MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/salar-movie-gossip634c09a9-9f20-49a3-8e27-e98622fae9db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/salar-movie-gossip634c09a9-9f20-49a3-8e27-e98622fae9db-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ చేతిలో వరుస భారీ ప్రాజెక్టులు ఉండగా వాటిలో ఒకటి సలార్. కేజీఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కన్నడ సినిమా దర్శకుడు కెజీఫ్ చిత్రంతో మాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ వంటి ఇండస్ట్రీలలో సైతం తన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారుSALAR MOVIE GOSSIP{#}prasanth;prashanth neel;Prasanth Neel;Prashant Kishor;News;Hero;Kannada;India;Prabhas;Kollywood;Darsakudu;Heroine;Director;Tollywood;Kiara Advani;bollywood'సలార్'లో ఐటెమ్ సాంగ్ చేయనున్న బాలీవుడ్ భామ ?'సలార్'లో ఐటెమ్ సాంగ్ చేయనున్న బాలీవుడ్ భామ ?SALAR MOVIE GOSSIP{#}prasanth;prashanth neel;Prasanth Neel;Prashant Kishor;News;Hero;Kannada;India;Prabhas;Kollywood;Darsakudu;Heroine;Director;Tollywood;Kiara Advani;bollywoodMon, 26 Jul 2021 09:00:00 GMTపాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ చేతిలో వరుస భారీ ప్రాజెక్టులు ఉండగా వాటిలో ఒకటి సలార్. కేజీఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కన్నడ సినిమా దర్శకుడు కెజీఫ్ చిత్రంతో మాలీవుడ్,  టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ వంటి ఇండస్ట్రీలలో సైతం తన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఇపుడు ఈయన తీస్తున్న సలార్ చిత్రంపై కూడా అంతకుమించిన అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. తమ అభిమాన హీరో బాహుబలిని ఈ చిత్రంలో వారి  అంచనాలకు మించి  చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే విధంగా ప్రభాస్ క్రేజ్ ను దృష్టి లో ఉంచుకుని కథను అందుకు తగ్గట్లుగా డిజైన్ చేసి చిత్రీకరిస్తున్నారు ప్రశాంత్ నీల్. 

సెకండ్ వేవ్ కారణంగా వచ్చిన లాక్ డౌన్ లో కాస్త సమయం దొరకడంతో డైరెక్టర్ ప్రశాంత్ ఈ కథలో  కాస్త మార్పులు కూడా చేసినట్లు తెలిసిన విషయమే. ఫ్లాష్ బ్యాక్ కథలో కాస్త స్ట్రాంగ్ కంటెంట్ యాడ్ చేసినట్లు తెలుస్తోంది.  ఇక ఈ చిత్రంలో ప్రభాస్ పక్కన శ్రుతి హాసన్ హీరోయిన్ గా చేస్తుండగా, ఇందులో స్పెషల్ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ను ప్లాన్ చేస్తున్నారు. మొదట ఈ స్పెషల్ సాంగ్ కోసం కే జి ఎఫ్ హీరోయిన్ ని డైరెక్టర్ ఎంపిక చేసినట్లు వార్తలు వినిపించినా, ఇపుడు ఆ ప్లేస్ లో బాలీవుడ్ అందాల బామ కియరా అద్వానీ పేరు వినిపిస్తోంది.

ఈమె అయితే అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉందని, ఈ విషయము సినిమాపై  హైప్ తీసుకొస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సంప్రదింపులు జరిగాయని, కియారా ఈ సాంగ్ కోసం పారితోషికం భారీగానే డిమాండ్ చేసిందని సమాచారం. మరి ఈ అందాల బొమ్మ ప్రభాస్ పక్కన ఎలా ఉంటుందో చూడాలి..



హైదరాబాద్ సమీపం లో భూకంపం

డబ్బులు ఇస్తే పదవికి రాజీనామా చేస్తా.. కోమటిరెడ్డి సంచలనం ?

మల్టీ స్టారర్ గా వచ్చి సెన్సేషనల్ హిట్ కొట్టిన మూవీ..

మల్టీ స్టారర్ ట్రెండ్ సెట్ చేసిన "గోపాల గోపాల"

హీరోల ఫ్యాన్స్ కు పెద్ద షాక్..! ఇంకొకరిని వెతుక్కోవాల్సిందే..!

అమెరికాలో మిస్సైన భారతీయ బాలిక ఎక్కడ దొరికిందో తెలిస్తే షాకే..!

కార్గిల్ విజయ్ దివాస్ 2021.. భారతదేశానికి చెందిన సూపర్ హీరోస్..

క్వార్టర్స్‌ చేరిన భారత్‌ ఆర్చరీ పురుషుల జట్టు

హంగేరీలో సత్తా చాటిన ఆటగాళ్లు.. మోడీ ఏమన్నారంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>