MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raj-kundra-controversies-74b48326-1650-4229-b9aa-487fd12a4912-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raj-kundra-controversies-74b48326-1650-4229-b9aa-487fd12a4912-415x250-IndiaHerald.jpgవ్యాపారవేత్త రాజ్ కుంద్రా అశ్లీల కేసులో రోజుకో వార్త వెలుగులోకి వస్తోంది. కొంతమంది రాజ్ కుంద్రాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. మరికొంతమంది అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తాజాగా పోర్న్ ఫిల్మ్ రాకెట్ ఆరోపణలు ఎదుర్కొంటున్న తన్వీర్ హష్మి మీడియాతో మాట్లాడుతూ పోర్న్ అని పిలవలేని వీడియోలను మాత్రమే తాను తయారు చేస్తానని చెప్పాడు. రాజ్ కుంద్రా గురించి కూడా మాట్లాడారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆదివారం తన్వీర్ హష్మిని ప్రశ్నించింది. తన్వీర్ హష్మి మాట్లాడుతూ "నన్ను క్రైమ్ బ్రాంచ్ ప్రశ్నించింది. నేను అన్ని Raj Kundra Case;{#}raj;sunday;Sakshi;police;Mumbaiరాజ్ కుంద్రా కేసు : న్యూడిటీ మాత్రమే పోర్న్ కాదు... విచారణలో తన్వీర్ హష్మీరాజ్ కుంద్రా కేసు : న్యూడిటీ మాత్రమే పోర్న్ కాదు... విచారణలో తన్వీర్ హష్మీRaj Kundra Case;{#}raj;sunday;Sakshi;police;MumbaiMon, 26 Jul 2021 08:00:00 GMTవ్యాపారవేత్త రాజ్ కుంద్రా అశ్లీల కేసులో రోజుకో వార్త వెలుగులోకి వస్తోంది. కొంతమంది రాజ్ కుంద్రాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. మరికొంతమంది అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తాజాగా పోర్న్ ఫిల్మ్ రాకెట్ ఆరోపణలు ఎదుర్కొంటున్న తన్వీర్ హష్మి మీడియాతో మాట్లాడుతూ పోర్న్ అని పిలవలేని వీడియోలను మాత్రమే తాను తయారు చేస్తానని చెప్పాడు. రాజ్ కుంద్రా గురించి కూడా మాట్లాడారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆదివారం తన్వీర్ హష్మిని ప్రశ్నించింది.

తన్వీర్ హష్మి మాట్లాడుతూ "నన్ను క్రైమ్ బ్రాంచ్ ప్రశ్నించింది. నేను అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. రాజ్ కుంద్రా గురించి నన్ను అడిగినప్పుడు, నేను అతనిని ఎప్పుడూ కలవలేదని చెప్పాను. నేను వీడియోలను మాత్రమే తయారు చేసాను. కానీ అవి పోర్న్ కాదు. నన్ను ఇంతకుముందు అరెస్టు చేశారు. కాని నేను తప్పు చేయలేదు కాబట్టి నేను బెయిల్‌పై ఉన్నాను. చేసిన ఆరోపణలపై ఇంకేమీ మాట్లాడాలనుకోవట్లేదు. పోలీసులు దీనిపై తదుపరి దర్యాప్తు చేస్తున్నారు" అని తెలిపాడు.

ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి కావాలనే ప్రశ్నపై తన్వీర్ హష్మి మాట్లాడుతూ 'నేను నేరాన్ని చూడలేదు. కాబట్టి ఎలా సాక్షి అవుతాను. నేను తయారుచేసే కంటెంట్ పోర్న్ కాదు. నేను రాజ్ కుద్రా సంస్థతో నేరుగా ఎలాంటి సంబంధం లేదు నాకు. నేను 20-25 నిమిషాల షార్ట్ ఫిలిమ్స్ చేస్తాను. 2 నుండి 3 నిమిషాల నగ్నత్వం ఇందులో ఉంటుంది. దీన్ని పోర్న్ అని పిలవలేము" అన్నారు.

పోలీసు కేసుపై తన్వీర్ హష్మి మాట్లాడుతూ 'ఎందుకు కేసు చేశారని పోలీసులను అడగాలి. చాలా మంది ఓటిటి కంటెంట్‌ను తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక నియంత్రణ లేకపోతే, దానిని ఎలా తప్పు అని పిలుస్తారు. నేను ఎటువంటి తీర్పు ఇవ్వలేను, ఇవన్నీ చట్టం ద్వారా నిర్ణయించబడతాయి. నేను కోర్టులో నా పోరాటం చేస్తాను" అంటూ చెప్పుకొచ్చారు.



మ‌న రామప్పకు ప్ర‌పంచ ఖ్యాతి...

ఐపీఎల్ ఫేస్‌-2 తొలి మ్యాచ్‌లో ముంబైతో చెన్నై ఢీ

ఐపీఎల్‌-14 షెడ్యూల్‌ ప్రకటించిన బీసీసీఐ

అంతర్వేది బీచ్‌లో దారుణం.. మహిళ మృతి..!

వాచ్‌మెన్‌ వాంగ్మూలమే సీబీఐకి రామబాణం!

ఎటూ పాలుపోని పరిస్థితుల్లో యడ్యూరప్ప

ఆకతాయిల నిర్లక్ష్యం.. ఎంత పని చేశారో తెలుసా?

యషికా ఆనంద్ హెల్త్ అప్డేట్... తాగి డ్రైవ్ చేశారా ?

అరుదైన గుర్తింపు పొందిన 'రామప్ప'



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>