PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/health32ec3e1d-54c4-4731-94cd-17d31357a9ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/health32ec3e1d-54c4-4731-94cd-17d31357a9ea-415x250-IndiaHerald.jpgమారుతున్న కాలం పుణ్యమా అని ఇప్పడు పెళ్లిళ్లు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. చాలా మంది 30ల్లో అడుగుపెట్టిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. కొందరు పాతికేళ్లకే పెళ్లి చేసుకున్నా.. కేరియర్, సెటిల్ కాలేదన్న ఫీలింగ్.. ఇలాంటి వాటితో అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారు. ఇంకొందరు అప్పుడే పిల్లల గోల ఎందుకు.. కొన్నాళ్లు ఎంజాయ్ చేద్దామనుకుంటారు. ఇలా చాలా మంది సంతానాన్ని వాయిదా వేసుకుంటున్నారు. అయితే.. అలా ఆలస్యం చేయడం ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. మారుతున్న పరిస్థితుల health{#}santhanam;Yuva;marriageకొత్తగా పెళ్లయితే ఆలస్యం వద్దు.. అసలుకే ముప్పు..!కొత్తగా పెళ్లయితే ఆలస్యం వద్దు.. అసలుకే ముప్పు..!health{#}santhanam;Yuva;marriageMon, 26 Jul 2021 09:00:00 GMTపెళ్లి చేసుకుంటున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. కొందరు పాతికేళ్లకే పెళ్లి చేసుకున్నా.. కేరియర్, సెటిల్ కాలేదన్న ఫీలింగ్.. ఇలాంటి వాటితో అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారు. ఇంకొందరు అప్పుడే పిల్లల గోల ఎందుకు.. కొన్నాళ్లు ఎంజాయ్ చేద్దామనుకుంటారు. ఇలా చాలా మంది సంతానాన్ని వాయిదా వేసుకుంటున్నారు.


అయితే.. అలా ఆలస్యం చేయడం ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా.. గర్భధారణను వాయిదా వేయొద్దని సూచిస్తున్నారు. అనేక కారణాల రీత్యా స్త్రీ, పురుషుల్లో వీర్య, అండోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోందని.. అందుకే యువ దశలోనే సంతానోత్పత్తి శ్రేయస్కరమని సూచిస్తున్నారు. కొందరు దంపతులు అండాలను నిల్వ చేసుకొని, తర్వాత వినియోగించుకోవాలనుకుంటున్నారని ఇది అభిలషణీయం కాదంటున్నారు.


అందుకే.. సాధ్యమైనంత వరకూ గర్భధారణను వాయిదా వేయొద్దంటున్నారు. పెళ్లయిన కొత్తలోనే గర్భం దాల్చడమే అన్ని విధాలా శ్రేయస్కరమని వివరిస్తున్నారు. అంతే కాదు..ఏటేటా గర్భధారణ సమస్యలు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందట. ఇది ఏటా 5-10 శాతం దాకా పెరుగుతోందని నిపుణలు చెబుతున్నారు. అటు పురుషుల్లోనూ ఇదే పరిస్థితి. 40 ఏళ్ల కిందట వీర్యకణాల సంఖ్య 10 కోట్లు ఉందట. ఇప్పడు చూస్తే అది కేవలం 5 కోట్లకు చేరిందట. అండోత్పత్తిలో తగ్గుదల గతంలో 1-2 శాతం మంది మహిళల్లో ఉండేదట. ఇప్పుడేమో అది 10 శాతం మందిలో కనిపిస్తోందట.


అందుకే.. గతంలో పెద్దలు ఏ వయస్సుకు ఆ ముచ్చట అనేవారు.. ఆ సిద్దాంతం ఫాలో కావడమే బెటర్ అంటున్నారు నిపుణులు. ఎలాంటి కారణాలు ఉన్నా.. పెళ్లయిన కొత్తలోనే ఇద్దరు పిల్లలను కనేస్తే.. ఆ తర్వాత పిల్లలు పుట్టలేదని డాక్టర్ల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని సూచిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఆరుగురు దంపతుల్లో ఒకరు సంతానం కలగక ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పటి కంటే ఇప్పుడు ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతోందంటున్నారు.





ముగ్గురితో కానిచ్చేసింది.. ఇపుడు నా కొడుకుతోనా..?

మారుతున్న పరిస్థితుల దృష్ట్యా.. గర్భధారణను వాయిదా వేయొద్దని సూచిస్తున్నారు. అనేక కారణాల రీత్యా స్త్రీ, పురుషుల్లో వీర్య, అండోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోందని.. అందుకే యువ దశలోనే సంతానోత్పత్తి శ్రేయస్కరమని సూచిస్తున్నారు.

ఆర్జీవి డైరక్షన్ లో రకరకాల భార్యలు..!

ఎన్టీఆర్ తో దూరం అందుకే.. రాజీవ్ కనకాల షాకింగ్ కామెంట్స్..

మేకప్ మ్యాన్ భార్యను పెళ్లాడిన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్

8 సిరీస్ లలో.. ఒక్క ఓటమి లేదు.. మరి నేడు?

పెళ్లి పై ఘాటుగా స్పందించిన రష్మీ..

ఇంగ్లాండు టూర్ కి ఆ ఇద్దరూ ఫిక్స్?

చోర్ బజార్.. ఆకాష్ పూరీ ఫస్ట్ లుక్ అదిరింది..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>