PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/carona-vaccination09db0c57-6565-4f49-8892-0653e6a380e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/carona-vaccination09db0c57-6565-4f49-8892-0653e6a380e0-415x250-IndiaHerald.jpgటీకా కోసమని వెళ్తే... చావ బాదారు.. కరోనా మహమ్మారి తన సోకితే ప్రాణాలు తీస్తుందని తెలుసు కానీ ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి వెళ్లినా కూడా ప్రాణాలు తీసేసింది. ఈ విషాదకర ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ర్టంలోని బాగ్పట్ జిల్లాలో జరిగింది. వ్యాక్సిన్ తీసుకునేందుకు వెళ్లిన తనను పోలీసులు అడ్డుకున్నారని మనస్తాపానికి లోనైన ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఘటనకు బాధ్యత వహిస్తూ... అయిదుగురు పోలీసులపై కేసు నమోదు చేశారు. పశ్చిమcarona vaccination{#}police;Sucide;Coronavirus;Father;Uri;abhishekటీకా కోసమని వెళ్తే... చావ బాదారు..!టీకా కోసమని వెళ్తే... చావ బాదారు..!carona vaccination{#}police;Sucide;Coronavirus;Father;Uri;abhishekTue, 27 Jul 2021 17:00:00 GMTకరోనా మహమ్మారి తన సోకితే ప్రాణాలు తీస్తుందని తెలుసు కానీ ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి వెళ్లినా కూడా ప్రాణాలు తీసేసింది. ఈ విషాదకర ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ర్టంలోని బాగ్పట్ జిల్లాలో జరిగింది. వ్యాక్సిన్  తీసుకునేందుకు వెళ్లిన తనను పోలీసులు అడ్డుకున్నారని మనస్తాపానికి లోనైన ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఘటనకు బాధ్యత వహిస్తూ... అయిదుగురు పోలీసులపై  కేసు నమోదు చేశారు.


పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ లోని బాగ్ పట్ జిల్లాలో ఉన్న కరోనా టీకా కేంద్రానికి టీకా వేసుకునేందుకు వచ్చిన ఓ యువకుడితో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. అతడి ప్రాణాలు పోయేందుకు కారణమయ్యారు. టీకా కేంద్రంలో ఉన్న వైద్య సిబ్బంది తన పేరును పిలుస్తున్నారని చెప్పినా సరే వినిపించుకోకుండా పోలీసులు సదరు యువకుడిని అడ్డుకున్నారు. అంతే కాకుండా అతడిని చితకబాదారు. సంఘటన జరిగిన తర్వాత కూడా యువకుడి ఇంటికి వెళ్లి మరీ బాదారు. అడ్డొచ్చిన ఆ యువకుడి తల్లిపై కూడా దాడి చేశారు. దీంతో అవమానంగా ఫీలయిన ఆ యువకుడు గ్రామానికి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. పోలీసుల ఓవర్ యాక్షన్ వల్లే ఇలా జరిగిందని బాధిత యువకుడి తండ్రి వాపోయాడు. తన కొడుకును పోలీసులు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఆరోపించాడు. టీకా కేంద్రంలోనే కాకుండా ఇంటికి వచ్చి కూడా తన కొడుకు చావ బాదారని, అడ్డొచ్చిన తన భార్యను కూడా కొట్టారని ఆరోపించాడు. పోలీసులు ఇంటికి వచ్చి కొట్టడం వల్లే తన కొడుకు అవమాన భారంతో ఉరి వేసుకున్నాడని అన్నారు. తన కొడుకు మృతికి పోలీసులే బాధ్యత వహించాలని కన్నీటి పర్యంత మయ్యాడు. ఈ ఘటన జరిగిన  అనంతరం బాధితులు ఫిర్యాదు చేయగా... పది మంది పోలీసులను విధుల నుంచి తొలగించినట్లు బాగ్‌పట్ పోలీసు అధికారి అభిషేక్ సింగ్ పేర్కొన్నారు.


నేటి నుంచి తగ్గిన ప్లాట్ ఫామ్ టికెట్ ధరలు అమలు

‘మా’ ఎన్నికల్లో రెబల్ స్టార్.. ఈ సారి వెరీ టఫ్ ఫైట్..!

"రాధే శ్యామ్" లేట్... ఐదు సినిమాలకు కలిసొచ్చింది !!

మరోమారు కోర్ట్ కి బ్రిట్నీ స్పియర్స్

ర్యాంకులు చెప్పే గంభీరమైన వాయిస్ ఈయనదే.. మీకు తెలుసా ?

పెద్ద సినిమాల నిర్మాతలకు ఎందుకు ధైర్యం సరిపోవట్లే!!

బిగ్ బ్రేకింగ్: ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్...?

సీనియర్ నిర్మాత చేతిలో టాలీవుడ్

ఎమ్మెల్యే కొడుకుల పెళ్లి... ఆర్గనైజర్ అరెస్ట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>