SmaranaDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/smarana/137/vijaya-nirmala4dc8d25d-52b2-42e8-bcc4-cc7118a312e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/smarana/137/vijaya-nirmala4dc8d25d-52b2-42e8-bcc4-cc7118a312e0-415x250-IndiaHerald.jpgప్రముఖ నటిగా ,దర్శక నిర్మాత గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయనిర్మల, కొన్ని రచనలకు కూడా బాగా ప్రసిద్ధి చెందింది. మహిళా దర్శకురాలిగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న విజయనిర్మల, దాదాపు తెలుగులో నలభై నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించడం అంటే అది అంత ఆషామాషీ కాదు. ఇక అంతే కాదు ఈమె తెలుగు మహిళగా అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో కూడా ఈమె పేరును నమోదు చేయడం జరిగింది. ఈమె తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను 2008వ సంవత్సరంలో.. ఈమెను గొప్ప సేవకురVIJAYA NIRMALA{#}Naresh;allari naresh;Hanu Raghavapudi;K E Krishnamurthy;February;venkaiah naidu;producer;Producer;Father;krishna;Tamil;Telugu;Cinemaస్మరణ : దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కెక్కిన నటి..స్మరణ : దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కెక్కిన నటి..VIJAYA NIRMALA{#}Naresh;allari naresh;Hanu Raghavapudi;K E Krishnamurthy;February;venkaiah naidu;producer;Producer;Father;krishna;Tamil;Telugu;CinemaMon, 26 Jul 2021 07:00:00 GMTప్రముఖ నటిగా ,దర్శక నిర్మాత గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయనిర్మల, కొన్ని రచనలకు కూడా బాగా ప్రసిద్ధి చెందింది. మహిళా దర్శకురాలిగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న విజయనిర్మల, దాదాపు తెలుగులో నలభై నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించడం అంటే అది అంత ఆషామాషీ కాదు. ఇక అంతే కాదు ఈమె తెలుగు మహిళగా అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో కూడా ఈమె పేరును నమోదు చేయడం జరిగింది. ఈమె తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను 2008వ సంవత్సరంలో.. ఈమెను గొప్ప సేవకురాలిగా గుర్తించి, రఘుపతి వెంకయ్య అవార్డును కూడా  ప్రధానం చేయడం జరిగింది.

విజయనిర్మల తెలుగు కుటుంబానికి చెందినప్పటికీ తమిళనాడులో స్థిరపడడం జరిగింది. ఇక 1946 సంవత్సరం ఫిబ్రవరి 20 వ తేదీన జన్మించిన విజయనిర్మల, తండ్రి కూడా ఒక సినీ నిర్మాత. ఇక ఈమె సోదరి రావుబాలసరస్వతి కూడా మంచి గాయకురాలిగా గుర్తింపు పొందింది. ఇక ఈ వైవాహికక విషయానికి వస్తే, మొదట కృష్ణ మూర్తి ని వివాహం చేసుకోగా వీరికి నరేష్ జన్మించాడు. అయితే కొన్ని కారణాల చేత ఆమె కృష్ణమూర్తి నుంచి విడాకులు తీసుకొని , ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ను వివాహమాడింది.
ఇక బాల్యంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ చిత్రంలో కి అరంగేట్రం చేసింది విజయ నిర్మల. 11 సంవత్సరాల వయసులో పాండురంగ మహత్యం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అంతేకాదు ఈమె మలయాళం చిత్రాలలో కూడా నటించి,అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకుంది. తెలుగులో, మలయాళంలో, తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయనిర్మల, దర్శకురాలిగా కూడా మంచి గుర్తింపు ఉంది. అంతే కాదు కొన్ని చిత్రాలకు రచయితగా కూడా పని చేసింది. ఇక నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించింది. చివరిగా 2019 జూన్ 27వ తేదీన 73 సంవత్సరాల వయసులో హైదరాబాదులో గచ్చిబౌలిలో ఉన్న కాంటినెంటల్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించింది.






ప్రభాస్‌కు ఊపిరి పోసిన సినిమా ఇదేనంట..!?

కైకాల ఇంటికెళ్లిన చిరు & సతీమణి.. కారణం ?

మ‌న రామప్పకు ప్ర‌పంచ ఖ్యాతి...

మహానటి సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..!?

చత్రపతి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..!?

టీవీ : రోహిణి బుల్లితెర పైకి ఎలా వచ్చిందో తెలుసా..?

పవర్ స్టార్ సరసన త్రిష లక్కీ ఛాన్స్..!

ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్ అడుగులు.. ఆ పార్టీ వైపే.. ఇదిగో సాక్ష్యం..?

తిమ్మరసు ట్రైలర్ లాంచ్ చేయనున్న స్టార్ హీరో?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>