- Gully Rowdy Censored And All Set For A Massive Release In August (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గల్లీ రౌడీ’... ఆగస్ట్‌లో భారీ విడుదలకు సిద్ధం
యంగ్ అండ్ ఎనర్జిటి స్టార్ సందీప్‌కిషన్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం గల్లీరౌడీ
. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ సాధించిన ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల సక్సెస్‌లో కీలక పాత్రను పోషించిన స్టార్ రైటర్ కోన వెంకటన్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహిరించడమే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్ సమర్పణలో సీమశాస్త్రి, సీమటపాకాయ్, దేనికైనా రెఢీ, ఈడోరకం ఆడోరకం వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ను పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో నటించారు. నేహా శెట్టి హీరోయిన్.
ఇప్పటి వరకు ‘గల్లీ రౌడీ’ చిత్రం నుంచి విడుదలైన ‘పుట్టేనె ప్రేమ..’ అనే మాంటేజ్ లవ్ సాంగ్, ‘చాంగురే చాంగురే..’ అనే ఐటెమ్ సాంగ్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే సినిమా హిలేరియస్ ఎంటర్‌టైనర్ అని తెలియజేసేలా విడుదలైన టీజర్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉందంటూ ప్రశంసలు వచ్చాయి. సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గల్లీ రౌడీ’ సినిమాను ఆగస్ట్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
నటీనటులు:
సందీప్ కిషన్, రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహ, నేహా శెట్టి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, వైవా హర్ష, తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమా
సమర్పణ: కోన వెంకట్
దర్శకత్వం: జి.నాగేశ్వర్ రెడ్డి
నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ
సహ నిర్మాత: జి.వి
సంగీతం: చౌరస్తా రామ్, సాయికార్తీక్
స్క్రీన్ ప్లే: కోన వెంకట్
కథ: భాను
ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్
స్టైలిష్ట్: నీరజ కోన
పి.ఆర్.ఒ: వంశీ కాక
- Gully Rowdy Censored And All Set For A Massive Release In August (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)