EditorialGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ys-sharmila0a3a29ae-e627-45d8-b680-b58e5de50b6c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ys-sharmila0a3a29ae-e627-45d8-b680-b58e5de50b6c-415x250-IndiaHerald.jpgవైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు, నేరుగా కేసీఆర్ నే ఢీకొనేందుకు ప్రణాళిక రచించారు. అధికార టీఆర్ఎస్ పైనే విమర్శలు ఎక్కుపెట్టి దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో షర్మిల, మంత్రి కేటీఆర్ ని మరీ తీసిపడేసేలా గతంలో ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కేటీఆరా..? అంటే ఎవరు, సీఎం కేసీఆర్ కొడుకా..? అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అయితే ఆ విషయాన్ని షర్మిల అక్కడితో వదిలిపెట్టలేదు. తాజాగా కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె వేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. ys sharmila{#}KTR;Jagan;Press;Sharmila;Minister;Telangana Rashtra Samithi TRS;KCR;CM;Partyషర్మిల భయపడ్డారా..? భయపెట్టారా..?షర్మిల భయపడ్డారా..? భయపెట్టారా..?ys sharmila{#}KTR;Jagan;Press;Sharmila;Minister;Telangana Rashtra Samithi TRS;KCR;CM;PartyMon, 26 Jul 2021 09:00:00 GMTవైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు, నేరుగా కేసీఆర్ నే ఢీకొనేందుకు ప్రణాళిక రచించారు. అధికార టీఆర్ఎస్ పైనే విమర్శలు ఎక్కుపెట్టి దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో షర్మిల, మంత్రి కేటీఆర్ ని మరీ తీసిపడేసేలా గతంలో ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కేటీఆరా..? అంటే ఎవరు, సీఎం కేసీఆర్ కొడుకా..? అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అయితే ఆ విషయాన్ని షర్మిల అక్కడితో వదిలిపెట్టలేదు. తాజాగా కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె వేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది.

కేసీఆర్ కొడుకు కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మరోసారి సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చారు షర్మిల. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూనే.. తనదైన శైలిలో నిరుద్యోగుల సమస్యల్ని ప్రస్తావించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ చేసే మనసుని కేటీఆర్ కి భగవవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నట్టు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు షర్మిల.

" style="height: 1089px;">
 

అక్కడితో ఆ వ్యవహారం ఆగిపోయిందనుకుంటే పొరపాటే. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. కేటీఆర్ అభిమానులంతా ఓ రేంజ్ లో షర్మిలని ట్రోలింగ్ చేశారు. పరోక్షంగా జగన్ ని సీన్ లోకి తీసుకొచ్చారు. కేటీఆర్ ని విమర్శిస్తే ఊరుకునేది లేదని ఘాటుగా బదులిచ్చారు. ఈ ట్రోలింగ్ తో వెనకడుగేశారో లేక, ఇంకేదైనా కారణం ఉందో తెలియదు కానీ, కేటీఆర్ పై తాను వేసిన ట్వీట్ ని వెంటనే డిలీట్ చేశారు షర్మిల. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. షర్మిల  భయపడ్డారని, అందుకే ట్వీట్ డిలీట్ చేశారని కామెంట్లు పడ్డాయి. ట్వీట్ వేసే ధైర్యం లేనివారు రేపు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారంటూ లాజిక్ తీశారు చాలామంది.


" style="height: 921px;">


ట్రోలింగ్ మొదలు కావడంతో నేరుగా షర్మిల రియాక్ట్ అయ్యారు. పాత ట్వీట్ ని రీపోస్ట్ చేస్తున్నా చూడండి అంటూ మరోసారి అదే ట్వీట్ ని పోస్ట్ చేశారు. దీంతో మరోసారి కేటీఆర్ అభిమానులు షర్మిలను టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెట్టడం మొదలు పెట్టారు. మొత్తానికి కేసీఆర్ కొడుకు కేటీఆర్ అంటూ షర్మిల చేసిన ట్వీట్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ట్వీట్ వేయడం, తీయడం, మళ్లీ రీపోస్ట్ చేయడంతో.. షర్మిల ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. అయితే షర్మిల అభిమానులు, వైఎస్సార్టీపీ నేతలు ఆమెకు మద్దతుగా ట్వీట్లు వేస్తున్నారు. కేటీఆర్ అభిమానులకు కౌంటర్ ఇస్తున్నారు.



టార్గెట్ అయోధ్య!

డబ్బులు ఇస్తే పదవికి రాజీనామా చేస్తా.. కోమటిరెడ్డి సంచలనం ?

హస్తినలో దీదీ చక్రం తిప్పుతుందా..?

భూ నిర్వాసితుల పరిస్థితి ఇంతేనా..?

యడ్డి... ఉంటాడా.. పోతాడా

జగన్‌ బెయిల్‌ రద్దు విచారణ.. వైసీపీలో టెన్షన్‌ టెన్షన్‌..?

వైసీపీలో ఇప్పుడు అంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ కీలక దశకు చేరుకుంది. జగన్‌ అక్రమాస్తుల కేసులో బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగబోతోంది.

తెలంగాణలో ఇవాళ్టి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కాబోతోంది. ఇవాళ భూపాలపల్లి జిల్లాలో రేషన్‌ కార్డుల పంపిణీ లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. ఈ రేషన్ కార్డుల పంపిణీని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించనున్నారు. రాష్ట్రవాప్తంగా రేషన్‌ కార్డులు ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు పంపిణీ చేయనున్నారు.

తెలంగాణలో ఇవాళ్టి నుంచి రేషన్ పండుగ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>