CrimePaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/marriage-cheating1f0984d9-9f9a-4576-8f85-f4a7b63b91d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/marriage-cheating1f0984d9-9f9a-4576-8f85-f4a7b63b91d9-415x250-IndiaHerald.jpg పెళ్లి జ‌రిగింది, కానీ తొలి రాత్రి పెళ్లికొడుకు చేసిన వింత చేష్ట‌ల‌తో ఆ న‌వ వ‌ధువు అత్తింటి వారిపై, పెళ్లి కుదిర్చిన మ‌ధ్య‌వ‌ర్తిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. బాధితురాలు, ఆమె బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... తాడేపల్లిలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న మ‌హిళ‌.. తన కుమారుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి గుంటూరుకు చెందిన ఓ యువతితో మే 26న వివాహం జరిపించారు. కట్నంగా రూ.6 లక్షలు, పెళ్లికి మరో రూ.2 లక్షలు ఖర్చు చేయించారు. తన కుమారుడి మొద‌టి రాత్రి భువనేశ్వర్‌లో జరగాలని పెళ్లికొడmarriage cheating{#}Smart phone;job;Parents;narasaraopet;Manam;marriage;central governmentఅత్తింటివారిపై న‌వ వ‌ధువు కేసు.. తొలిరాత్రి భ‌ర్త చేసిన ఆ ప‌నితో..!అత్తింటివారిపై న‌వ వ‌ధువు కేసు.. తొలిరాత్రి భ‌ర్త చేసిన ఆ ప‌నితో..!marriage cheating{#}Smart phone;job;Parents;narasaraopet;Manam;marriage;central governmentTue, 27 Jul 2021 08:26:29 GMT  పెళ్లి జ‌రిగింది, కానీ తొలి రాత్రి పెళ్లికొడుకు చేసిన వింత చేష్ట‌ల‌తో ఆ న‌వ వ‌ధువు అత్తింటి వారిపై, పెళ్లి కుదిర్చిన మ‌ధ్య‌వ‌ర్తిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. బాధితురాలు, ఆమె బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... తాడేపల్లిలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న మ‌హిళ‌.. తన కుమారుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి గుంటూరుకు చెందిన ఓ యువతితో మే 26న వివాహం జరిపించారు. 

కట్నంగా రూ.6 లక్షలు, పెళ్లికి మరో రూ.2 లక్షలు ఖర్చు చేయించారు. తన కుమారుడి మొద‌టి రాత్రి భువనేశ్వర్‌లో జరగాలని పెళ్లికొడుకు త‌ల్లి ఒత్తిడి చేసింది. దానికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో నర్సరావుపేటలోనే ఆ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. మొద‌టి రాత్రి రోజే ఆ యువకుడి వింత ప్రవర్తనలు, విచిత్ర ధోరణితో వ్యవహరించడంతో యువతి షాక్‌కు గుర‌యింది. ఆ రాత్రి యువ‌తి దగ్గరకు వచ్చిన అతను ఈ వయసులో కోరికలు ఎక్కువ ఉండకూడదంటూ మాత్ర వేసుకొని ప‌డుకున్నాడు.
 

   తొలి మూడు రాత్రులు ఈ విధంగానే ప్ర‌వ‌ర్తించ‌డంతో యువ‌తికి అనుమానం రావ‌డంతో నిల‌దీసింది. దాంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. అప్పుడు అతను చెప్పిన స‌మాధానంతో ఆమె ఆశ్చ‌ర్య‌పోయింది.భార్య, భర్తలు అంటే శారీరక సంబంధం పెట్టుకోవడం కాదని, మనం మంచి స్నేహితులుగా ఉందామనడంతో ఆమె నిర్ఘాంతపోయింది.



తను వేసుకునే మాత్రలు అయిపోయాయ‌ని, అవి వేసుకోకపోతే తలనొప్పి, నోటివెంట సొంగ పడుతుందన్నాడు. తనకు ఆరోగ్యం బాగోలేదు. మానసిక స్థితి సరిగాలేదంటూ తెలపడంతో ఈ విషయాన్ని యువ‌తి తల్లిదండ్రులకు చెప్పింది.  వాళ్లు వచ్చి ఆమె అత్తను ప్రశ్నించారు. దీంతో ఆమె త‌న కుమారుడు ఆరోగ్యవంతుడేనని, తలనొప్పికి మాత్రలు వేసుకుంటున్నాడు కావాలంటే తాము చికిత్స చేయించుకునే వైద్యుడిని అడగండంటూ జీజీహెచ్‌ పర్యవేక్షకులుగా పని చేసి ఉద్యోగ విరమణ పొందిన వైద్యులతో ఫోన్ మాట్లాడించింది. వైద్యుడిని ప్ర‌శ్నించారు.

ఆ వైద్యుడు చెప్పిన విష‌యాల‌కు వారు షాక్ కు గుర‌య్యారు. యువకుడికి మానసిక స్థితి బాగాలేదని, మందులు వాడకపోతే ప్రమాదమని, వ్యాధి తీవ్రమవుతుందని తెలిపాడు. దీంతో అత్త‌ను ప్ర‌శ్నిస్తే గొడ‌వ పెట్టుకుంటుంద‌ని ఈ విష‌యంపై నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశామ‌ని తన అత్తకు ఉన్న పరిచయాలతో కేసును తప్పుదోవ పట్టించడానికి యత్నిస్తుందని తెలిపింది. తనను మభ్యపెట్టి మానసిక రోగి, సంసారానికి పనికిరాని వ్యక్తితో వివాహం చేసి మోసగించిన అత్త, భర్త, మధ్యవర్తిపై క్రిమినల్‌ చర్యలు తీసుకొని న్యాయం చేయాలని వేడుకున్నారు.



హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ సినీ గేయ రచయిత..!

చిక్కుల్లో ఆర్‌ఆర్‌ఆర్‌..ఆ ఛానల్‌ అధినేతతో లింకులు ?

ఏపీజే అబ్దుల్ కలాం 6వ వర్ధంతి నేడు..

కర్ణాటక నెక్స్ట్ సీఎం ఎవరు?

సమంత సంతోషానికి కారణం అదేనా?

జగన్‌ను తిట్టడానికి రూ.8 కోట్లు బేరం.. ఆ ఛానల్ బంపర్‌ ఆఫర్‌..?

ఫోన్‌ హ్యాకింగ్‌ చేస్తున్నామన్న సీఎం.. బయటపెట్టిన పత్రికాధిపతి..?

ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ : నిర్మలమ్మతో వైసీపీ ఎంపీల భేటీ !

విజయం మీదే: మనిషి గెలుపుకు మూల సూత్రాలివే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>