన్స్ చేసే టైం లో వేసిన ప్రోమో తప్ప తర్వాత రానాకి పెద్దగా ప్రిఫరెన్స్ ఇచ్చింది లేదు. ఇక ఇప్పుడు సినిమా టైటిల్ కూడా సినిమాలో పవన్ పాత్ర పేరు అయిన భీమ్లా నాయక్ అని పెట్టబోతున్నారని టాక్. ఇదే నిజమైతే రానాకి నిజంగానే అన్యాయం జరిగినట్టు అవుతుంది.

అయితే చిత్రయూనిట్ నుండి వస్తున్న వర్షన్ ఏంటంటే సినిమాలో పవన్, రానాలకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నా సినిమా మీద బజ్ పెంచేందుకు అలా పవర్ స్టార్ ను వాడేస్తున్నారని అంటున్నారు. అంతేకాదు సినిమాలో పవన్ పాత్ర కన్నా రానా పాత్ర డామినేటెడ్ గా ఉంటుందని కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రచార చిత్రాల్లో రానా అసలు కనిపించకపోవడం ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతుంది. అయితే సినిమాలో సీన్ రివర్స్ అవుతుందని అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవమో చూడాలి.





చరణ్ - శంకర్ మూవీలో లోకనాయకుడు .... ఏంటి నిజమే .... ??

మా వార్‌: ఆ ఒక్క‌ ఎత్తుగ‌డ‌తో మెగా కాంపౌండ్ విల‌విలా ?

మేకప్ లేకుండా ఉన్న ఈ హీరోయిన్ ఎవరో చెప్పండి.. ?

భీమ్లా నాయక్ టైటిల్.. రానాకు ఇంత అన్యాయమా.

మోక్ష‌జ్ఞ తొలి సినిమా అది కాదా... ఊహించ‌ని ట్విస్ట్ ?

దుల్కర్ సల్మాన్ డైరెక్టర్ కల... అలా చెదిరిపోయింది ?

బాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కి అంతా సిద్ధం..?

అజిత్ గాడంగా ప్రేమించి ఆ హీరోయిన్‌కు ఎందుకు దూర‌మ‌య్యాడు ?

రామ్‌చ‌ర‌ణ్ - కాజ‌ల్ ' మెరుపు ' ఆ కార‌ణంతోనే ఆగిపోయిందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>