MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movie-updatee90fe1e7-7655-4d5d-9f17-7dc0a8f48813-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movie-updatee90fe1e7-7655-4d5d-9f17-7dc0a8f48813-415x250-IndiaHerald.jpgభారత చలనచిత్ర పరిశ్రమంలో గొప్ప సందేశాత్మక డైరెక్టర్‌గా రాజ్ కుమార్ హిరానీ పేరు సంపాదించుకున్నారు. సెలబ్రిటీలందరూ ఒక్కసారైన రాజ్ కుమార్ డైరెక్షన్‌లో పని చేయాలనుకుంటారు. ‘మున్నా భాయ్ ఎంబీబీఎస్’ నుంచి మొదలుకుని ‘సంజు’ వరకు ప్రతీ సినిమాలో తనదైన శైలి విలక్షణత్వం మనకు కనబడుతుంది. వినోదం, సందేశం సమపాళ్లలో మిక్స్ చేసి ఆడియన్స్‌ను మైమరిపంచే సత్తా ఉన్న దర్శకుడు రాజ్ కుమార్. movie update{#}Deepika Padukone;nayana harshita;Raaj Kumar;atlee kumar;Kumaar;Darsakudu;raj;Romantic;News;Anandam;Director;Chitram;Cinema;Indiaసూపర్ హిట్ కాంబో.. ది గ్రేట్ డైరెక్టర్‌తో షారుఖ్ మూవీ..!సూపర్ హిట్ కాంబో.. ది గ్రేట్ డైరెక్టర్‌తో షారుఖ్ మూవీ..!movie update{#}Deepika Padukone;nayana harshita;Raaj Kumar;atlee kumar;Kumaar;Darsakudu;raj;Romantic;News;Anandam;Director;Chitram;Cinema;IndiaMon, 26 Jul 2021 16:50:00 GMTభారత చలనచిత్ర పరిశ్రమంలో గొప్ప సందేశాత్మక డైరెక్టర్‌గా రాజ్ కుమార్ హిరానీ పేరు సంపాదించుకున్నారు. సెలబ్రిటీలందరూ ఒక్కసారైన రాజ్ కుమార్ డైరెక్షన్‌లో పని చేయాలనుకుంటారు. ‘మున్నా భాయ్ ఎంబీబీఎస్’ నుంచి మొదలుకుని ‘సంజు’ వరకు ప్రతీ సినిమాలో తనదైన శైలి విలక్షణత్వం మనకు కనబడుతుంది. వినోదం, సందేశం సమపాళ్లలో మిక్స్ చేసి ఆడియన్స్‌ను మైమరిపంచే సత్తా ఉన్న దర్శకుడు రాజ్ కుమార్.
రణ్‌బీర్ కపూర్‌తో చేసిన ‘సంజు’ ఫిల్మ్ తర్వాత రాజ్ కుమార్ ఎవరితో సినిమా చేస్తారనే అంచనాలుండగా, తాజాగా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..

బాలీవుడ్ రొమాంటిక్ హీరో, బాద్ షా షారుఖ్ ఖాన్‌తో రాజ్ కుమార్ హిరానీ తన నెక్స్ట్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షారుఖ్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో ‘పఠాన్’ చిత్రం చేస్తున్నాడు. ఇందులో షారుఖ్ సరసన దీపికా పదుకునే నటిస్తోంది. షారుఖ్ ‘జీరో’ సినిమా తర్వాత ప్రేక్షకులకు వెండితెరపై కనిపించలేదు. ఈ క్రమంలోనే ఇండియాస్ ది బెస్ట్ డైరెక్టర్‌ రాజ్ కుమార్‌తో నెక్స్ట్ సినిమా ఉంటుందని తెలుసుకుని సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశముంది. కాగా, షారుఖ్-రాజ్ కుమార్ కాంబో కోసం బీ టౌన్ సెలబ్రిటీలు, అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లోనే రిలీజ్ ఉండబోతుందని తెలుస్తోంది. షారుఖ్‌కు కథ వినిపించేందుకు గాను ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో రాజ్ కుమార్ ఉన్నట్లు వినికిడి. ఇక ఈ సినిమాలో షారుఖ్ సరసస సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతుందనే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ‘పఠాన్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకున్నట్లు మూవీ యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే సదరు మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ బిగ్ ప్రాజెక్టు అనౌన్స్‌మెంట్ వచ్చే చాన్స్ ఉంది. రాజ్ కుమార్ డైరెక్షన్‌లో షారుఖ్ హీరోగా వచ్చే చిత్రం కోసం ఆలిండియా వైడ్ ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందేనని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.



మార్కెట్లో విడుదల కానున్న కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి ఫేస్‌లిఫ్ట్.. వివరాలు..

ఫిల్మ్ న‌గ‌ర్ టాక్ : నానీ డైరెక్ట‌ర్ తో బ‌న్నీ జ‌ర్నీ

మీరాబాయ్ బంగారు పతకం గెలుచుకోనుందా..?

వైరల్ వీడియో: వరుడిని వధువు ఇలా కూడా ఆట పట్టించొచ్చా..!

పవర్ స్టార్ పోలీస్ డ్రెస్ వేస్తే.. ఆ కిక్కే వేరబ్బా..!

రియల్ హీరోస్ పాత్రలో రీల్ హీరోస్ నటించిన చిత్రాలు..

"అర్జున్ రెడ్డి" ఫస్ట్ ఛాయస్ షాలిని కాదు... ఎవరంటే ?

పూర్తి ఫోకస్ సినిమాల మీదే.. మెహ్రీన్ స్ట్రాంగ్ డెసిషన్..!

త్రివిక్రమ్,మహేష్, త్రిష.. 'అతడు' మ్యాజిక్ రిపీట్ కానుందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>