PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/rajasthan-politics25aaadd3-c84f-4f7e-a2ec-bfc739bd2c56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/rajasthan-politics25aaadd3-c84f-4f7e-a2ec-bfc739bd2c56-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై దేశ వ్యాప్తంగా అసంతృప్తి జ్వాలలు రగులుతున్న నేపథ్యంలో, ఈ అవకాశాన్ని జాతీయ కాంగ్రెస్ ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఒక ప్రణాళిక ప్రకారం అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఈ మధ్యనే ప్రముఖ రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తీర్ధాన్ని పుచ్చుకున్న విషయం తెలిసిందే. RAJASTHAN POLITICS{#}Amarinder Singh;Rajasthan;Sachin Pilot;Ashok Gehlot;Punjab;Prashant Kishor;Congress;Cabinet;Deputy Chief Minister;CMరాజస్థాన్ పాలిటిక్స్: సీఎంపై పైలట్ పంతం నెగ్గేనా ?రాజస్థాన్ పాలిటిక్స్: సీఎంపై పైలట్ పంతం నెగ్గేనా ?RAJASTHAN POLITICS{#}Amarinder Singh;Rajasthan;Sachin Pilot;Ashok Gehlot;Punjab;Prashant Kishor;Congress;Cabinet;Deputy Chief Minister;CMMon, 26 Jul 2021 20:00:00 GMTప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై దేశ వ్యాప్తంగా అసంతృప్తి జ్వాలలు రగులుతున్న నేపథ్యంలో, ఈ అవకాశాన్ని జాతీయ కాంగ్రెస్ ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఒక ప్రణాళిక ప్రకారం అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఈ మధ్యనే ప్రముఖ రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తీర్ధాన్ని పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో బలోపేతం అవుతోందన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏ రాష్ట్రాల్లో అయితే సొంత పార్టీలో వివాదాలు ఉన్నాయో ముందుగా వారందరినీ ఒకటి తాటి పైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజుల ముందు వరకు పంజాబ్ లో రాజకీయ పరిస్థితులు ఎంత ఉత్కంఠగా ఉన్నాయో మనము చూశాము. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కి మరియు పీసీసీ అధ్యక్షుడు నవ జ్యోత్ సింగ్ కి మధ్యన ఉన్న వివాదాలను పరిష్కరించారు. 

ఇప్పుడు వీరిద్దరూ ఎటువంటి వివాదాలు లేకుండా కలిసి పనిచేయదనాయికి సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే కొంతకాలం నుండి రాజస్థాన్ లో కూడా సీఎం అశోక్ గెహ్లాట్ కు మరియు మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కు మధ్యన వివాదాలు వస్తున్న సంగతి తెలిసిందే. సచిన్ పైలట్ తనతో పాటు ఒక 18 మంది ఎమ్మెల్యేలను పోగేసుకుని సీఎంని ఎదిరించిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే రాజస్థాన్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కేబినెట్ విస్తరణ ఉండడంతో ఇప్పుడు వివాదాలు మరింత వేడెక్కే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సచిన్ పైలట్ నేతృత్వంలోని రెబల్ ఎమ్మెల్యేలు అంతా కలిసి సీఎంకు వ్యతిరేకంగా కొన్ని డిమాండ్లు చేస్తున్నారు. కాబట్టి జరగబోయే కేబినెట్ విస్తరణలో వీటిని దక్కించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం చూపు ఎవరి వైపు ఉందొ తెలియడం లేదు.

రాజకీయంగా అనుభవం ఉన్న అశోక్ గెహ్లాట్ వైపా లేదా ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్న యువకుడు సచిన్ పైలట్ వైపా అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే రాజస్థాన్ కాంగ్రెస్ లో వివాదాలు మరింత ముదరకుండా ఉండాలంటే, సచిన్ పైలట్ డిమాండ్లను నెరవేర్చే విషయంపైనే అధిష్టానం దృష్టి కేంద్రీకరించనుందని విశ్వసనీయ వర్గాలు అనుకుంటున్నాయి. ఇది కనుక జరిగితే అశోక్ గెహ్లాట్ పై సచిన్ పైలట్ తన పంతాన్ని నెగ్గించుకున్నట్లే ?



మంత్రి, ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు

మాజీ సీఎం యడ్యూరప్ప ఆశలు ఫలించేనా ?

తగ్గేదేలే అంటున్న కేసీఆర్.. ఇప్పుడు మరో హామీ?

ఏం చేద్దాం ఇప్పుడు : అంతా బాబే చేశారు?

కర్నటక రాష్ట్ర వ్యవహారాల కోసం ఢిల్లీ నుంచి బృందం

పెగాస‌స్‌పై మ‌మ‌తాబెన‌ర్జీ ద‌ర్యాప్తు?

ఇంద్రవెల్లి వేదికగా దళిత-గిరిజన దండోరా అందుకేనా..!?

మంత్రిగారు ఏమయ్యారో పాపం

ఈ అమ్మాయి విషయం లో జగన్ ఆశయం నెరవేరింది...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>