MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/beautiful-girl-wanted-mega-brothers-offer01bf0455-8c0e-4ba6-b2e2-21568d9c9577-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/beautiful-girl-wanted-mega-brothers-offer01bf0455-8c0e-4ba6-b2e2-21568d9c9577-415x250-IndiaHerald.jpgమెగాసోదరులకు కొత్త కష్టమొచ్చింది. కొత్త సినిమాలకు వరుసగా సంతకాలు పెట్టుకుంటూ పోతున్నారు. షూటింగ్ స్పాట్ లలో బిజీబిజీగా గడుపుతున్నారు. తీరా చూస్తే వారి సరసన ఒక అమ్మాయి లేకపోయే సరికి దిగాలుగా ఉన్నారు. అర్జంట్ గా ఒక అందమైన అమ్మాయి కావాలట. Beautiful girl wanted Mega Brothers offer{#}Khaidi.;Khaidi new;Mohanlal;Kshanam;Chiranjeevi;Pawan Kalyan;kalyan;Darsakudu;Director;Remake;Tollywood;Heroine;Samantha;Cinemaఅందమైన అమ్మాయి కావలెను.. మెగా బ్రదర్స్ ఆఫర్..!అందమైన అమ్మాయి కావలెను.. మెగా బ్రదర్స్ ఆఫర్..!Beautiful girl wanted Mega Brothers offer{#}Khaidi.;Khaidi new;Mohanlal;Kshanam;Chiranjeevi;Pawan Kalyan;kalyan;Darsakudu;Director;Remake;Tollywood;Heroine;Samantha;CinemaMon, 26 Jul 2021 18:32:28 GMTమెగా సోదరులు.. మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ మాంచి జోరు మీదున్నారు. ఎవరికి షూటింగుల్లో గడుపుతూ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఏమని లాక్ డౌన్ ఎత్తివేశారో అప్పటి నుంచి షూటింగ్ స్పాట్ లలో ఉంటున్నారు. చిరంజీవి, అటు పవన్ కళ్యాణ్ పోటాపోటీగా టాప్ చైర్ ను అందుకునేందుకు ఆరాటపడుతున్నారు. అయితే ఎవరి ఇమేజ్ వారి సొంతం. ఎవరి అభిమానులు వారికే ఉన్నారు. ఎవరినీ తక్కువగా అంచనా వేయలేం. కానీ ఈ మెగా బ్రదర్స్ కు కొత్త సమస్య వచ్చింది. ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలోనని జుట్టుపీక్కుంటున్నారు.

మెగా స్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన దగ్గరి నుంచి తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు. చాలా గ్యాప్ వచ్చినా తనలో ఆ పవర్ తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు.  ఖైదీ నెంబర్ 150తో 150కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించి.. బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు. ఇంకేముందీ అదే ఊపుతో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. మాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టి.. కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమా అయిన లూసిఫర్ ని రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది కానీ.. మెగాస్టార్ సరసన నటించే ముద్దుగుమ్మ మాత్రం ఓకే కాలేదు.

అయితే మాలీవుడ్ మూవీ లూసిఫర్ లో నటించిన మోహన్ లాల్ సరసన హీరోయిన్ లేదు. కానీ టాలీవుడ్ విషయానికొస్తే..  'లూసిఫర్'లో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ సమకూర్చాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే చిరంజీవి పక్కన ఒక హీరోయిన్ క్యారెక్టర్‌ని డిజైన్ చేశాడట దర్శకుడు మోహన్‌రాజా. రెగ్యులర్ హీరోయిన్ రోల్‌కి కొంచెం తక్కువగా, ఎక్స్‌టెండెడ్ కామియోకి ఎక్కువ అన్నట్లు ఉంటుందట హీరోయిన్ రోల్. ఈ క్యారెక్టర్‌ కోసం నయనతారని కాంటాక్ట్ చేస్తున్నారని, నయన్‌ భారీ రెమ్యునరేషన్‌ డిమాండ్ చేస్తోందని అంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ చేస్తున్నాడు. ఈ సిినిమాను చాలా ప్రిస్టీజియస్ గా తీసుకున్నాడు పవన్ కళ్యాణ్య. ఈ మూవీలో పవన్‌ స్టార్ కు జోడీగా మొదట సాయి పల్లవిని తీసుకోవాలనుకున్నారు. కానీ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత నిత్యామీనన్‌, సమంత పేర్లు వినిపించాయి. అయితే మేకర్స్ ఇంకా హీరోయిన్ ఎవరనేది అఫీషియల్‌గా ప్రకటన చేయలేదు.  



టాలీవుడ్ మొదటి సినిమా వచ్చేస్తోంది !

బిగ్ బ్రేకింగ్ : దిమ్మతిరిగే ధరకు అమ్ముడైన 'ఆర్ఆర్ఆర్' ఆడియో రైట్స్

రామారావుని పక్కన పెట్టి 'ఖిలాడి' సెట్ లో అడుగుపెట్టిన రవితేజ..!!

అర్జున్ రెడ్డీలో ముందుగా అనుకుంది.. షాలిని పాండే ని కాదట ఎవరినంటే?

ఇకనైనా సీనియర్ హీరోలు ధోరణి మారుస్తారా ?

ఆహుతి సినిమా షూటింగ్ లో రాజశేఖర్ కి ఏం జరిగింది ..?

ఆడవాళ్లు మీకు జోహార్లు.. షూటింగ్ పిక్ లీక్ చేసిన రష్మిక..!

రష్మిక మ్యానేజ్ చేయలేక చస్తుందట.. ఒకేసారి అక్కడ ఇక్కడ..?

బాలీవుడ్ లో చెలరేగుతున్న పోర్నోగ్రఫీ మంటలు.. ఆ సీన్స్ ఉంటే అంతే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>