PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telanaga-andrapradesh-water-war68ad1b21-7b65-46c8-a8f5-3c34c99f1938-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telanaga-andrapradesh-water-war68ad1b21-7b65-46c8-a8f5-3c34c99f1938-415x250-IndiaHerald.jpgకృష్ణా నదికి భారీగా వరద పోటెత్తింది. ఇప్పటికే ఎగువనున్న అన్ని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలతో ఎగువ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. రికార్డు స్థాయిలో వరద పోటెత్తడంతో... దిగువ ప్రాంతాలను ఇప్పటికే అప్రమత్తం చేశారు అధికారులు. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో దిగువనున్న శ్రీశైలం రిజర్వాయర్ కు భారీగా వరద నీరు చేరుతోంది. రికార్డు స్థాయిలో ఇప్పటికే 4 లక్షల పై చిలుకు నీరు అటు జూరాల, సుంకేసSrisailam{#}Akkineni Nagarjuna;Prakasam;Evening;Aqua;Srisailam;electricity2007 తర్వాత మళ్లీ ఇప్పుడే...2007 తర్వాత మళ్లీ ఇప్పుడే...Srisailam{#}Akkineni Nagarjuna;Prakasam;Evening;Aqua;Srisailam;electricityWed, 28 Jul 2021 12:29:05 GMTకృష్ణా నదికి భారీగా వరద పోటెత్తింది. ఇప్పటికే ఎగువనున్న అన్ని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలతో ఎగువ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. రికార్డు స్థాయిలో వరద పోటెత్తడంతో... దిగువ ప్రాంతాలను ఇప్పటికే అప్రమత్తం చేశారు అధికారులు. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో దిగువనున్న శ్రీశైలం రిజర్వాయర్ కు భారీగా వరద నీరు చేరుతోంది. రికార్డు స్థాయిలో ఇప్పటికే 4 లక్షల పై చిలుకు నీరు అటు జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 879 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 173 టీఎంసీల నీరు ప్రాజెక్టులో అందుబాటులో ఉంది.

దీంతో 2007 తర్వాత తొలిసారిగా జులై నెలలోనే డ్యామ్ గేట్లు ఓపెన్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సాధారణంగా ప్రతి ఏటా ఆగస్టు నెలలో డ్యామ్ గేట్లు పైకి ఎత్తి.. నీటిని దిగువకు విడుదల చేస్తారు. కానీ ఈ ఏడాది జులై నెలలోనే రికార్డు స్థాయి వరద రావడంతో... వారం రోజులు ముందుగానే డ్యామ్ జలకళను సంతరించుకుంది. మొత్తం 12 గేట్లలో ఈ సాయంత్రం 3 గేట్లను ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డ్యామ్ లో నీరు పూర్తిగా రావడంతో... గేట్ల ద్వారా ఇప్పటికే నీరు లీక్ అవుతోంంది. అటు పై నున్న సంగమేశ్వర ఆలయం పూర్తిగా నీట మునిగిపోయింది. ఇటు దిగువనున్న నాగార్జున సాగర్ పరిహాహక ప్రాంత ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం ఎడమ, కుడి గట్టు కాలువల్లో విద్యుత్ ఉత్తత్పి కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అటు దిగువనున్న పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ ల నుంచి ఇప్పటికే వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.



రేప్ కి సహకరించలేదని యువతిని ఏమి చేసారో తెలుసా..??

బ్రతికుండగానే చనిపోయానన్న శోభ‌న్‌బాబు.... కార‌ణం ?

బహిరంగ సభలో ఈటలకు షాక్ ఇచ్చిన ప్రజలు.. వీడియో వైరల్ ?

హాట్ హాట్ గా కృష్ణా రాజకీయాలు

రెండో పెళ్లి చేసుకోబోతున్న సుమంత్..!?

ఆరుబయట నడవడం మంచిదేనా..?

స్మరణ : అక్కినేని అస్తమించిన వేళ..

రమ్యకృష్ణ కి హ్యాండ్ ఇచ్చిన నాగ్.. ఆమె స్థానంలో మరో హీరోయిన్..?

ప్రమాదకర పరిస్థితుల్లో పోలవరం నిర్వాసితులు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>