Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/shankarb181b7db-73c8-4c61-94a7-21611ea25c23-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/shankarb181b7db-73c8-4c61-94a7-21611ea25c23-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఆగష్టు నెల చివరకు షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రారంభించి సుమారు రెండున్నర సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తైన వెంటనే ఇండియన్ జేమ్స్ కామెరూన్ శంకర్ సినిమాలో నటించడానికి రాంచరణ్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. Shankar{#}lyca productions;Cameroon;Bharateeyudu 2;Bharateeyudu;dil raju;ram pothineni;thaman s;shankar;Indian;RRR Movie;Hero;Rajamouli;August;October;september;producer;Producer;Ram Charan Teja;News;Coronavirus;Cinemaపాటతో ప్రారంభం కానున్న శంకర్, రాంచరణ్ సినిమా..!పాటతో ప్రారంభం కానున్న శంకర్, రాంచరణ్ సినిమా..!Shankar{#}lyca productions;Cameroon;Bharateeyudu 2;Bharateeyudu;dil raju;ram pothineni;thaman s;shankar;Indian;RRR Movie;Hero;Rajamouli;August;October;september;producer;Producer;Ram Charan Teja;News;Coronavirus;CinemaTue, 27 Jul 2021 21:45:00 GMTటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఆగష్టు నెల చివరకు షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రారంభించి సుమారు రెండున్నర సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తైన వెంటనే ఇండియన్ జేమ్స్ కామెరూన్ శంకర్ సినిమాలో నటించడానికి రాంచరణ్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా ప్రారంభం కావడానికి కొన్ని సమస్యలు అడ్డుపడుతున్నాయి. అవి ఇంకా తీరలేదని తెలుస్తోంది. శంకర్ కమలహాసన్ హీరోగా భారతీయుడు2 సినిమాను మొదలుపెట్టాడు. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది.కొన్ని కారణాల వల్ల శంకర్ ఆ సినిమాను మధ్యలో ఆపివేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను వెంటనే పూర్తి చేయాలని భారతీయుడు -2 నిర్మాణ సమస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ కోర్ట్ లో కేసు వేయడం జరిగింది.కోర్టులో శంకర్ కు అనుకూలంగా తీర్పు వచ్చినా లైకా ప్రొడక్షన్స్ వివిధ మార్గాల ద్వారా రామ్ చరణ్ శంకర్ సినిమాను ఆపివేసే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం అందింది.

నిర్మాతల మండలి తాజాగా కరోనా ప్రభావం దృష్ట్యా చివరి దశలో ఉన్న సినిమాల షూటింగ్ పూర్తి చేయాలని ఆ సినిమాలు విడుదల అయ్యే వరకు కొత్త సినిమాలను మొదలుపెట్టకూడదని ప్రతిపాదన చేసింది. ఈ నిబంధనను అడ్డం పెట్టుకుని రామ్ చరణ్,శంకర్ సినిమాకు ఇబ్బందులు సృష్టించాలని లైకా ప్రొడక్షన్స్ అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.శంకర్ పై ఈ నిబంధన వల్ల తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని సమాచారం. దిల్ రాజు లేదా శంకర్ లైకా ప్రొడక్షన్స్ తో రాజీకి వచ్చి ఈ సమస్య పరిష్కారం చేస్తే రెండు సినిమాలు పూర్తి అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి.లైకా ప్రొడక్షన్స్ శంకర్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ విషయంలో నిర్మాత దిల్ రాజుపై కూడా పరోక్షంగా ఒత్తిడిని సృష్టిస్తుంది అని సమాచారం. షూటింగ్ ప్రారంభం కాకముందే సమస్యను పరిష్కరించుకుంటే మంచిదని రామ్ చరణ్ అభిమానులు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. వివాదాల వల్ల సినిమా ఫలితంపై కూడా ప్రభావం పడే అవకాశం అయితే ఉన్నట్లుదందని రామ్ చరణ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా అన్ని కుదిరితే ఈ సినిమా అక్టోబర్ లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయితే మొదట హీరో ఇంట్రడక్షన్ సాంగ్ తో సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం అందింది. ఈ సినిమాలో రాంచరణ్ రెండు విభిన్న పాత్రలలో కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమా తెలుగు నేటివిటికి తగ్గట్టుగా ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించనున్నాడు. అన్ని సమస్యలు సెప్టెంబర్ లోపు పూర్తి చేసుకుని అక్టోబర్ లి షూటింగ్ స్టార్ట్ చేయాలి అని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఈ సినిమా షూటింగ్  అక్టోబర్ లో ప్రారంభం అవుతుందో లేదో చూడాలి.



రమ్యకృష్ణ కి హ్యాండ్ ఇచ్చిన నాగ్.. ఆమె స్థానంలో మరో హీరోయిన్..?

ప్రభాస్ ప్రాజెక్ట్ Kలో సమంత.. నెగటివ్ టచ్ తో మరోసారి..!

బాలీవుడ్ డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి .... ??

'రాధే శ్యామ్' కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించేది అప్పుడే..?

టీమిండియా ప్లేయర్ కు కరోనా.. రెండో టీ20 వాయిదా

వార్త పేపర్లకు తగ్గిన ఆదరణ.. ఆన్ లైన్ వార్తలకే మొగ్గుచూపుతున్న జనాలు..?

పక్కా ప్లాన్ ప్రకారమే దాడి?

తెలుగు రాజకీయాలకు ఆగస్టు నెలకు అవినాభావ సంబంధం ఉంది. 1984 ఆగస్ట్ నెలలోనే ఎన్టీయార్ కి తొలి వెన్నుపోటు జరిగింది. అది జరిగిన పదకొండేళ్ళకు అంటే 1995 ఆగస్ట్ నెలలోనే సొంత అల్లుడు చంద్రబాబు నుంచి ఎన్టీయార్ కి తిరుగుబాటు ఎదురైంది. ఈ రెండు ఘటనలూ ఏపీ రాజకీయాలనే కాదు జాతీయ రాజకీయాలను చాలా తీవ్రంగా ప్రభావితం చేశాయి.

ఆగస్ట్ నుంచి అసలు కధ .... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>