PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjpa8821c08-3cf0-4af0-a603-0d1ed057abcc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjpa8821c08-3cf0-4af0-a603-0d1ed057abcc-415x250-IndiaHerald.jpgజాతీయ ర‌హ‌దారుల అభివృద్ధి విష‌యంలో మాత్ర‌మే త‌మ‌కు సంబంధం ఉంటుంద‌ని. వాటి స‌మీపంలో మ‌ద్యం దుకాణాల ఏర్పాటు, తొల‌గింపులో త‌న నియంత్ర‌ణ లేద‌ని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అయితే గ‌తంలోనే జాతీయ రహదారులకు సమీపంలో మద్యం దుకాణాల ఏర్పాటుపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీచేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌లో జాతీయ రహదారికి క‌నీసం 500 మీటర్ల దూరంలో మ‌ద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ క్ర‌మంలో జాతీయ రహదారులకు సమీపంలో ఉండే మద్యం దుకాణాల తొలగింపు అంశంపై పార్లమెంbjp{#}Population;Minister;central government;media;local languageఆ మ‌ద్యం షాపులతో త‌న‌కు సంబంధం లేదు.. కేంద్ర మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు..!ఆ మ‌ద్యం షాపులతో త‌న‌కు సంబంధం లేదు.. కేంద్ర మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు..!bjp{#}Population;Minister;central government;media;local languageTue, 27 Jul 2021 09:55:07 GMT జాతీయ ర‌హ‌దారుల అభివృద్ధి విష‌యంలో మాత్ర‌మే త‌మ‌కు సంబంధం ఉంటుంద‌ని. వాటి స‌మీపంలో మ‌ద్యం దుకాణాల ఏర్పాటు, తొల‌గింపులో త‌న నియంత్ర‌ణ లేద‌ని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అయితే గ‌తంలోనే జాతీయ రహదారులకు సమీపంలో మద్యం దుకాణాల ఏర్పాటుపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీచేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌లో జాతీయ రహదారికి క‌నీసం 500 మీటర్ల దూరంలో మ‌ద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ క్ర‌మంలో జాతీయ రహదారులకు సమీపంలో ఉండే మద్యం దుకాణాల తొలగింపు అంశంపై పార్లమెంట్‌లో చ‌ర్చ‌కు రాగా కేంద్ర‌మంత్రి ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

 రాజ్య‌స‌భ‌లో ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా మంత్రి మాట్లాడుతూ.. మ‌ద్యం దుకాణాల‌ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం సేకరించదని.. అది కేవలం రాష్ట్రాలకు చెందిన అంశమని  ఆయ‌న పేర్కొన్నారు. జాతీయ ర‌హ‌దారుల అభివృద్దికి సంబంధించిన విషయాల్లో మాత్ర‌మే కేంద్రం జోక్యం చేసుకుంటుంద‌ని వివ‌రించారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడం, తొలగింపులపై ఇప్పటికే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింద‌ని ఈ సంద‌ర్భంగా నితిన్‌ గడ్కరీ గుర్తు చేశారు. రహదారులకు క‌నీసం 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసేలా స్పష్టమైన ఆదేశాలున్నాయని తెలిపారు.

  ఒకవేళ 20 వేలు లేదా అంతకంటే తక్కువ జనాభా ఉండే స్థానిక పంచాయతీల పరిధిలో క‌నీసం 220 మీటర్ల దూరంలోపు మ‌ద్యం దుకాణం ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల‌ని సూచించారు. అంతేగాక మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్‌ 185 ప్రకారం, మ‌ద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, శిక్ష ఉంటాయని నితిన్ గ‌డ్కరి గుర్తు చేశారు. డ్రంకెన్ డ్రైవ్‌ ప్రమాదాలపై ప్రజల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అవగాహన కార్యక్రమాలను చేప‌ట్టిన‌ట్టు ఆయ‌న తెలిపారు.


 2019లో దేశ‌వ్యాప్తంగా  4.49 లక్షల రోడ్డు ప్రమాదాలు జ‌రిగాయ‌ని ఆ ప్ర‌మాదాల్లో మొత్తం 1,51,113 మంది మ‌ర‌ణించిన‌ట్టు గడ్కరీ రాజ్యసభలో వెల్లడించారు. అంతకుముందు ఏడాది (2018)తో పోలిస్తే ప్రమాదాలు, మరణాల సంఖ్య స్వల్పంగా తగ్గాయని తెలిపారు. ముఖ్యంగా అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్‌రూట్‌లో వాహనం నడపడం, డ్రైవింగ్‌ సమయంలో మొబైల్‌ ఫోన్లు వాడడం వల్లే ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయని కేంద్రమంత్రి తెలిపారు.



"ఆదిపురుష్" హీరోయిన్ కు షాక్... అసలేంటిది ?

వాళ్లే జ‌గ‌న్‌ కొంప‌ముంచేస్తారా... వైసీపీలో తీవ్ర చ‌ర్చ‌..!

ఉప్పెన దర్శకుడి కి ఇప్పటికీ కనువిప్పు కలిగిందా!!

బ్రేకింగ్ : 'ఆర్ఆర్ఆర్' మూవీ నుండి బిగ్ అనౌన్స్ మెంట్ .... !!

దేశంలో ఐదున్నర లక్షల ఇంజినీరింగ్ సీట్ల మాయం..!

నిర్మల్ నీటిలో మునగడానికి ఆ మంత్రే కారణమా..?

అసోం-మిజోరం గొడవ.. తప్పంతా కేంద్రానిదే..

అమెరికా ఆందోళనకు ఇండియా ధీటైన సమాధానం..?

అత్తింటివారిపై న‌వ వ‌ధువు కేసు.. తొలిరాత్రి భ‌ర్త చేసిన ఆ ప‌నితో..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>