WinnersVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijaaym-meedhe460bde24-a58f-45a1-b114-918c51eb2a74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijaaym-meedhe460bde24-a58f-45a1-b114-918c51eb2a74-415x250-IndiaHerald.jpgమనిషి ఆనందంగా ఉండాలంటే ఉండాల్సింది కేవలం డబ్బు, ఆస్థి పాస్టులు మాత్రమే కాదు అంతకు మించి కావలసినవి జీవితంలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం అనేది ఎంతో ప్రదానం. మన దగ్గర వేల కోట్ల ఆస్తులు ఉన్నా మన ఆరోగ్యం సరిగా లేకపోతే మాత్రం అందులో ఎటువంటి ఆనందం ఉండదు.VIJAAYM MEEDHE{#}Kanna Lakshminarayana;Anandam;Manamవిజయం మీదే: ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారా... ?విజయం మీదే: ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారా... ?VIJAAYM MEEDHE{#}Kanna Lakshminarayana;Anandam;ManamWed, 28 Jul 2021 21:06:43 GMTమనిషి ఆనందంగా ఉండాలంటే ఉండాల్సింది కేవలం డబ్బు, ఆస్థి పాస్టులు మాత్రమే కాదు అంతకు మించి కావలసినవి జీవితంలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం అనేది ఎంతో ప్రదానం. మన దగ్గర వేల కోట్ల ఆస్తులు ఉన్నా మన ఆరోగ్యం సరిగా లేకపోతే మాత్రం అందులో ఎటువంటి ఆనందం ఉండదు. అంత ఆస్తి పాస్తులు ఉన్నప్పటికీ ఆరోగ్యం సరిగా లేకపోతే వాటిని సంతోషంగా అనుభవించలేము. అందుకే ముందుగా మన ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలి. కాని ప్రస్తుత జనరేషన్ లో జీవితం ఒక ఉరుకుల పరుగుల పందెంగా మారిపోయింది. కాలంతో పరుగులు తీసే నేటి తరంలో ఆరోగ్యానికి సమయం కేటాయించడం కూడా కష్టమైపోయింది. ప్రజలు బయట రుచులకు అలవాటు పడ్డారు. ఇంకొందరు సమయం లేక బయట తినాల్సిన పరిస్థితి కారణంగా ఆరోగ్యాన్ని అసలు పట్టించుకోవడం లేదు.

కాని ఇది వారి భవిష్యత్తులో ఆరోగ్యంపై ఎంతో ప్రభావం  చూపుతుంది. అయినా తెలిసి తెలిసి చాలా మంది  ఇదే పొరపాటు చేస్తున్నారు. కాని పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది అన్నారు పెద్దలు. అదే విదంగా ఆరోగ్యం దెబ్బ తిన్న తర్వాత వేలకు వేలు డబ్బులు పోసి సరి చేయించుకోవడం కన్నా మన చేతిలో ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండటానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.  అలాగే ఆరోగ్యంగా ఉండటం ద్వారా మనం కోరుకున్న లక్ష్యాన్ని కూడా ఆనందంగా సాధించగలం.  అంతే కాదు మన శరీరంతో పాటు మన మనసు కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి.

అంటే మన ఆలోచనలు ఎప్పుడూ కూడా పాజిటివ్ గా, మంచిగా ఉండాలి. మన అలవాట్లు అభిరుచులు కూడా ఆరోగ్యకరంగా ఉండటం ఉత్తమం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. మీ ఇంటిలో తయారుచేసే వంటకాలనే తింటూ సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండండి. మీరు ఏది సాధించాలన్నా మానసికంగా మరియు శారీరకంగా బలంగా ఉండాలి. అందుకే మంచి ఆహారపు అలవాట్లను కలిగి ఉండాలి.



బిజినెస్: నిరుద్యోగులకు లక్షలు తీసుకొచ్చే వ్యాపారం..

ఒకే ఒక్కడు లాంటి సూపర్ హిట్ సినిమాను వదులుకున్న హీరో ఎవరు.. ?

లైఫ్ స్టైల్ :కొవిడ్ తో పోరాడాలంటే ఈ సూప్ తాగాల్సిందే..

టాలీవుడ్ కి ఆ సీజన్ అంత అచ్చి వచ్చిందా..!!

ఆ దేశ పరిశోధకులకు న్యూక్లియర్ మిస్సైల్స్ దొరికాయట..

బుడుగు: పిల్లలకు డైపర్స్ వేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి..!?

ఆ ఇద్దరూ కేసీఆర్ లో బ్రతికే ఉన్నారట...?

మొదటి రాత్రి యువతికి కాలరాత్రి.. భర్త అసలు మగాడే కాదట?

భీమ్లా నాయక్ టైటిల్.. రానాకు ఇంత అన్యాయమా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>