MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chaild-artist-c6ebbb3c-d132-4855-8db8-7d188f6bb8ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chaild-artist-c6ebbb3c-d132-4855-8db8-7d188f6bb8ce-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించినవారు పెద్దయ్యాక ఎలా ఉంటారో తెలుసుకోవాలని అందరికి కుతూహలంగా ఉంటుంది. ఈ తరుణంలోనే గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు వారిని ఏదైనా న్యూస్ పేపర్లలో కనిపిస్తే తప్ప ఇలాగ ఉన్నారని మనకు తెలియదు. ఇక ప్రస్తుత సమాజంలో అలా కాదు.. సోషల్ మీడియాలో వాడకం పెరిగిపోయింది. chaild artist {#}Rajamouli;media;Office;Prabhas;Tollywood;Cinemaచత్రపతి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..!?చత్రపతి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..!?chaild artist {#}Rajamouli;media;Office;Prabhas;Tollywood;CinemaMon, 26 Jul 2021 06:05:00 GMTఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించినవారు పెద్దయ్యాక ఎలా ఉంటారో తెలుసుకోవాలని అందరికి కుతూహలంగా ఉంటుంది. ఈ తరుణంలోనే గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు వారిని ఏదైనా న్యూస్ పేపర్లలో కనిపిస్తే తప్ప ఇలాగ ఉన్నారని మనకు తెలియదు. ఇక ప్రస్తుత సమాజంలో అలా కాదు.. సోషల్ మీడియాలో వాడకం పెరిగిపోయింది. ఇక సెలెబ్రెటీలు అందరు సోషల్ మీడియాలో యాటివ్ గా ఉంటున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా చత్రపతి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ మూవీలో సూరీడుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ కోసం ప్రభాస్ తన బాడీ లుక్ మొత్తం మార్చుకొని బాక్స్ ఆఫీసు వద్ద నిర్మాతలకు లాభాలను తీసుకొచ్చాడు. ఇక ప్రభాస్ సినీ జీవితంలో అత్యధిక సెంటర్లలో సెంచరీ కొట్టిన సినిమా ఏదైనా ఉందంటే అది చత్రపతి సినిమా అని చెప్పాలి.

అయితే ఈ సినిమాలో సూరీడు పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూరీడు పాత్ర కొన్ని సీన్లలో కనిపించినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగా తీర్చిదిద్దారు రాజమౌళి. ఇక చత్రపతి మూవీ నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ అసలు పేరు భస్వంత్ వంశీ. ఈ చిత్రంలో కాట్రాజు సీన్లో భస్వంత్ అలియాస్ సూరీడు పాత్ర ఎంతగానో ప్రేక్షకుల హృదయాలను కలిచి వేస్తుంది. అంతేకాదు.. ఈ సన్నివేశం ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేయడానికి బాగా దోహదపడుతుంది.

ఇక చత్రపతి సినిమా తరువాత ఎక్కువగా సినిమాలలో కనిపించని భస్వంత్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. ఈ తరుణంలోనే విదేశాలలో చదువులు పూర్తి చేసుకుని వచ్చిన భస్వంత్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే భస్వంత్ తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నాడు.



పవర్ స్టార్ సరసన త్రిష లక్కీ ఛాన్స్..!

తిమ్మరసు ట్రైలర్ లాంచ్ చేయనున్న స్టార్ హీరో?

టాలీవుడ్ లో హాలీవుడ్ ట్రెండ్.. ఇక ఆగరు!!

థియేట‌ర్ స‌చ్చిపోతే నేనేమైపోతానో!

వానపాటలంటే వణుకు అంటున్న హాట్ బ్యూటీ..

రష్యాలో రాళ్ళపల్లి పెద్ద కూతురు మరణం వెనక అసలు కారణం ?

ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాలో సూపర్ కామెడీ ట్రాక్..!

నారప్పపై వెంకటేష్‌ ఎమోషనల్‌ ?

హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తున్న నోరా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>