MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopalagopala415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopalagopala415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా చరిత్రలో మల్టీ స్టారర్ గా తెరకెక్కిన మంచి చిత్రాలలో "గోపాల గోపాల" ఒకటి. ఫ్యామిలీ అండ్ స్ట్రాటజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మెగా అభిమానులను, దగ్గుబాటి అభిమానులను విశేషంగా అలరించింది. మల్టీస్టారర్ అంటే కేవలం యాక్షన్, లేదా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే మూస ధోరణిని మార్చేసింది. సాధారణంగా ఇండియాలో విగ్రహాలను భక్తితో పూజించడమే కాకుండా బాబాలను కూడా గుడ్డిగా నమ్ముతుంటారు. ఇప్పటికే ఎంతోమంది దొంగబాబాలు, వారి లీలలు బయట పడినప్పటికీ జనాలు వారిని నమ్మడం ఏమాత్రం మానలేదు. భక్తి ముసుగులో దొంగ బాబాలుTop multi starrer ;{#}kalyan;prakruti;king;Remake;Thief;Earhquake;Donga;Chitram;Daggubati Venkateswara Rao;Venkatesh;ram pothineni;Hindi;court;Tollywood;Cinemaమల్టీ స్టారర్ ట్రెండ్ సెట్ చేసిన "గోపాల గోపాల"మల్టీ స్టారర్ ట్రెండ్ సెట్ చేసిన "గోపాల గోపాల"Top multi starrer ;{#}kalyan;prakruti;king;Remake;Thief;Earhquake;Donga;Chitram;Daggubati Venkateswara Rao;Venkatesh;ram pothineni;Hindi;court;Tollywood;CinemaMon, 26 Jul 2021 09:00:00 GMTతెలుగు సినిమా చరిత్రలో మల్టీ స్టారర్ గా తెరకెక్కిన మంచి చిత్రాలలో "గోపాల గోపాల" ఒకటి. ఫ్యామిలీ అండ్ స్ట్రాటజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మెగా అభిమానులను, దగ్గుబాటి అభిమానులను విశేషంగా అలరించింది. మల్టీస్టారర్ అంటే కేవలం యాక్షన్, లేదా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే మూస ధోరణిని మార్చేసింది. సాధారణంగా ఇండియాలో విగ్రహాలను భక్తితో పూజించడమే కాకుండా బాబాలను కూడా గుడ్డిగా నమ్ముతుంటారు. ఇప్పటికే ఎంతోమంది దొంగబాబాలు, వారి లీలలు బయట పడినప్పటికీ జనాలు వారిని నమ్మడం ఏమాత్రం మానలేదు. భక్తి ముసుగులో దొంగ బాబాలు అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటికే డేరా బాబా, గుర్మిత్ సింగ్, రామ్ రహీమ్ సింగ్ వంటి వారు నేరం నిరూపితం అవ్వడంతో శిక్ష అనుభవిస్తున్నారు. అప్పట్లో ఎంతోమంది గుడ్డిగా నమ్మిన ఈ దొంగ బాబాలు దోషులను తేలడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే దొంగ బాబాలు ఒక్క ఇండియాలోనే ఇంతలా రాజ్యమేలుతున్నారు. దానికి కారణం కూడా ప్రజల మూఢనమ్మకాలే. దేవుడిని నమ్మడం తప్పు కాదు కానీ ఆ ముసుగులో మూఢనమ్మకాల్లో కూరుకుపోయి, మూర్ఖులుగా మారడం తప్పు. వారు ప్రజల మూఢనమ్మకాలతో ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు? బాబాల ముసుగులో అసలేం జరుగుతుందనే విషయాన్ని "గోపాల గోపాల" ద్వారా స్పష్టంగా తెలియజెప్పారు.

సినిమాలో నాస్తికుడైన గోపాల్ రావు దేవుడి విగ్రహాలు అమ్ముతుంటారు. కానీ ఒక రాత్రి భూకంపం వచ్చి గోపాల్ రావు దుకాణం ఒక్కటే నేలమట్టం అవుతుంది. దీంతో అప్పులపాలైన గోపాల్ రావు తన దుకాణం బీమా కోసం అప్లై చేసుకుంటాడు. కానీ భీమా సంస్థ ఇది ప్రకృతి వల్ల సంభవించిందని, దేవుడు చేసిన నష్టానికి భీమా సంస్థ నష్టాన్ని చెల్లించలేదని సాకు చెబుతారు. అందుకే తనకు జరిగిన నష్టాన్ని దేవుడే భర్తీ చేయాలంటూ కోర్టుకెక్కుతాడు గోపాలరావు. న్యాయస్థానం సహాయంతో దేవాలయాలకు, ట్రస్టులకు సమన్లు పంపిస్తాడు. అక్కడినుంచి దేవుడు ముసుగులో వ్యాపారం చేస్తున్న కొంతమంది పెద్దమనుషులకు, గోపాల్ రావుకు మధ్య వివాదం రాజు కుంటుంది. మరోవైపు దేవుడుపైన కేసు వేయడంతో ఆయన ఫ్యామిలీ అతన్ని వదిలేస్తుంది. అంతేకాకుండా భక్తులంతా గోపాల్ రావును చంపాలని అనుకుంటారు. అప్పుడు దేవుడు రూపంలో దిగి వచ్చిన పవన్ కళ్యాణ్ అతనికి దిశా నిర్దేశం చేస్తాడు. మొత్తానికి దేవుడిని నమ్మండి. కాని దేవుడు రూపంలో వ్యాపారం చేస్తున్న మోసగాళ్ళను కాదు అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్, వెంకటేష్ నటించిన ఈ మల్టీ స్టారర్ టాలీవుడ్ లో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిలిచింది. కాగా ఈ చిత్రం 2012లో విడుదలైన హిందీ చిత్రం "ఓ మై గాడ్" కు రీమేక్ గా రూపొందింది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉండే మంచి ఎంటర్టైన్మెంట్, అలాగే సోషల్ మెసేజ్ ఉన్న అద్భుతమైన చిత్రం.





మల్టీ స్టారర్ గా వచ్చి సెన్సేషనల్ హిట్ కొట్టిన మూవీ..

హీరోల ఫ్యాన్స్ కు పెద్ద షాక్..! ఇంకొకరిని వెతుక్కోవాల్సిందే..!

'సలార్'లో ఐటెమ్ సాంగ్ చేయనున్న బాలీవుడ్ భామ ?

రాసిపెట్టుకో బాబూ..ఇదే రిపీట్!

ప్రభాస్‌కు ఊపిరి పోసిన సినిమా ఇదేనంట..!?

జగన్‌ బెయిల్‌ రద్దు విచారణ.. వైసీపీలో టెన్షన్‌ టెన్షన్‌..?

కైకాల ఇంటికెళ్లిన చిరు & సతీమణి.. కారణం ?

మహానటి సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..!?

స్మరణ : దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కెక్కిన నటి..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>