PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/raghurama951af710-d517-41bc-ab64-00d30c524c0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/raghurama951af710-d517-41bc-ab64-00d30c524c0a-415x250-IndiaHerald.jpgరఘురామకృష్ణంరాజు తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన సొంత ఇమేజ్ మీద గెలవడం కష్టం. ఒకవేళ ఆయన బీజేపీ నుంచి పోటీ చేసినా నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఆ పార్టీకి బలం లేనందున అలాగూ విజయం సాధించలేరు. అయితే ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థి నాగబాబుకు రెండు లక్షల 50 వేల ఓట్లు పోలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన - బీజేపీ పొత్తు నేపథ్యంలో ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా రఘు రామ బరిలో ఉండాలి. అలాగే ఆయ‌న‌కు టిడిపి సపోర్ట్ కూడా ఉంటే ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిపై విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని సరిRaghurama krishnam raju{#}raghu;Kshatriya;narasapuram;Narsapur;Narsapuram;YCP;MP;Elections;Bharatiya Janata Party;central government;Andhra Pradesh;Yevaru;Telangana Chief Minister;Janasena;TDPన‌ర‌సాపురం ఉప ఎన్నిక‌ల్లో గెలుపు ర‌ఘురామ‌దే... అక్క‌డే ఉంది మ్యాజిక్ ?న‌ర‌సాపురం ఉప ఎన్నిక‌ల్లో గెలుపు ర‌ఘురామ‌దే... అక్క‌డే ఉంది మ్యాజిక్ ?Raghurama krishnam raju{#}raghu;Kshatriya;narasapuram;Narsapur;Narsapuram;YCP;MP;Elections;Bharatiya Janata Party;central government;Andhra Pradesh;Yevaru;Telangana Chief Minister;Janasena;TDPTue, 27 Jul 2021 11:48:00 GMTఏపీలో అధికార వైసీపీకి చెందిన నరసాపురం రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎంత హాట్ హాట్ గా మారారో తెలిసిందే. ప్రతి రోజు ముఖ్యమంత్రి జగన్ తో పాటు వైసీపీ ప్రభుత్వం లోని లోపాలను నిష్పక్షపాతంగా ఎత్తి చూపుతున్నారు. ఇటు ముఖ్యమంత్రి జగన్ తో పాటు వైసీపీ కీలక నేతలు అందరూ రఘురామకృష్ణంరాజు లోక్‌స‌భ సభ్యత్వాన్ని రద్దు చేయించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఎంపీ పదవిని రద్దు చేయించేందుకు ఏడాదికాలంగా వైసిపి నేతలు చేయ‌ని ప్రయత్నాలు అంటూ లేవు. లోక్ సభ స్పీకర్ కు వైసీపీ ఎంపీలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పీకర్ తో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం దీనిని చాలా లైట్ తీసుకుంటోంది. ఒకవేళ రఘురామకృష్ణంరాజు ఎంపీ పదవి కోల్పోయి నరసాపురంలో తిరిగి ఉప ఎన్నికలు వస్తే ఎవరు ? గెలుస్తారు... అక్కడ పరిస్థితి ఏంటన్న దానిపై చర్చలు అయితే ఈ ఏడాది కాలంగా నడుస్తున్నాయి.

రఘురామకృష్ణంరాజు తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన సొంత ఇమేజ్ మీద గెలవడం కష్టం. ఒకవేళ ఆయన బీజేపీ నుంచి పోటీ చేసినా నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఆ పార్టీకి బలం లేనందున అలాగూ విజయం సాధించలేరు. అయితే ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థి నాగబాబుకు రెండు లక్షల 50 వేల ఓట్లు పోలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన - బీజేపీ పొత్తు నేపథ్యంలో ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా రఘు రామ బరిలో ఉండాలి. అలాగే ఆయ‌న‌కు టిడిపి సపోర్ట్ కూడా ఉంటే ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిపై విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని సరికొత్త విశ్లేషణ వినపడుతోంది.

అంటే రఘురామకు అటు జనసేనతో పాటు ఇటు టిడిపి నుంచి కూడా సపోర్ట్ ఉంటే వైసీపీని సులువుగా ఓడించ‌వచ్చు అని అంటున్నారు. వైసీపీ ఇక్కడ ఎలాగూ తిరిగి క్షత్రియ వర్గానికి చెందిన వ్యక్తికి ఎంపి టిక్కెట్ ఇవ్వనుంది. అయితే నర్సాపురం పార్లమెంటు పరిధిలో కాపు సామాజిక వర్గం ఓటర్ల డామినేషన్ ఎక్కువ. జనసేన ద్వారా ఆ వర్గం ఓట్లు రాబట్టుకోవడంతో పాటు... టిడిపి సపోర్ట్ ఉంటే బిసి ఓట్లు పోల‌రైజేష‌న్‌ చేయించుకోవటం ద్వారా రఘురామ సంచలన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈక్వేషన్ ఎంతవరకు ? సెట్ అవుతుందో చెప్పలేం..!





ద‌ళితుల‌కు 50ల‌క్ష‌లు ఇవ్వాలి..?

న‌ర‌సాపురంలో జ‌న‌సేన‌, టీడీపీ స‌పోర్ట్ ఉంటే ర‌ఘ‌రామ‌దే గెలుపు ?

మూడు పెళ్లిళ్లు చేసుకున్న కూడా చివరిదాకా జయంతి ఒంటరి ప్రయాణం

వైసీపీ మామ‌, అల్లుడికి జ‌గ‌న్ మార్క్ షాక్ ?

ఉప ఎన్నిక.. కెసిఆర్ నిర్ణయం తర్వాతే రేవంత్ డెసిషన్?

జ‌గ‌న్ కేబినెట్లో ముగ్గురు మ‌హిళా మంత్రులు.. బ‌య‌ట‌కు వెళ్లేదెవ‌రు ?

మనీ : త్వరలో డిగ్రీ విద్యార్థుల ఖాతాలో డబ్బు జమ..

నాలుగు నెలల తర్వాత కరోనా విషయంలో గుడ్ న్యూస్!

పీకే అయితే ఏంటి.. కరోనా ఇక్కడ!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>